northern Japan
-
జపాన్‌కు లైన్ రాక్ టైఫూన్ దెబ్బ
-
జపాన్‌కు లైన్ రాక్ టైఫూన్ దెబ్బ
టోక్యో: ఉత్తర జపాన్ను లైన్ రాక్ టైఫూన్ కుదిపేసింది. కుండపోతగా వర్షాన్ని కురిపించింది. భారీ మొత్తంలో ఇళ్లను ధ్వంసం చేసింది. రెండు నదుల మీదుగా ఈ టైఫూన్ దూసుకురావడంతో దీనివల్ల పోటెత్తిన వరదలకు తొమ్మిదిమంది యువకులు మృత్యువాత పడ్డారు. వీరంతా కూడా ఒకే నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నవారు. జపాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇవాతేలోని ఇవాయ్జుమి పట్టణంపై లైన్ రాక్ టైపూన్ విరుచుకుపడింది. ఇక్కడ ఉన్న ఓ నర్సింగ్ హోమ్పైకి భారీగా కురుస్తున్న వర్షం కారణంగా పెద్ద మొత్తంలో వరద పోటెత్తింది. కాస్తంత తెరపినిచ్చిన తర్వాత అధికారులు సహాయక చర్యలు చేపట్టగా అనగరంలోని ఓ నర్సింగ్ హోమ్ లో తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ నర్సింగ్ హోమ్ నిండా బురద నిండుకుపోయి ఉంది. అలాగే, హొక్కాయిడో, మినామి-ఫురానో వంటి పలు పట్టణాల్లో చాలా మంది శిథిలాలకింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సమీపంలోని రెండు నదుల మీదుగా ఈ టైఫూన్ విరుచుకుపడటంతో తీవ్రత కాస్తంత ఎక్కువగా ఉంది. ఇక టోక్యోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 1,70వేలమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారిలో ఒక్క ఒఫునాటోకు చెందినవారే 38,300మంది ఉన్నారు. దాదాపు పది వేల నివాసాలకు విద్యుత్ లేకుండా పోయింది. -
జపాన్‌లో భూకంపం
-
జపాన్‌లో భూకంపం
టోక్యో: ఈశాన్య జపాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ ఏజేన్సీ సునామీ హెచ్చరిక జారీ చేసింది. 2011లో వచ్చిన సునామీ తర్వాత జపాన్ లోని ఫుకుషిమా అణురియాక్టర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అణురియాక్టర్లు ఉన్న ప్రాంతాల్లో భూకంప ప్రభావం పెద్దగా లేదని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్‌లో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం, ప్రపంచ వ్యాప్తంగా భూకంపతీవ్రత 6 లేదా అంతకన్నా ఎక్కవతో సంభవించే మొత్తం భూకంపాల్లో దాదాపు 20 శాతం జపాన్‌లోనే నమోదవుతున్నయి. -
ఎలుగుబంటితో తలపడిన పెంపుడు కుక్క
టోక్యో: ఎలుగుబంటి దాడి నుంచి ఆరేళ్ల బాలుడిని కాపాడిన ఓ పెంపుడు కుక్క ఉత్తర జపాన్ లో పతాక శీర్షికలకు ఎక్కింది. పోలీసులు, మీడియా దాన్ని హీరోగా కీర్తించాయి. షిబా ఇను అనే ఆరేళ్ల బాలుడు తన 80 ఏళ్ల ముత్తాతతో కలిసి శనివారం సాయంత్రం ఒడేట్ లో నది ఒడ్డుకు వాకింగ్ కు వెళ్లాడు. ఇదే సమయంలో మూడగులు ఎత్తున్న అడవి ఎలుగుబంటి ఒక్కసారిగా షిబాపై దాడి చేసింది. షిబా ముత్తాత భయంతో కారు దగ్గరకు పరుగులు తీశాడు. అయితే అక్కడే వున్న ఆయన పెంపుడు కుక్క గట్టిగా మొరుగుతూ, ఎలుగుబంటి వెంటపడింది. దీంతో ఎలుగుబంటి తోక ముడించింది. ఈ ఘటనలో షిబాకు స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స అనంతరం అతడికి ఇంటికి పంపించినట్టు పోలీసులు తెలిపారు. సాహసం చేసిన కుక్క పేరు మెగో(క్యూట్) అని వెల్లడయింది. ఎప్పుడూ మౌనంగా, భయంగా ఉండే మెగో ఎలుగుబంటిని తరిమికొట్టడం పట్ల షిబా ముత్తాత అమితాశ్చర్యం వ్యక్తం చేశాడు.