జపాన్‌లోభారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్‌స్కేల్‌పై తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది . జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్‌లోని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది.
ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
అదే విధంగా జపాన్‌కు వాతావరణ శాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment