ప్రత్తిపాడులో చోరీ
Published Fri, Nov 4 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
పెంటపాడు : ప్రత్తిపాడులో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నాలుగు కాసుల బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, దస్తావేజులు అపహరణకు గురయ్యాయి. పెంటపాడు ఎస్‌ఐ వి.సుబ్రమణ్యం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ట్రిపుల్‌ఎఫ్ ఉద్యోగి కొండపల్లి శివసత్యనారాయణ బుధవారం ఉదయం డ్యూటీకి Ðð వెళ్లాడు. అతని కుటుంబసభ్యులు అదే రోజు దెందులూరు మండలం అప్పారావుపాలెం వెళ్లారు. డ్యూటీ ముగించుకున్న సత్యనారాయణ రాత్రికి ఆప్పారావుపాలెం వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నాలుగు కాసుల బంగారు ఆభరణాలు, వెండిగిన్నె, పొలం దస్తావేజులు, కొన్ని ఇతర వస్తువులు అపహరించారు. ఇంటి సమీపంలో ఉండే అతని సోదరుడు విషయం గమనించి సత్యనారాయణకు ఫో¯ŒSలో సమాచారం ఇచ్చారు. దీంతో వారు పెంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది.
Advertisement
Advertisement