పారిజాతగిరిలో తిరుప్పావై ప్రవచనం
పారిజాతగిరిలో తిరుప్పావై ప్రవచనం
Published Sat, Dec 17 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి తిరుప్పావై ప్రవచనం, బాలభోగ నివేదన, తీర్థ ప్రసాద గోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో అర్చకస్వాములు ఈ కార్యక్రమాలను జరిపించినట్టు ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు జంగారెడ్డిగూడెంకు చెందిన పోల్నాటి శ్రీను, పిల్లి శ్రీను, సింగంశెట్టి రామాంజనేయుల దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement