jrg
-
మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం
జంగారెడ్డిగూడెం (చింతలపూడి ): స్థానిక బుట్టాయగూడెం బైపాస్‌రోడ్డు జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బుట్టాయగూడానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి బచ్చు వెంకట సూర్యనారాయణ మోటార్‌సైకిల్‌పై జంగారెడ్డిగూడెం వచ్చి తిరిగి వెళుతుండగా బుట్టాయగూడెం జంక్షన్ లో తెలంగాణకు చెందిన ట్రక్ ఆటో ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యా యి. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతదేహానికి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని భార్య బండ్రెడ్డి లక్షీ్మకుమారి బుట్టాయగూడెంలోని బూసరాజుపల్లి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. -
నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్
జంగారెడ్డిగూడెం : కానిస్టేబుల్‌నని చెబుతూ బంగారు వస్తువులు లాక్కుపోయే ఓ వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్సై ఎం.కేశవరావు కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం దొరమామిడికి చెందిన దంగేటి నాగదుర్గారావు కొంతకాలంగా జంగారెడ్డిగూడెంలో ఉంటున్నాడు. అతను డిసెంబర్ 7న, ఈనెల 16న గోకుల తిరుమల పారిజాతగిరికి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు కానిస్టేబుల్‌నని చెప్పి బంగారు వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలని సూచించాడు. అతని సూచన మేరకు వస్తువులు చేతితో పట్టుకున్న విద్యార్థుల నుంచి వాటిని లాక్కుని పరారయ్యాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అతనిని అరెస్ట్ చేశారు. దుర్గారావు వద్ద నుంచి చెవిదిద్దుల జత స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతను ముత్తూట్ ఫైనాన్స్ లో కుదవపెట్టిన బంగారు ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. తాపీ పనిచేస్తూ జీవించే దుర్గారావుకు ఇద్దరు భార్యలు. రెండు కుటుంబాలను పోషించలేకే అతను చోరీలకు పాల్పడుతున్నట్టు ఎస్సై కేశవరావు తెలిపారు. ∙ -
ఇద్దరు మోటార్‌సైకిల్ దొంగల అరెస్ట్
జంగారెడ్డిగూడెం : స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రెండు రోజులు వరుసగా రెండు మోటార్ సైకిళ్లు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యడ్లపల్లి శ్రీను అనే వ్యక్తి ఈనెల 9న స్థానికి ఎస్బీఐ బయట మోటార్ సైకిల్ ఉంచి బ్యాంకులోకి వెళ్లి వచ్చేసరికి అతని మోటార్‌సైకిల్ చోరీకి గురైంది. అలాగే 10న బేతపూడి జాన్ చౌదరి మోటార్‌సైకిల్ కూడా ఇలాగే చోరీకి గురైంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లను చోరీ చేసిన పట్టణానికి చెందిన అల్లాడి వీరన్న, తెల్లపల్లి ప్రసాద్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే నిందితులు తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన మరో మోటార్‌సైకిల్ కూడా దొంగిలించినట్టు అంగీకరించారని ఎస్సై తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. -
పవనసుతునికి ప్రణామం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మ ద్ది ఆంజనేయస్వామి ఆలయం హనుమద్ నామస్మరణతో మార్మోగింది. కార్తీక మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామిని విశేషంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 40 వేల మందికి అన్నదానం తిరుమలదేవిపేటకు చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి బాల భక్త భజన మండలి సభ్యులు ఆంజనేయ భజన, హనుమాన్ చాలీసా పారాయణం చేశా రు. ఆలయానికి ఒక్కరోజు ఆదాయం రూ.5,39,126 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. చక్రదేవరపల్లి గ్రామస్తులు అందించిన అన్నప్రసాదాన్ని సుమారు 40 వేల మంది స్వీకరించారు. విశాఖజిల్లా అనకాపల్లికి చెందిన బొడ్డు శ్రీమన్నారాయణ, కస్తూరిబాయి దంపతులు భక్తులకు 50 వేల గారెలను పంచిపెట్టారు. ఆర్డీవో ఎస్.లవన్న, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు స్వామిని దర్శించుకున్నారు. అటవీశాఖాధికారులు మొక్కలు, కరూ ర్ వైశ్యా బ్యాంకు సిబ్బంది వాటర్ ప్యాకెట్లు అందజేశారు. చైర్మన్ ఇందుకూరి రంగరాజు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పారిజాతగిరివాసునికి వెండి బిందె సమర్పణ
