Training classes
-
గురువులకు నిర్బంధ శిక్షణా?
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.బుధవారం వేకువజామున రత్నకుమార్‌కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి. ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళనటీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. 200 మందికి పైగా హెచ్ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్‌లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్‌కుమార్ తెలిపారు. రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు. -
బీజేపీ నేతలకు శిక్షణ తరగతులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు మూడురోజుల శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్, జాతీయ సంస్థాగత సహ కార్యదర్శి శివప్రకాశ్, జాతీయకార్యదర్శి అరవింద్ మీనన్, బీజేపీ ప్రశిక్షణ్ కమిటీ జాతీయ ఇన్చార్జి పి. మురళీధర్‌రావు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు ఈ తరగతులు జరుగుతాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు దాదాపు 300 మంది నాయకులు తరగతులకు హాజరు కానున్నారు. మొత్తం 14 సెషన్స్.. పార్టీలో పలువురు కొత్త నాయకులు చేరిన నేపథ్యంలో వారితో పాటు రాష్ట్ర నాయకులకు పార్టీ సిద్ధాంతాలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే దిశగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీజేపీ నేపథ్యం, సైద్ధాంతిక భూమిక, ఆరెస్సెస్‌తో పార్టీ సంబంధాలు, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంతో దేశానికి కలిగిన ప్ర యోజనాలు తదితర అంశాలపై వివరించనున్నా రు. ప్రారంభం, ముగింపు కార్యక్రమాలతో కలిపి మొత్తం 14 సెషన్స్ ఉంటాయని పార్టీ ముఖ్యనేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మోదీ సర్కార్ సాధించిన విజయాలపై కిషన్‌రెడ్డి, విదేశాంగ విధానంపై విజయ్ చౌతేవాలా, సంస్థాగత అంశాలపై సునీల్ బన్సల్, పార్టీ చరిత్రపై మురళీధర్‌రావు, సాంస్కృతిక జాతీయ వాదం అంశాలపై ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న ఇద్దరు తెలుగునేతలు ప్రసంగించనున్నారు. బీఎల్ సంతోష్ హాజరవుతారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈ నెల 21న తమ ఎదుట హాజరుకావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరవుతారా? లేదా? అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముందుగా సిద్ధం చేసిన షెడ్యూల్ ప్రకారం సంతోష్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, సంతోష్‌ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించడం బీజేపీకి ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ -
Agnipath Scheme: దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు
సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నేవీలో మొదటి బ్యాచ్‌కు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు. ఐఏఎఫ్‌లో డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్‌లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. -
6 వేల మంది జర్నలిస్టులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9 జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణాతరగతులు నిర్వహించామని, వీటి ద్వారా 6 వేల మంది జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరచుకున్నారని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడే 12 పుస్తకాలు మీడియా అకాడమీ ప్రచురించి శిక్షణ తరగతుల్లో ఒక కిట్‌ను జర్నలిస్టులకు అందజేస్తుందని వెల్లడిం చారు. సీఎం కేసీఆర్ మీడియా అకాడమీకి రూ.100 కోట్ల నిధిని ప్రకటించి, ఇప్పటివరకు రూ.42 కోట్లు విడుదల చేశారని తెలిపారు. రూ.42 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.16 కోట్లను జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అకాడమీ అందజేసిందని వివరించారు. -
మహిళా జర్నలిస్టులకు రెండ్రోజుల శిక్షణా తరగతులు
సాక్షి, హైదరాబాద్: మహిళా జర్నలిస్టుల కు ఈనెలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలనుకునే వారు మీడియా అకాడమీ మేనేజర్ వనజ (7702526489)కు ఫోన్ చేసి, పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారు ఆయా జిల్లాల పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటిరోజు ‘మహిళా జర్నలిస్టులు– ప్రధాన స్రవంతి మీడియా– మహిళల పాత్ర’, ‘పాత్రికేయ రంగంలో మహిళలు– ప్రత్యేక సమస్యలు’అనే అంశంపై తరగతులు ఉంటాయని తెలిపారు. రెండో రోజు ‘మహిళా అస్తిత్వం–జెండర్ సెన్సిటైజేషన్’, ‘ఫీచర్ జర్నలిజం– మెళకువలు’అనే అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్టాతులైన వారి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. -
ఇంట్లో తాగునీటి శుద్ధి–నిల్వపై ఫిబ్రవరిలో చర్చాగోష్టి
