
జపాన్ కు సునామీ హెచ్చరిక!
టోక్యో: జపాన్ లో తాజాగా చోటు చేసుకున్న భూకంప తీవ్రత మరోసారి సునామీకి దారి తీసే అవకాశం ఉన్నట్లు ఆ దేశా వాతావరణ ఏజెన్సీ స్పష్టం చేసింది. తైవాన్ కు సమీపంలోని హువాలియాన్ కు తూర్పు దిశగా సంభవించిన భూకంప తీవ్రత 6.6 గా నమోదు అయ్యింది. ఈ భూకంపం తరువాత సముద్రపు అలలు దక్షిణ ఒకానావా చైన్ దీవుల్ని తాకడంతో మూడు అడుగుల మేర సునామీ జాడలు కనిపించినట్లు నేషనల్ బ్రాడ్ కాస్టర్(ఎన్ హెచ్ కే) స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తైవాన్ లో కొన్ని చోట్ల బిల్డింగ్ లు కూడా కంపిచినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
మరోసారి జపాన్ లో సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసిన పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. సముద్రంలోనికి వెళ్లిన వారు వెంటనే తిరిగి ఇళ్లకు రావాలంటూ రేడియో, తదితర ప్రసార మాధ్యమాల ద్వారా ముందస్తు హెచ్చరికలు పంపింది. కాగా, భూకంప తీవ్రత డేటాను పరిశీలించిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపింది. 2011 లో జపాన్ లో చోటు చేసుకున్న పెను భూకంపం కాస్త సునామీకి దారి తీసిన సంగతి తెలిసిందే.