జంగారెడ్డిగూడెం : పారిజాతగిరి శ్రీవెంకటేశ్వరస్వామి వారి నిత్య కైంకర్యాల్లో భాగంగా నిర్వహించే అభిషేక కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఇనగంటి శ్రీనివాసరావు వెండి బిందెను సమర్పించారు. సుమారు 900 గ్రాముల బరువు ఉండే ఈ వెండి బిందెను భార్య భూలక్ష్మిదేవితో కలిసి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో శ్రీనివాసరావు దంపతులను ఆశీర్వదించి, స్వామి వారి శేషవస్త్రాలు బహూకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయణ, తోట రామకృష్ణ, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీలో డయాలసిస్ కేంద్రాలు
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం, తణుకు ప్రభుత్వాసుపత్రుల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు డీసీహెచ్ఎస్ కె.శంకరరావు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు శనివారం వైద్యులు, పట్టణవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రాల నిర్వహణకు జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్, తణుకులో లయన్స్ క్లబ్ ముందుకు వచ్చాయన్నారు. వీటి భాగస్వామ్యంతో రెండు నెలల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో వైద్యనిపుణుల నియామకం త్వరలో ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలోని ఆయా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం చేపట్టనున్నట్టు డీసీహెచ్ఎస్ శంకరరావు తెలిపారు. జిల్లాలో 18 మంది స్పెషలిస్టులు, 12 మంది సివిల్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలు అందించేందుకు, వైద్యసేవలు మెరుగుపర్చేందుకు ఈ ప్రాంత నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఇటీవల ఆసుపత్రిలో ప్రసూతి సేవలు నిలిచిపోవడంతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో గర్భిణులు ఎక్కువ రక్తహీనత కలిగి ఉంటున్నారని చెప్పారు. రక్తం అందుబాటులో లేక ఇక్కడ వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఆసుపత్రిలో ఆప్తమాలజిస్ట్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలో నియామకం చేపడతామన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ దల్లి కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ డి.భాస్కరరావు, వైద్యులు, ఆసుపత్రి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
తేనెటీగల పెంపకం యూనిట్లకు రాయితీలు
జంగారెడ్డిగూడెం : తేనెటీగల పెంపకం కోసం రాయితీ కల్పిస్తున్నట్టు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అడపా దుర్గేష్ తెలిపారు. మంగళవారం తేనెటీగల పెంపకంపై శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొని మాట్లాడారు. తేనెటీగల పెంపకం కోసం ఒక్కో యూనిట్‌కు 8 బాక్సులు అందజేస్తామని, దీనికి యూనిట్‌కు రూ. 20 వేలు రాయితీ ఇస్తున్నామన్నారు. ఒక్కో బాక్సు నుంచి 40 కేజీల తేనె ఉత్పత్తి అవుతుందని 40 నుంచి 60 రోజుల్లో దిగుబడి వస్తుందన్నారు. తాము అందజేసిన తేనెటీగల పెంపకం బాక్సులు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలు పూతదశలో ఉండగా ఆ బాక్సులను అక్కడ పెడితే త్వరితగతిన తేనె దిగుబడి వస్తుందన్నారు. పంటలు కూడా ఫలదీకరణ చెంది పంట దిగుబడి పెరుగుతుందన్నారు. తేనెటీగల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చన్నారు. పే ద కుటుంబాలను ఎంపిక చేసి తేనెటీగల పెంపకానికి రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. విజయరాయి శాస్త్రవేత్త డాక్టర్ రావు, ఉద్యాన శాఖ అధికారి ఆర్.బిందు ప్రవీణ, గిరిజన వికాస సంస్థ ప్రతినిధి మూర్తి పాల్గొన్నారు. -
జాలర్ల వలలో నల్లత్రాచు