ఆర్.ఓ. పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.), ఎస్.ఎం.సెహగల్ ఫౌండేషన్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న మెరుగైన ‘ఇంటి స్థాయిలో తాగునీటి శుద్ధి– నిల్వ పద్ధతుల’పై అనుభవాలను పంచుకునేందుకు, జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఫిబ్రవరి 27–28 తేదీల్లో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.లో చర్చాగోష్టి జరగనుంది. కెనడాకు చెందిన సెంటర్ ఫర్ అఫార్డబుల్ వాటర్ శానిటేషన్ టెక్నాలజీ ఈ వర్క్‌షాపునకు నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. నీటిశుద్ధి–నిల్వ సాంకేతికతల డెవలపర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, వీటిని అనుసరిస్తున్నవారు తమ అనుభవాలను పంచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. తాము వాడుతున్న ప్యూరిఫయ్యర్లను ప్రదర్శించవచ్చు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు/పోస్టర్లను చూపించి చర్చలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు ఫిబ్రవరి 7లోగా వివరాలు పంపాలి. వివరాలకు.. అపరాజిత–98012 73123. Email: a.vaibhav@smsfoundation.org మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ(పర్మాకల్చర్) మహాసభ సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ సమీపంలోని) బిడకన్నె గ్రామంలోని వ్యవసాయ శిక్షణా క్షేత్రంలో జరగనుంది. ‘భూతాపోన్నతి – శాశ్వత వ్యవసాయ పరిష్కారాలు’ అనే అంశంపై ఈ మహాసభలో విస్తృత చర్చ జరుగుతుంది. పర్యావరణపరమైన సుస్థిరతను అందించే రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తి సాధనకు దోహదపడే జీవవైవిధ్య, ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ఈ మహాసభ వేదిక కానుంది. రిజిస్ట్రేషన్ తదితర సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 75697 20601. E-mail id : aranyahyd@gmail.com చిరుధాన్య వంటకాలపై 18న ఐ.ఐ.ఎం.ఆర్.లో శిక్షణ వర్షాధారంగా పండే చిరుధాన్యాలలో సకల పోషకాలు ఉన్నాయి. వీటిని మూలాహారంగా తీసుకుంటే జీవనశైలి వ్యాధులు సైతం నయం అవుతాయి. అయితే, వీటితో సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక వంటకాలను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు అని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ–ఐ.ఐ.ఎం.ఆర్. (కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. చిరుధాన్య వంటకాల తయారీపై కుకింగ్ విత్ మిల్లెట్స్ పేరిట గృహిణులు, హోటళ్ల నిర్వాహకులు, స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులకు ఈ నెల 18(శనివారం)న ఐ.ఐ.ఎం.ఆర్.లోని న్యూట్రిహబ్ శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 1,500. పేర్ల రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం.. nutrihubtbi@gmail.com 040-24599379/ 29885838 / Mobile - 9490476098 www.millets.res.in / www.nutrihub-tbi-iimr.org మట్టి ద్రావణంతో చీడపీడల నివారణపై 19న శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి ద్రావణంతో వివిధ పంటల్లో చీడపీడల నివారణ పద్ధతులపై ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, మట్టి ద్రావణ ంపై పేటెంట్ పొందిన చింతల వెంకటరెడ్డి ఈ నెల 19(ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని తమ శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా పేర్లు నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255. 22న విజయవాడలో మామిడి రైతులకు శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈనెల 22(శుక్రవారం)న విజయవాడ పడమట లంకలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. విజయవంతంగా సాగు చేస్తున్న రైతులు పాల్గొని ఇతర రైతులతో అనుభవాలను పంచుకోవలసిందిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతోంది. వివరాలకు.. జగదీష్ – 78934 56163. 29న చోహన్ క్యు, సీవీఆర్ సాగు పద్ధతులపై శిక్షణ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 29న ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు డా. చోహాన్ క్యు(దక్షిణ కొరియా) ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు), మట్టి సేద్యం ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు తెలియజేస్తారు. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 20 లోగా రూ. 200 చెల్లించి ముందాగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. -
23న చిరుధాన్యాల ప్రాసెసింగ్, మార్కెటింగ్‌పై శిక్షణ
చిరుధాన్యాల ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెట్టదలచిన ఔత్సాహికులు, స్టార్టప్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) ఈ నెల 23న హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో సంస్థ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనుంది. చిరుధాన్యాల ప్రాసెసింగ్ సదుపాయాలు, టెక్నాలజీ లైసెన్సులు పొందే మార్గాలు, ఇంక్యుబేషన్ సేవలపై ఈ శిక్షణలో అవగాహన కలిగిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 94904 76098, 04024599379 / 29885838 www.nutrihub-tbi-iimr.org గోవాలో సేంద్రియ వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు సేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి గోవా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఏడాది లోగా యూనివర్సిటీని ప్రారంభిస్తామని గోవా ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చంద్రకాంత్ కవలేకర్ ప్రకటించారు. అత్యాధునిక సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తేవడం, రాష్ట్రానికి అనువైన సేంద్రియ పంటలపై పరిశోధనలు చేయడానికి అనుగుణంగా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. సేంద్రియ పంటల ఉత్పాదకత పెంపుదల, నాణ్యత నియంత్రణ, పరిశోధన, అభివృద్ధి సంబంధ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సేంద్రియ వర్సిటీ స్థానికులకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. గుజరాత్లో ఆనంద్ యూనివర్సిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన డా. మదన్‌గోపాల్ వర్షణిని సేంద్రియ యూనివర్సిటీ చీఫ్ స్ట్రాటజిస్ట్‌గా నియమించారు. జల సంరక్షణ, బోరు రీచార్జ్ పద్ధతులపై శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బోర్లను రీచార్జ్ చేసుకునే పద్ధతి సహా వివిధ జల సంరక్షణ పద్ధతులపై డిసెంబర్ 16న స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థులు, రైతు బృందాలు, వ్యక్తులకు సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వాటర్ అండ్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సురన ఆడిటోరియంలో శిక్షణ ఇవ్వనుంది. భూగర్భ జల సంరక్షణలో అపారమైన అనుభవం కలిగిన జలవనరుల ఇంజినీరు ఆర్. వి. రామమోహన్ శిక్షణ ఇస్తారు. జలసంరక్షణలో అనుభవాలను పంచుకునే ఆసక్తి గల వారు కూడా సంప్రదింవచ్చు. ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1,500. ఇతర వివరాలకు.. 040–27014467 email: wlfoundation@outlook.com 20న కుంచనపల్లిలో కూరగాయల రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేయదలచిన, చేసే ఆలోచన ఉన్న రైతులకు ఈ నెల 20(బుధవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని సీనియర్ రైతు ఎ. సాంబిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం శిక్షణ ఇవ్వనుంది. వివిధ జిల్లాల్లో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ సేంద్రియ కూరగాయలు సాగు చేసే రైతులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. జగదీష్ – 78934 56163 24న సేంద్రియ దానిమ్మ, జామ, అంజూర సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులో ఈ నెల 24(ఆదివారం)న సేంద్రియ వ్యవసాయ విధానంలో దానిమ్మ, తైవాన్ జామ, అంజూర సాగు విధానంపై, జీవన ఎరువుల వినియోగంపై రైతులు హనుమాన్ కిషోర్ (ప్రకాశం), శ్రీనివాసరావు(ప.గో.) శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. ముందుగా పేర్ల నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255 26న సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం(ట్రీ), మిషన్ జలనిధి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం (డబ్ల్యూ.ఎం.ఎఫ్.) ఆధ్వర్యంలో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై ఈ నెల 26(మంగళవారం)న ఉ. 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. ‘ట్రీ’ అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, డబ్ల్యూ.ఎం.ఎఫ్. చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్ జలనిధి చైర్మన్ జి.దామోదర్‌రెడ్డి, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాక్షి సాగుబడి ఇన్చార్జ్ పంతంగి రాంబాబు సిరిధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తారు. వివరాలకు: కృష్ణమోహన్ – 99490 55225 19న తాడూర్‌లో మామిడి సాగుపై క్షేత్రస్థాయి శిక్షణ గ్రామభారతి సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగులో వివిధ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై రైతులకు ఈ నెల 19(మంగళవారం) నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం తాడూర్లోని డా. మధుసూదన్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. పలువురు మామిడి రైతులు తమ అనుభవాలను పంచుకుంటారు. మార్కెటింగ్ విధానం, సేంద్రియ ధృవీకరణ, మామిడి రైతుల సంఘం ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. డా. మధుసూదన్‌రెడ్డి – 77027 71282, టి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి – 94924 23875, బాలస్వామి – 97057 34202. -
నేడు ,రేపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు
-
30 నుంచి బెంగళూరులో కిసాన్ మేళా, దేశీ విత్తనోత్సవం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి.) ఆధ్వర్యంలో మార్చి 30–31 తేదీల్లో రైతు మేళా, దేశీ విత్తనోత్సవం జరగనున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మార్పుల నేపథ్యంలో కరువు, చీడపీడలను తట్టుకోవడానికి తమ సంప్రదాయ విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని విత్తుకోవడమే ఉత్తమం. దేశీ విత్తన స్వాతంత్య్రం, దేశీ గోమాతే రైతులకు రక్షగా నిలుస్తాయని ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. భావిస్తోందని ప్రతినిధి ఉమామహేశ్వరి తెలిపారు. ఈ అంశాలపై రైతులను చైతన్యవంతం చేయడమే లక్ష్యమన్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే దేశీ విత్తన సంరక్షకులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. రెండున్నర కిలోల దేశీ వరివిత్తనంతో ఎకరం సాగు చేసే శ్రీ పద్ధతి, పావు కిలో విత్తనంతో సాగు చేసే పెరుమాళ్లు పద్ధతి, పంటల ప్రణాళిక రూపకల్పన, దేశీ విత్తన సంరక్షణలో మెలకువలు తదితర అంశాలపై ప్రకృతి వ్యవసాయదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. వివరాలకు.. ఉమామహేశ్వరి – 90004 08907 కుంకుడు గుత్తులు! సాధారణంగా కుంకుడు చెట్టుకు కాయలు విడివిడిగా కాస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం జనగామకు సమీపంలో ఓ మెట్టభూమి గట్టు మీద ఈ చెట్టు ఉండగా సుస్థిర వ్యవసాయ కేంద్రం డా. జి. రాజశేఖర్ దృష్టిలో పడింది. ఈ విత్తనాలు కావాలనుకున్న వారు డా. రాజశేఖర్‌ను 83329 45368 నంబరులో సంప్రదించవచ్చు. 