minister sujatha
-
10న రెండో విడత డ్వాక్రా రుణమాఫీ
ఏలూరు (మెట్రో): జిల్లాలో రెండో విడత రుణమాఫీ కింద డ్వాక్రా మహిళలకు రు.181.54 కోట్లను ఈనెల 10వ తేదీ నుంచి మహిళల బ్యాంకు ఖాతాలకు జమచేస్తామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం లో శనివారం సాయంత్రం డీఆర్డీఏ, వెలుగు పథకాల ప్రగతి తీరు, ధాన్యం కొనుగోలు, చంద్రన్న బీమా పథకం అమలు అంశాలపై ఆమె సమీక్షించారు. రెండో విడత సొమ్ము నేరుగా మహిళా గ్రూపులు వినియోగించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. జిల్లాలో రు.25 వేల కోట్లతో పరిశ్రమలను స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో దళితుల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు 600 ముర్రాజాతి గేదెలను 75 శాతం సబ్సిడీపై అందించనున్నామన్నారు. వెలుగు ఉద్యోగులకు 35 శాతం జీతాలు పెంచడంతో పాటు పనితీరును బట్టి మరో 10 శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, ఏపీడీ పూర్ణచంద్రరావు, కె.రవీంద్రబాబు, ఏపీఎంలు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి
జంగారెడ్డిగూడెం : విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని అభివద్ధి చెందాలని రాష్ట్రమంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్లో జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అభివృద్ధి చెంది తల్లితండ్రులకు, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలన్నారు. చదువే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు కూడా వత్తి నైపుణ్యాలు పెంచుకుని విద్యార్థులను ఆణిముత్యాలుగా తయారుచేయాలన్నారు. ఏజెన్సీలో గిరిజన విద్యార్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యార్థులు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రాన్ని నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాకు ఈ ఏడాది 212 కోట్లు బడ్జెట్లో కేటాయించారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 3.27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. 12 వేల మంది ఉపాధ్యాయులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మోడల్ ప్రై మరీ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ప్రారంభించామన్నారు. జిల్లాలో 366 మందికి ఇన్సై ్పర్ అవార్డులు మంజూరు కాగా ఇప్పటి వరకు 255 మంది నమోదు చేసుకున్నట్టు చెప్పారు. ఒక్కొక్క అవార్డుకు పారితోషికంగా రూ. 5వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమచేసినట్టు తెలిపారు. కాగా 366 ప్రదర్శనలు రావాల్సి ఉండగా, 255 ప్రదర్శనలు నమోదయ్యాయని అన్నారు. తొలుత మంత్రి పీతల సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. సభకు డీఈవో డి.మధుసూదనరావు అధ్యక్షతన వహించగా, ఐటీడీఏ పీవో ఎస్.షాన్మోమన్, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, గంటా సుధీర్‌బాబు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జెడ్పీ వైస్‌చైర్ పర్సన్ చింతల వెంకటరమణ, నగర పంచాయతీ వైస్‌చైర్మన్ అట్లూరి రామ్మోహన్, మండవ లక్ష్మణరావు, డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎస్ఏపీవో బ్రహ్మానందరెడ్డి, కోనేరు సుబ్బారావు, ఎస్ఎంసీ చైర్మన్ ఆర్.బలరాం, ఏఎంవో ఎ.సర్వేశ్వరరావు, ఐటీడీఏ డీవైఈవో రామారావు, నగర పంచాయతీ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
పనిచేసే అధికారులకు గుర్తింపు
జంగారెడ్డిగూడెం: పనిచేసే అధికారులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం పొందిన ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డిని విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. డీఈ సాల్మన్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి సుజాత ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎస్ఈ సత్యనారాయణరెడ్డిని పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఐదు రోజుల్లో విద్యుత్ సరఫరా ఇచ్చారని, విలీన మండలాలకు కొత్తగా విద్యుత్ లైన్ వేయడంలో చొరవ చూపారని చెప్పారు. జిల్లాలో సాగు, తాగునీటి సరఫరాకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. జిల్లాలో అవసరమైన విద్యుత్ ఉపకేంద్రాలకు ఎస్ఈ ప్రతిపాదనలు చేశారని వాటి అవసరాన్ని ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఈ దంపతులను సత్కరించారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఎంపీడీవో పి.శ్రీదేవి, నగర ‡పంచాయతీ కమిషనర్ సీహెచ్వెంకటేశ్వరరావు, చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పనిచేసే అధికారులకు గుర్తింపు
