wednesday night
-
ఇల్లు దగ్ధం
భీమవరం అర్బ న్ : స్థానిక గొల్లవానితిప్ప రోడ్డులోని డేగాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. డేగాపురంలోని యనమదుర్రు కాలువగట్టుపై కుంభా దుర్గారావు 15ఏళ్లుగా కుటుంబంతో నివాసముంటున్నాడు. వివాహాలకు కల్యాణ మండపాలు డెకరేష న్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన దుర్గారావు పిల్లలు, భార్యతో కలిసి బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసి పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో డెకరేష న్ వస్తువులు, ఇంట్లోని గృహోపకరణాలు, రూ. 50 వేల నగదు అగ్నికి ఆహూతయ్యాయని దుర్గారావు విలపించారు. సుమారు రూ.లక్షా 80 వేలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు కోరారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం సంభవించినట్టు అగ్నిమాపక అధికారి షేక్ జా న్ అహ్మద్ తెలిపారు. -
ఇల్లు దగ్ధం
భీమవరం అర్బ న్ : స్థానిక గొల్లవానితిప్ప రోడ్డులోని డేగాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. డేగాపురంలోని యనమదుర్రు కాలువగట్టుపై కుంభా దుర్గారావు 15ఏళ్లుగా కుటుంబంతో నివాసముంటున్నాడు. వివాహాలకు కల్యాణ మండపాలు డెకరేష న్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలతో ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన దుర్గారావు పిల్లలు, భార్యతో కలిసి బయటకు పరుగులు తీశారు. మంటలు ఎగిసి పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో డెకరేష న్ వస్తువులు, ఇంట్లోని గృహోపకరణాలు, రూ. 50 వేల నగదు అగ్నికి ఆహూతయ్యాయని దుర్గారావు విలపించారు. సుమారు రూ.లక్షా 80 వేలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు కోరారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం సంభవించినట్టు అగ్నిమాపక అధికారి షేక్ జా న్ అహ్మద్ తెలిపారు. ∙ -
కారులో మంటలు
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ రోడ్డులోని పెట్రోలు బంక్ పక్కన ఆగి ఉన్న కారు నుంచి బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బంది ఫోన్ చేయడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రేడియేటర్ వేడెక్కడం వల్ల ఈ మంటలు వ్యాపించాయని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. కారులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదమూ సంభవించలేదు. -
వట్లూరులో విజిలెన్స్ దాడి
వట్లూరు(పెదపాడు) : వట్లూరు గ్రామంలోని ఓ హోటల్‌పై విజిలెన్స అధికారులు బుధవారం దాడి చేశారు. విజిలెన్ స ఏవో శ్రీనివాసకుమార్ కథనం ప్రకారం.. పెదపాడు మండలంలోని వట్లూరు గేట్ సెంటర్లో హోటల్ నడుపుతున్న తూము శ్రీనివాసరావు వద్ద అనధికారకంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్పీ వి.సురేష్ బాబు ఆదేశాల మేరకు విజిలెన్స తహసీల్దార్ వి.శైలజ, విజిలెన్స ఏవో ఎం.శ్రీనివాస కుమార్ దాడిచేశారు. శ్రీనివాసరావు వద్ద ఉన్న ఆరు ఖాళీ సిలిడర్లు, రెండు నిండు సిలిండర్ల గురించి సరైన సమాధానం లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని అతనిపై నిత్యావసరవస్తువుల చట్టం 1959 సెక్షన్7(1) ప్రకారం.. కేసు నమోదు చేసినట్లువిజిలెన్స ఏవో శ్రీనివాసకుమార్ తెలిపారు. -
కొత్త కరెన్సీ వచ్చిందోచ్..!
జంగారెడ్డిగూడెం : రిజర్వు బ్యాంకు విడుదల చేసిన కొత్త కరెన్సీ నోట్లతో ఉన్న కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుంది. స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చెస్ట్‌కు ఈ కరెన్సీ వచ్చింది. రెండు ఎస్కార్ట్ వాహనాలతో పోలీసులు కరెన్సీ కంటైనర్ ముందు భాగంలో ఆర్బీఐ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉంది. కరెన్సీ కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుందని తెలసుకున్న పట్టణ ప్రజలు కంటైనర్‌ను చూసేందుకు వచ్చారు. రద్దు చేసిన రూ.500 , రూ.1000 కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చని పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు అన్ని బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వద్ద గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి బ్యాంకులు పనిచేయనుండటంతో ఖాతాదారులంతా పెద్దెత్తున బ్యాంకుల వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. -
కొత్త కరెన్సీ వచ్చిందోచ్..!
