మనకు అత్యంత ప్రియమైన వాళ్లను ఏదైన దుర్ఘటనలో కోల్పోతే ఆ బాధ మాటలకందనిది. ఇది అలాంటి ఇలాంటి ఆవేదన కాదు. అందులోనూ తల్లి బిడ్డలు, భార్యభర్తల్లో ఎవ్వరైన కానరాని లోకలకు వెళ్తే ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేంది. బతుకున్నన్ని రోజులు ఆ శోకాన్ని మోస్తుంటాం. అయితే కొన్నేళ్లుకు మాములు మనుషులుగా అవుతాం. రాను రాను వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్‌కి చెందిన వ్యక్తిని చూస్తే ఓ దుర్ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం ఇంతలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్వేషిస్తారా అని ఆశ్యర్యపోతారా. ప్రేమంటే ఇది కదా అనే ఫీల్ వస్తుంది. ఎవరతను? అతడి గాథ ఏంటంటే..
జపనీస్ వ్యక్తి యసువో టకామట్సుకి 2011లో సంభవించిన ప్రకృతి విపత్తు భార్యను దూరం చేసి, తీరని ఎడబాటు మిగిల్చింది. అయితే ఆ భయానక సునామీలో భార్య కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కనిపించలేదు. ఆమెకు అంత్యక్రియలు మంచిగా చేయాలనే ఆశతో ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె అవశేషాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. నిజానికి ఆ సునామీలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యుసువో భార్య యుకో ఓ బ్యాంకులో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎగిసిన రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో తకామాట్సు ఆమె అవశేషాల కోసం ఒక వాలంటీర్ సహాయంతో అన్వేషించడం మొదలుపెట్టాడు.
అంతేగాదు తన భార్య అవశేషాలు దొరక్కపోతాయా..? అని డైవింగ్ నేర్చుకుని మరీ మురికినీటిలో ముమ్మరంగా గాలిస్తున్నాడు. మంచు జలాలతో అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ తన భార్య అవశేషాల కోసం ఆ ఇరువురు వెతకడం విశేషం. ఇక యుకో చివరిగా తన భర్త కోసం ఫోన్‌లో రెండు సందేశాలను పంపింది. ఒకటి పంపేలోపు దుర్ఘటన భారిన పడగా ఇంకొకటి ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు పంపించింది. ఆమె చివరి సందేశం మీరు బాగున్నారా..? ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని పంపించింది.
పంపాలనుకున్న సందేశం.. సునామీ అత్యంత వినాశకరమైనద అని నాటి దుర్ఘటనను వివరించే యత్నం చేసింది. కాగా, తకామట్సు ఈ అన్వేషణ ఫలించడం కష్టమని తెలుసు కానీ తాను చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఆమె అవశేషాల కోసం అన్వేషించడం మాత్రమే అని ఆవేదనగా చెప్పాడు. అంతేగాదు ఈ సముద్రంలో వెతుకుతూ ఉంటే తాను ఆమెకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దంపతులు ప్రేమకు అసలైన అర్థం ఇచ్చారు కదా..!. అంతేగాదు భార్యభర్తలు ఒకరికొకరుగా ఉండటం అనే పదానికి అసలైన భాష్యం ఇచ్చారు ఈ ఇరువురు.
(చదవండి: ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..)
Comments
Please login to add a commentAdd a comment