చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్‌లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం.
లోతైన భూకంపాలు
లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉల్కా భూకంపం
చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి.
తేలికపాటి భూకంపం
చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూకంపాలు ఎంతసేపు ఉంటాయి?
భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి.
భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది.
ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్‌లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు?
Comments
Please login to add a commentAdd a comment