వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-8కు అర్హత సాధించింది.
ఇక ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో అఫ్గన్ జట్టు వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-సిలో ఉంది.
ఇక ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన రషీద్ ఖాన్ బృందం.. గ్రూప్ దశలో మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడో గెలుపు నమోదు చేసి ఆరు పాయింట్ల(నెట్ రన్‌రేటు +4.230)తో గ్రూప్-సి టాపర్‌గా నిలిచింది.
ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫజల్‌హక్ ఫరూకీ(3/16), నవీన్ ఉల్ హక్(2/4), నూర్ అహ్మద్(1/14) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి సత్తా చాటారు.
తేలికగా తలవంచని ప్రత్యర్థి
ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసిన పీఎన్‌జీ జట్టు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ ముందు అంత తేలికగా తలవంచలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులకే వెనుదిరిగాడు.
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గులాబిదిన్ నయీబ్(36 బంతుల్లో 49 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, మహ్మద్ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్) ఆచితూచి ఆడారు.
ఫలితంగా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసిన అఫ్గన్ జయభేరి మోగించింది. తద్వారా సూపర్-8 దశకు అర్హత కూడా సాధించింది. ఇక ఇప్పటికే వెస్టిండీస్ గ్రూప్-సి నుంచి సూపర్-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్ అయింది.
చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది?
Comments
Please login to add a commentAdd a comment