జంగారెడ్డిగూడెం : రిజర్వు బ్యాంకు విడుదల చేసిన కొత్త కరెన్సీ నోట్లతో ఉన్న కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుంది. స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చెస్ట్‌కు ఈ కరెన్సీ వచ్చింది. రెండు ఎస్కార్ట్ వాహనాలతో పోలీసులు కరెన్సీ కంటైనర్ ముందు భాగంలో ఆర్బీఐ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉంది. కరెన్సీ కంటైనర్ జంగారెడ్డిగూడెం చేరుకుందని తెలసుకున్న పట్టణ ప్రజలు కంటైనర్‌ను చూసేందుకు వచ్చారు. రద్దు చేసిన రూ.500 , రూ.1000 కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చని పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు అన్ని బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల వద్ద గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి బ్యాంకులు పనిచేయనుండటంతో ఖాతాదారులంతా పెద్దెత్తున బ్యాంకుల వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. -
ప్రత్తిపాడులో చోరీ
పెంటపాడు : ప్రత్తిపాడులో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నాలుగు కాసుల బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, దస్తావేజులు అపహరణకు గురయ్యాయి. పెంటపాడు ఎస్ఐ వి.సుబ్రమణ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ట్రిపుల్‌ఎఫ్ ఉద్యోగి కొండపల్లి శివసత్యనారాయణ బుధవారం ఉదయం డ్యూటీకి Ðð వెళ్లాడు. అతని కుటుంబసభ్యులు అదే రోజు దెందులూరు మండలం అప్పారావుపాలెం వెళ్లారు. డ్యూటీ ముగించుకున్న సత్యనారాయణ రాత్రికి ఆప్పారావుపాలెం వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నాలుగు కాసుల బంగారు ఆభరణాలు, వెండిగిన్నె, పొలం దస్తావేజులు, కొన్ని ఇతర వస్తువులు అపహరించారు. ఇంటి సమీపంలో ఉండే అతని సోదరుడు విషయం గమనించి సత్యనారాయణకు ఫో¯ŒSలో సమాచారం ఇచ్చారు. దీంతో వారు పెంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. -
మహిళ ఆత్మహత్య
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని రామ్‌నగర్‌లో బుధవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. రామ్‌నగర్‌కు చెందిన ఎస్కే నజీమున్నీసా (45) మాససిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కొంత కాలంగా మందుల వాడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కుమారుడు షేక్ షబ్బీర్ కూలిపనికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి మృతిచెంది ఉంది. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమె గతంలో నూతిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై డి.భగావన్ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు : నిడదవోలులో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక శాంతినగర్ వాటర్‌ట్యాంక్ సమీపంలోని గుత్తుల రంగారావు ఇంట్లో దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. ఈ ఇంట్లో గుత్తుల రంగారావు, అతని భార్య పార్వతి ఉంటున్నారు. మూడునెలల క్రితం రంగారావుకు గుండె ఆపరేషన్ చేయించేందుకు వారిద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఇంటి ముందు ద్వారం గొళ్లాన్ని విరిచేసి.. గుణపంతో తాళాన్ని బద్దలకొట్టి లోపలకు ప్రవేశించారు. ఇంట్లోని వస్తువులను చిందవందరగా పడేశారు. బీరువాను తెరచి అందులోని లాకర్లలో భద్రపరిచిన ఐదు కాసుల బంగారం, పూజగదిలో ఉన్న ఉన్న కేజీన్నర వెండి వస్తువులు, డిబ్బీలో దాచుకున్న రూ.20 వేలు అపహరించుకుపోయారు. బీరువాలో దేవుని పటాల వద్ద ఉన్న చిల్లర నాణేలను మాత్రం దుండగులు ముట్టుకోలేదు. పట్టణ ఎసై ్స ఎం. భగవాన్‌ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.