జంగారెడ్డిగూడెం : జలాశయం వద్ద చేపలు, రొయ్యల కోసం ఏర్పాటు చేసిన మావు(ఇనుప ఊసలతో ఏర్పాటు చేసిన జల్లెడ లాంటి చతురాస్రాకార బాక్సు)లో నల్లత్రాచు పడడంతో జాలర్లు బెంబేత్తిపోయిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎర్రకాలువ జలాశయంలో వరదనీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో జాలర్లు మండలంలోని ఎ.పోలవరం జలాశయంలో చేపలు, రొయ్యల కోసం మావులు ఏర్పాటు చేశారు. ఈ మావుల్లో సుమారు 9 అడుగుల పొడవున్న నల్లత్రాచు పాము పడింది. మావులు బయటకు తీసి చూసేసరికి జాలర్లకు చేపలకు బదులు నల్లత్రాచు కనబడటంతో హడలెత్తారు. వెంటనే తేరుకుని మావు నుంచి త్రాచును చేపల వలలోకి మళ్లించారు. అరుదుగా కనిపించే ఈ నల్లత్రాచును చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. అయితే భక్తిభావంతో మత్స్యకారులు నల్లత్రాచును చంపకుండా సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లి వదిలివేశారు. -
రాష్ట్ర టీ 20 జట్టుకు ప్రేమ్
జంగారెడ్డిగూడెం : తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కె.జస్వంత్ సాయి ప్రేమ్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి టీ20 క్రికెట్ జట్టుకు ఎంపికైనట్టు ప్రతిభ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఏపీ యూత్ టీ20 క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన నేషనల్ యూత్ టీ20 క్రికెట్ చాంపియన్ షిప్ సెలక్షన్స్‌లో ప్రేమ్ ప్రతిభ చూపినట్టు చెప్పారు. సెప్టెంబర్ 11 నుంచి కోల్‌కతాలో నిర్వహించనున్న టీ20 టోర్నమెంట్లో ప్రేమ్ పాల్గొంటాడని చెప్పారు. ఈ సందర్భంగా ప్రేమ్‌ను స్కూల్ డైరెక్టర్లు సత్యనారాయణరెడ్డి, సుభాష్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
పనిచేసే అధికారులకు గుర్తింపు
జంగారెడ్డిగూడెం: పనిచేసే అధికారులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం పొందిన ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డిని విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. డీఈ సాల్మన్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి సుజాత ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎస్ఈ సత్యనారాయణరెడ్డిని పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఐదు రోజుల్లో విద్యుత్ సరఫరా ఇచ్చారని, విలీన మండలాలకు కొత్తగా విద్యుత్ లైన్ వేయడంలో చొరవ చూపారని చెప్పారు. జిల్లాలో సాగు, తాగునీటి సరఫరాకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. జిల్లాలో అవసరమైన విద్యుత్ ఉపకేంద్రాలకు ఎస్ఈ ప్రతిపాదనలు చేశారని వాటి అవసరాన్ని ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఈ దంపతులను సత్కరించారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఎంపీడీవో పి.శ్రీదేవి, నగర ‡పంచాయతీ కమిషనర్ సీహెచ్వెంకటేశ్వరరావు, చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పనిచేసే అధికారులకు గుర్తింపు
జంగారెడ్డిగూడెం: పనిచేసే అధికారులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక ఆలపాటి గంగాభవానీ కల్యాణ మండపంలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం పొందిన ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డిని విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. డీఈ సాల్మన్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి సుజాత ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎస్ఈ సత్యనారాయణరెడ్డిని పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఐదు రోజుల్లో విద్యుత్ సరఫరా ఇచ్చారని, విలీన మండలాలకు కొత్తగా విద్యుత్ లైన్ వేయడంలో చొరవ చూపారని చెప్పారు. జిల్లాలో సాగు, తాగునీటి సరఫరాకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. జిల్లాలో అవసరమైన విద్యుత్ ఉపకేంద్రాలకు ఎస్ఈ ప్రతిపాదనలు చేశారని వాటి అవసరాన్ని ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ఈ దంపతులను సత్కరించారు. ఆర్డీవో ఎస్.లవన్న, తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ, ఎంపీడీవో పి.శ్రీదేవి, నగర ‡పంచాయతీ కమిషనర్ సీహెచ్వెంకటేశ్వరరావు, చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ బిల్లులు సరిచేస్తాం
