ఆయిల్‌పామ్ రైతు సదస్సు వాయిదా
Published Mon, Sep 12 2016 6:37 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
టి.నరసాపురం: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ఆయిల్‌పామ్ రైతు సదస్సు వాయిదా పడిందని నవభారత్ జోన్ ఆయిల్‌పామ్ రైతు సంఘం అధ్యక్షుడు ఆచంట సూర్యనారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సదస్సుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల సదస్సు వాయిదా పడిందని, మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement