పనిచేసే అధికారులకు గుర్తింపు
జంగారెడ్డిగూడెం: పనిచేసే అధికారులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం పొందిన ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డిని విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. డీఈ సాల్మన్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి సుజాత ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డిని పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఐదు రోజుల్లో విద్యుత్ సరఫరా ఇచ్చారని, విలీన మండలాలకు కొత్తగా విద్యుత్ లైన్ వేయడంలో చొరవ చూపారని చెప్పారు. జిల్లాలో సాగు, తాగునీటి సరఫరాకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. జిల్లాలో అవసరమైన విద్యుత్ ఉపకేంద్రాలకు ఎస్‌ఈ ప్రతిపాదనలు చేశారని వాటి అవసరాన్ని ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎస్‌ఈ దంపతులను సత్కరించారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఎంపీడీవో పి.శ్రీదేవి, నగర ‡పంచాయతీ కమిషనర్ సీహెచ్‌వెంకటేశ్వరరావు, చైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.