కొత్త కరెన్సీ వచ్చిందోచ్..!
కొత్త కరెన్సీ వచ్చిందోచ్..!
Published Wed, Nov 9 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
జంగారెడ్డిగూడెం : రిజర్వు బ్యాంకు విడుదల చేసిన కొత్త కరెన్సీ నోట్లతో ఉన్న కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుంది. స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చెస్ట్‌కు ఈ కరెన్సీ వచ్చింది. రెండు ఎస్కార్ట్ వాహనాలతో పోలీసులు కరెన్సీ కంటైనర్ ముందు భాగంలో ఆర్‌బీఐ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉంది. కరెన్సీ కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుందని తెలసుకున్న పట్టణ ప్రజలు కంటైనర్‌ను చూసేందుకు వచ్చారు. రద్దు చేసిన రూ.500 , రూ.1000 కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చని పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నేడు అన్ని బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు
జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వద్ద గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి బ్యాంకులు పనిచేయనుండటంతో ఖాతాదారులంతా పెద్దెత్తున బ్యాంకుల వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.
Advertisement
Advertisement