శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి
శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి
Published Fri, Sep 16 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
జంగారెడ్డిగూడెం : విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని అభివద్ధి చెందాలని రాష్ట్రమంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అభివృద్ధి చెంది తల్లితండ్రులకు, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలన్నారు. చదువే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు కూడా వత్తి నైపుణ్యాలు పెంచుకుని విద్యార్థులను ఆణిముత్యాలుగా తయారుచేయాలన్నారు.
ఏజెన్సీలో గిరిజన విద్యార్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యార్థులు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రాన్ని నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాకు ఈ ఏడాది 212 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 3.27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. 12 వేల మంది ఉపాధ్యాయులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మోడల్ ప్రై మరీ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ప్రారంభించామన్నారు. జిల్లాలో 366 మందికి ఇన్‌సై ్పర్ అవార్డులు మంజూరు కాగా ఇప్పటి వరకు 255 మంది నమోదు చేసుకున్నట్టు చెప్పారు. ఒక్కొక్క అవార్డుకు పారితోషికంగా రూ. 5వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమచేసినట్టు తెలిపారు. కాగా 366 ప్రదర్శనలు రావాల్సి ఉండగా, 255 ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నారు. తొలుత మంత్రి పీతల సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. సభకు డీఈవో డి.మధుసూదనరావు అధ్యక్షతన వహించగా, ఐటీడీఏ పీవో ఎస్.షాన్‌మోమన్, నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, గంటా సుధీర్‌బాబు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జెడ్పీ వైస్‌చైర్ పర్సన్ చింతల వెంకటరమణ, నగర పంచాయతీ వైస్‌చైర్మన్ అట్లూరి రామ్మోహన్, మండవ లక్ష్మణరావు, డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎస్‌ఏపీవో బ్రహ్మానందరెడ్డి, కోనేరు సుబ్బారావు, ఎస్‌ఎంసీ చైర్మన్ ఆర్.బలరాం, ఏఎంవో ఎ.సర్వేశ్వరరావు, ఐటీడీఏ డీవైఈవో రామారావు, నగర పంచాయతీ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement