ఈశాన్య జపాన్లో మంగళవారం భూకంపం సంభవించింది.
టోక్యో: ఈశాన్య జపాన్లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ ఏజేన్సీ సునామీ హెచ్చరిక జారీ చేసింది.
2011లో వచ్చిన సునామీ తర్వాత జపాన్ లోని ఫుకుషిమా అణురియాక్టర్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అణురియాక్టర్లు ఉన్న ప్రాంతాల్లో భూకంప ప్రభావం పెద్దగా లేదని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్లో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం, ప్రపంచ వ్యాప్తంగా భూకంపతీవ్రత 6 లేదా అంతకన్నా ఎక్కవతో సంభవించే మొత్తం భూకంపాల్లో దాదాపు 20 శాతం జపాన్లోనే నమోదవుతున్నయి.