వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు.
సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం.
సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది.
కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది.
అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది.
ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు!
Comments
Please login to add a commentAdd a comment