
న్యూగినియాలో భారీ భూకంపం
సిడ్నీ: పాప్వా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. వెయ్యికిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉన్నట్లు గుర్తించామని అమెరికా భూకంప తీవ్రత అంచనా అధికారులు తెలిపారు. సునామీ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా 65 కిలో మీటర్లలోతునుంచి ప్రకంపనలు వ్యాపించాయని, తీరప్రాంతానికి 54 కిలోమీటర్ల మేర ప్రభావం చూపినట్లు అధికారులు వెల్లడించారు.