జంగారెడ్డిగూడెం: పోలవరం ప్రాజెక్ట్ పునరావాస కాలనీ వాసులకు అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు సరిచేస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏడీఈ కె.గోపాలకష్ణ తెలిపారు. ఈనెల 17న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పునరావాసంలో విద్యుదావేశం’ శీర్షికన కథనానికి ఈపీడీసీఎల్ అధికారులు స్పందించారు. స్థానిక పేరంపేట రోడ్డులో రామయ్యపేట, పైడిపాక పునరావాస కాలనీలో గురువారం ఏడీఈ కె.గోపాలకృష్ణ, లక్కవరం ఏఈ కె.వెంకటేశ్వరరావు, అకౌంట్స్ అధికారి కె.ఉమామహేశ్వరరావు, ఎల్ఐ పి.గణేష్‌బాబు, లైన్‌మన్ వి.జాన్ పర్యటించారు. కాలనీలో అయా ఇళ్లకు తీసిన విద్యుత్ బిల్లులను పరిశీలించారు. ప్రతి ఇంటా తిరిగి విద్యుత్ మీటర్లలో నమోదైన రీడింగ్‌ను పరిశీలించారు. అనంతరం ఏడీఈ మాట్లాడుతూ ఈ రెండు కాలనీలకు సంబంధించి ఏప్రిల్ నెలలో మీటర్లకు ప్రభుత్వం నుంచి నగదు చెల్లించారని, అయితే కాలనీవాసులు తమ ఆధార్‌కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు దశల వారీగా ఇవ్వడంతో మీటర్లు ఆన్లైన్ కాలేదన్నారు. అయినా కాలనీవాసులు విద్యుత్ వినియోగిస్తున్నారని చెప్పారు. ఇటీవల 60 కనెక్షన్లు ఆన్లైన్ కాగా వాటి విద్యుత్ రీడింగ్ తీశామన్నారు. నాలుగైదు నెలలకు ఒకే ప్లాట్‌గా రీడింగ్ తీయడం వల్ల శ్లాబు రేటు ఎక్కువగా పడిందని చెప్పారు. అధికంగా వచ్చిన బిల్లులు పరిశీలించి రీడింగ్ మొత్తాన్ని ఏ నెలకు ఆనెల సరిచేసి మరలా కొత్త బిల్లులు జారీ చేస్తామని, దీని వల్ల వినియోగదారులకు రూ.500 నుంచి రూ.1,500 వరకు బిల్లు తగ్గే అవకాశం ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కాలనీవాసులకు ఏడీఈ హామీ ఇచ్చారు. -
జిల్లాలో వైరల్ జ్వరాలు
జంగారెడ్డిగూడెం : జిల్లాలో వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయని, జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీహెచ్ఎస్ (జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి) డాక్టర్ కె.శంకర్రావు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆసుపత్రులు జ్వరపీడితులతో నిండిపోయాయని పేర్కొన్నారు. వైరల్ ఫీవర్స్‌తో పాటు టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలో మాత్రం అక్కడక్కడ రోజుకు 5 నుంచి 7 మలేరియా కేసులు నమోదు అవుతున్నట్టు చెప్పారు. మలేరియాకు సంబంధించి అధునాతన మందులు అందుబాటులోకి వచ్చాయని, దీనివల్ల ఇబ్బందులులేవన్నారు. అలాగే జిల్లాలో జ్వరపీడితులందరికీ అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచామని, ఇబ్బందులు లేవన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో ఉన్న మాస్టర్ మహిళా హెల్త్ చెకప్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.భాస్కరరావు, డాక్టర్ డి.వరహాలరాజు, డీసీఎస్ ఓ.దిలీప్‌కుమార్, డాక్టర్ సునీత, డాక్టర్ శోభారాణి పాల్గొన్నారు. -
మండల పరిషత్‌లో అగ్నిప్రమాదం
జంగారెడ్డిగూడెం రూరల్ : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఒక గదిలో భద్రపరిచిన రికార్డులు, బీరువా, చెక్క పెట్టెలు పాత కంప్యూటర్ కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన గదిలోనే గ్యాస్‌బండ కూడా ఉంది. అదృష్టవశాత్తూ అది పేలలేదు. పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు. మంటలు చెలరేగుతున్న సమయంలో గుర్తించిన నైట్‌వాచ్‌మన్ మంగరాజు అధికారులకు సమాచారం ఇచ్చారు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక వాహనం అందుబాటులో లేకపోవడంతో చింతలపూడి అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. కార్యాలయం ఎదుట వేసవిలో చలివేంద్రం కోసం ఏర్పాటు చేసిన తాటాకు పాక నుంచి మంటలు చెలరేగి అనంతరం కార్యాలయంలో లోపలకు విస్తరించి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రాత్రి ఒంటి గంటసమయంలో ప్రమాదం జరిగిందని, పాత రికార్డులు కాలిబూడిదయ్యాయని ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు. కార్యాలయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తే తప్ప కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాలు తెలుస్తాయని, అప్పుడే నష్టం ఎంత వాటిల్లిందనేది స్పష్టత వస్తుందని సమాచారం. ఈ ప్రమాదం విద్యుత్ షార్టుసర్కూ్కట్ వల్లగానీ, లేక కేర్లెస్స్మోకింగ్ వల్ల చలివేంద్ర షెడ్డుకు నిప్పంటుకుండడం వల్లగానీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయమంతా నల్లగా పొగబారిపోయింది.