quake
-
చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?
చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్‌పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా భూకంపం చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. తేలికపాటి భూకంపం చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు ఎంతసేపు ఉంటాయి? భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు? -
మయన్మార్ లో భూకంపం!
న్యూ ఢిల్లీః భారత్ మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. భారత సరిహద్దు ప్రాంతంలోని వాయువ్య మయన్మార్ ను తాకిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్ లోనూ, ఈశాన్య భారతదేశంలోనూ అక్కడక్కడా ప్రకంపనలు సంభవించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. భూకంపం వల్ల వచ్చిన ప్రకంపనలకు జనం భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ళనుంచి బయటకు పరుగులు తీశారు. మాల్విక్ కేంద్రానికి 74 కిలోమీటర్ల ఆగ్నేయంగా రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.8 గా నమోదైనట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ వెల్లడించింది. -
ఆఫ్ఘన్లో భూకంపం
-
ఢిల్లీలో వస్తే పరిస్థితేమిటి?
న్యూఢిల్లీ: నేపాల్‌లో భూకంపం వస్తేనే ఉత్తర భారతమంతా వణికిపోయి కొంత ప్రాణనష్టం, ఆస్తినష్టం చోటుచేసుకుంది. అలాంటిది భూకంప చోటుచేసుకునేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉన్న ఢిల్లీలో భూకంపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడి నిర్మాణాలు తట్టుకోగలవా? వెంటనే తేరుకుని సహాయక చర్యలతో బయటపడగలమా? ప్రాణ నష్టాన్ని నివారించగలమా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరిముందు. అయితే, దీనిపై భవన నిర్మాణ ఇంజినీరింగ్‌లు మాత్రం భూకంపాన్ని ఢిల్లీ ఏమాత్రం తట్టుకోలేదని కుండబద్దలు కొడుతున్నారు. అక్కడ 80శాతం భవనాలు భూకంపాన్ని తట్టుకోలేని విధంగా ఉన్నాయని, ఈవిషయంలో గత పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజినీర్స్ అధ్యక్షుడు మహేశ్ టాండన్ అన్నారు. ఒక్కసారి ఢిల్లీలో భూకంపం వస్తే భవనాలు పూర్తిగా నేలమట్టమవుతాయని ఆయన హెచ్చరించారు. ఇది ఆందోళనకర పరిస్థితి అని ఆయన అన్నారు. ఇప్పటికే పరోక్షంగా అనుభవాన్ని పొందిన ఢిల్లీ ఇప్పటికే భవనాల పటిష్టతపై దృష్టిని సారించాలని సూచించారు. -
కోల్ కతాలో ఇద్దరి మృతి..
కోలకతా: ఉత్తర, ఈశాన్యభారతాన్ని వణికించిన భూకంపం పశ్చిమబెంగాల్ లోని పలు నగరాల్లో ప్రభావాన్ని చూపించింది. భూ ప్రకంపనలతో జనం భయభ్రాంతులయ్యారు. బెంగాల్ లో శనివారం సంభవించిన తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.9 గా నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి ఏరియాలో ఇద్దరు మరణించారు. దాదాపు ఇరవైమందికి తీవ్రగాయలయ్యాయి. గోడ కూలిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, భవనం కుప్పకూలిన ఘటనలో మరో మహిళ మరణించింది. భవన శిథిలాల కింద ఆమె మృతదేహాన్ని కనుగొన్నామని డిప్యూటీ కమిషనర్ పాల్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుప్రతులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోలకతా నగరంలోని పలు భవనాలు బీటలు వారాయి. ప్రజలు ఇళ్లల్లోంచి బయటుకు పరుగులు తీశారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాష్ట్రంలో నెలకొన్న భూకంపం పరిస్థితిపై స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా డార్జిలింగ్, సిలిగురి తదితర ఏరియాల్లోని సీనియర్ అధికారులతో చర్చించినట్లు ఆమె తెలిపారు. -
జపాన్ కు సునామీ హెచ్చరిక!
టోక్యో: జపాన్ లో తాజాగా చోటు చేసుకున్న భూకంప తీవ్రత మరోసారి సునామీకి దారి తీసే అవకాశం ఉన్నట్లు ఆ దేశా వాతావరణ ఏజెన్సీ స్పష్టం చేసింది. తైవాన్ కు సమీపంలోని హువాలియాన్ కు తూర్పు దిశగా సంభవించిన భూకంప తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. ఈ భూకంపం తరువాత సముద్రపు అలలు దక్షిణ ఒకానావా చైన్ దీవుల్ని తాకడంతో మూడు అడుగుల మేర సునామీ జాడలు కనిపించినట్లు నేషనల్ బ్రాడ్ కాస్టర్(ఎన్ హెచ్ కే) స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తైవాన్ లో కొన్ని చోట్ల బిల్డింగ్ లు కూడా కంపిచినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. మరోసారి జపాన్ లో సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసిన పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. సముద్రంలోనికి వెళ్లిన వారు వెంటనే తిరిగి ఇళ్లకు రావాలంటూ రేడియో, తదితర ప్రసార మాధ్యమాల ద్వారా ముందస్తు హెచ్చరికలు పంపింది. కాగా, భూకంప తీవ్రత డేటాను పరిశీలించిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపింది. 2011 లో జపాన్ లో చోటు చేసుకున్న పెను భూకంపం కాస్త సునామీకి దారి తీసిన సంగతి తెలిసిందే. -
న్యూగినియాలో భారీ భూకంపం
సిడ్నీ: పాప్వా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. వెయ్యికిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉన్నట్లు గుర్తించామని అమెరికా భూకంప తీవ్రత అంచనా అధికారులు తెలిపారు. సునామీ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా 65 కిలో మీటర్లలోతునుంచి ప్రకంపనలు వ్యాపించాయని, తీరప్రాంతానికి 54 కిలోమీటర్ల మేర ప్రభావం చూపినట్లు అధికారులు వెల్లడించారు. -
కశ్మీర్లో స్వల్ఫ భూకంపం
శ్రీనగర్: కాశ్మీర్లో స్వల్ఫ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 7.15గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.87 తీవ్రతతో ఇది నమోదైనట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. పాకిస్థాన్, జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ చోటుచేసుకోలేదు. -
జపాన్‌లో భూకంపం
-
జపాన్‌లో భూకంపం
టోక్యో: ఈశాన్య జపాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ ఏజేన్సీ సునామీ హెచ్చరిక జారీ చేసింది. 2011లో వచ్చిన సునామీ తర్వాత జపాన్ లోని ఫుకుషిమా అణురియాక్టర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అణురియాక్టర్లు ఉన్న ప్రాంతాల్లో భూకంప ప్రభావం పెద్దగా లేదని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్‌లో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం, ప్రపంచ వ్యాప్తంగా భూకంపతీవ్రత 6 లేదా అంతకన్నా ఎక్కవతో సంభవించే మొత్తం భూకంపాల్లో దాదాపు 20 శాతం జపాన్‌లోనే నమోదవుతున్నయి. -
కాశ్మీర్ లో భూకంపం.. రెక్టార్ స్కేలుపై తీవ్రత 5
న్యూఢిల్లీ: జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. దోడా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5గా నమోదైంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్టు వార్తలు రాలేదు. పాకిస్థాన్‌లోని నైరుతి ప్రాంతంలోనూ శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది.