టోక్యో: ఉత్తర జపాన్ను లైన్ రాక్ టైఫూన్ కుదిపేసింది. కుండపోతగా వర్షాన్ని కురిపించింది. భారీ మొత్తంలో ఇళ్లను ధ్వంసం చేసింది. రెండు నదుల మీదుగా ఈ టైఫూన్ దూసుకురావడంతో దీనివల్ల పోటెత్తిన వరదలకు తొమ్మిదిమంది యువకులు మృత్యువాత పడ్డారు. వీరంతా కూడా ఒకే నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నవారు.
జపాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇవాతేలోని ఇవాయ్జుమి పట్టణంపై లైన్ రాక్ టైపూన్ విరుచుకుపడింది. ఇక్కడ ఉన్న ఓ నర్సింగ్ హోమ్పైకి భారీగా కురుస్తున్న వర్షం కారణంగా పెద్ద మొత్తంలో వరద పోటెత్తింది. కాస్తంత తెరపినిచ్చిన తర్వాత అధికారులు సహాయక చర్యలు చేపట్టగా అనగరంలోని ఓ నర్సింగ్ హోమ్ లో తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఆ నర్సింగ్ హోమ్ నిండా బురద నిండుకుపోయి ఉంది. అలాగే, హొక్కాయిడో, మినామి-ఫురానో వంటి పలు పట్టణాల్లో చాలా మంది శిథిలాలకింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సమీపంలోని రెండు నదుల మీదుగా ఈ టైఫూన్ విరుచుకుపడటంతో తీవ్రత కాస్తంత ఎక్కువగా ఉంది. ఇక టోక్యోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 1,70వేలమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారిలో ఒక్క ఒఫునాటోకు చెందినవారే 38,300మంది ఉన్నారు. దాదాపు పది వేల నివాసాలకు విద్యుత్ లేకుండా పోయింది.
జపాన్కు లైన్ రాక్ టైఫూన్ దెబ్బ
Published Wed, Aug 31 2016 11:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
Advertisement
Advertisement