జంగారెడ్డిగూడెం: పనిచేసే అధికారులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం పొందిన ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డిని విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. డీఈ సాల్మన్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి సుజాత ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎస్ఈ సత్యనారాయణరెడ్డిని పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఐదు రోజుల్లో విద్యుత్ సరఫరా ఇచ్చారని, విలీన మండలాలకు కొత్తగా విద్యుత్ లైన్ వేయడంలో చొరవ చూపారని చెప్పారు. జిల్లాలో సాగు, తాగునీటి సరఫరాకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. జిల్లాలో అవసరమైన విద్యుత్ ఉపకేంద్రాలకు ఎస్ఈ ప్రతిపాదనలు చేశారని వాటి అవసరాన్ని ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఈ దంపతులను సత్కరించారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఎంపీడీవో పి.శ్రీదేవి, నగర ‡పంచాయతీ కమిషనర్ సీహెచ్వెంకటేశ్వరరావు, చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 43 మినీ రైతు బజార్లు
చింతలపూడి: రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 43 మండలాల్లో 43 మినీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజారును గురువారం ఆమె ప్రారంభించారు. జిల్లాలో ఆరు రైతు బజార్లలో మినహా మిగిలిన వాటిని శీతల గిడ్డంగులతో ప్రారంభిస్తున్నామన్నారు. చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొయ్యలగూడెం, నల్లజర్ల, మండలాల్లో రైతు బజార్ల కోసం ప్రభుత్వం రూ.47 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. ఏలూరులో ఈ–మార్కెట్ విధానం రాష్ట్రంలోని పది మార్కెట్ కమిటీల్లో ఈ–మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీనిలో భాగంగా ఏలూరు మార్కెట్ యార్డులో నిమ్మకాయల అమ్మకానికి ఈ–మార్కెట్ విధానం ప్రవేశపెట్టామని చెప్పారు. చింతలపూడిలో శీతల గిడ్డంగిని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి రైతు బజారుగా అభివద్ధి చేస్తామన్నారు. శుక్రవారం ప్రారంభించనున్న కోటి మొక్కల ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల 5వ తేదీ నుంచి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. రూ.10 కోట్లతో గుంటుపల్లి, కామవరపుకోట రహదారిని అభివద్ధి పరుస్తున్నామన్నారు. మార్కెటింగ్ శాఖ ఏడీ పి.ఛాయాదేవి,ఎంపీపీ దాసరి రామక్క, ఉద్యాన శాఖ ఏడీ దుర్గేష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి టీటీవీఎస్ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన ‘చింతలపూడి’ రైతులు చింతలపూడి ఎత్తిపోతల రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి వచ్చిన ఆమె ఎత్తిపోతల పథకం రైతులను కలిశారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించకుండా కాలువ పనులు చేపడుతుందని రైతులు ఆమె దష్టికి తీసుకువచ్చారు. -
పల్స్ సర్వేపై భయం వద్దు
ఏలూరు (మెట్రో): జిల్లాలో చేపట్టిన ప్రజాసాధికారి సర్వేపై ఎటువంటి భయం వద్దని, ప్రజా శ్రేయస్సు కోసమే సర్వే నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మొక్కల పెంపకం, మినీ రైతుబజార్ల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో బుధవారం ఆమె సమీక్షించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో సర్వేకు మంచి స్పందన వస్తోందని, సాంకేతిక సమస్యల వల్ల సర్వేలో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. జాప్యం నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరామని చెప్పారు. ఈ ఏడాది రూ.418 కోట్లతో 18,400 ఇళ్లను సంక్రాంతిలోపు నిర్మించాలని అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో 50 మినీ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. జిల్లా అటవీ శాఖాధికారి ఎన్.నాగేశ్వరరావు, రేంజర్ ధనరాజ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషి
జంగారెడ్డిగూడెం రూరల్ : రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. గురువారం మండలంలోని కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ నుంచి ఖరీఫ్ పంటకు సాగునీటిని ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా పీతల మాట్లాడుతూ గోదావరిలో ఏటా 724 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుందని, ఆ నీటిని సద్వినియోగం చేసేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి కృష్ణా జిల్లాకు తరలిస్తున్నట్టు చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి తమ్మిలేరు, ఎర్రకాల్వ ప్రాజెక్టులను అనుసంధానం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతున్నట్టు చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పూరై్తతే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎర్రకాలువ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని సుమారు 5 వేల ఎకరాలకు 100 క్యూసెక్కుల నీరు ఖరీఫ్ పంట నిమిత్తం విడుదల చేయడం జరిగిందన్నారు. మండలంలోని శ్రీనివాసపురం, తాడువాయిలలో రూ.1.50 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లను మంత్రి పీతల సుజాత గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, సర్పంచ్‌లు పి.దుర్గాదేవి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.