తేనెటీగల పెంపకం యూనిట్లకు రాయితీలు
Published Wed, Oct 5 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
జంగారెడ్డిగూడెం : తేనెటీగల పెంపకం కోసం రాయితీ కల్పిస్తున్నట్టు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అడపా దుర్గేష్ తెలిపారు. మంగళవారం తేనెటీగల పెంపకంపై శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొని మాట్లాడారు. తేనెటీగల పెంపకం కోసం ఒక్కో యూనిట్‌కు 8 బాక్సులు అందజేస్తామని, దీనికి యూనిట్‌కు రూ. 20 వేలు రాయితీ ఇస్తున్నామన్నారు. ఒక్కో బాక్సు నుంచి 40 కేజీల తేనె ఉత్పత్తి అవుతుందని 40 నుంచి 60 రోజుల్లో దిగుబడి వస్తుందన్నారు. తాము అందజేసిన తేనెటీగల పెంపకం బాక్సులు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలు పూతదశలో ఉండగా ఆ బాక్సులను అక్కడ పెడితే త్వరితగతిన తేనె దిగుబడి వస్తుందన్నారు. పంటలు కూడా ఫలదీకరణ చెంది పంట దిగుబడి పెరుగుతుందన్నారు. తేనెటీగల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చన్నారు. పే ద కుటుంబాలను ఎంపిక చేసి తేనెటీగల పెంపకానికి రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. విజయరాయి శాస్త్రవేత్త డాక్టర్ రావు, ఉద్యాన శాఖ అధికారి ఆర్.బిందు ప్రవీణ, గిరిజన వికాస సంస్థ ప్రతినిధి మూర్తి పాల్గొన్నారు.
Advertisement