24న సేంద్రియ గొర్రెల పెంపకంపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 24 (ఆదివారం)న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సాంకేతిక అధికారి డా. టి. వెంకటేశ్వర్లు, పశువైద్యులు డా. జి. రాంబాబు(కడప), గొర్రెల పెంపకందారుడు రషీద్ రైతులకు అవగాహన కల్పిస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు.. 97053 83666, 0863–2286255. కట్టె గానుగల నిర్వహణపై 3 రోజుల శిక్షణ .సహజ సాగు పద్ధతిలో పండించిన నూనెగింజలతో ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పరిశుభ్రమైన రీతిలో కట్టె గానుగలో వంటనూనెలను వెలికితీయడంపై యువతీ యువకులకు మార్చి 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండె శివశంకర్ తెలిపారు. కనీసం పదోతరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈ నెల 24లోగా 81210 08002, 70133 09949లలో ఏదో ఒక నంబర్‌కు ఎస్.ఎం.ఎస్. లేదా వాట్సప్ ద్వారా సమాచారం పంపాలని ఆయన కోరారు. -
నేటి నుంచి వైఎస్సార్సీపీ శిక్షణ
కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీ కన్వీనర్ల రాజకీయ శిక్షణ తరగతులు నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్నాయి. నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయి. మొదటి రోజు కర్నూలు పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ లెవల్ కమిటీల కన్వీనర్లకు శిక్షణ తరగతులు ఉంటాయి. రెండో రోజు నంద్యాల పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణకారరెడ్డితోపాటు పలువురు రాష్ట్రస్థాయి నేతలు హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వహణపై కమిటీలకు సమాయత్తం ఎన్నికల నిర్వహణలో బూత్ లెవల్ కమిటీలదే కీలకపాత్ర. ఒక్కో బూత్ లెవల్ కమిటీలో 10 మంది సభ్యులు, ఒక్కరూ కన్వీనర్‌గా ఉంటారు. వీరు తమ పరిధిలోని బూత్‌ల్లో ఎన్నికల సమయంలో ఎలా మసలుకోవాలి, ఏమి చర్యలు తీసుకోవాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలి తదితర అంశాలపై రాష్ట్ర నాయకులు కన్వీనర్లకు దిశా నిర్దేశం చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే శిక్షణ తరగతులకు హాజరయ్యే కన్వీనర్లు, సభ్యులకు మధ్యాహ్న సమయంలో భోజనం సదుపాయంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. ఈమేరకు శిక్షణ తరగతులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తి చేశారు. -
సైనికుల్లా పోరాడుదాం
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం సైనికుల్లాగా పని చేద్దామని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆ పార్టీ రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు వంటి మోసకారి, వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలంటే వీర సైనికుల్లాగా ఎన్నికల్లో పోరాటం చేయాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించి, వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక చేసే సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బూత్ స్థాయిలో కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల మనస్సులో కొందరే నిలిచిపోతారని, అటువంటి గొప్ప వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బూత్‌కమిటీలు పటిష్టంగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ పథకాలు వివరించాలి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలును వివరించాలని, ఈ బాధ్యత బూత్ కమిటీలదే ప్రధానంగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటంలో మనం అండగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరం చేయిచేయి కలిపి జగన్‌ను సీఎం చేద్దామన్నారు. చంద్రబాబు అధికారంలోకి తర్వాత నుంచి ఇప్పటి వరకు చేసిన మోసాలతో పాటు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరిగమురళి, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, రాష్ట్ర్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి , పార్టీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మెయిళ్ల గౌరి, అనంతరపురం, హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ తలారి రంగయ్య పాల్గొన్నారు. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే చంద్రబాబుది మోసం, ఆరాచక పాలన టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలు కూడా ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అందరం కష్టపడితే పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తామన్నారు. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే హోదాపై చంద్రబాబు పిల్లి మొగ్గలు కేంద్రంపై వైఎస్సార్సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూడా చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారన్నాని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు వంటి వ్యక్తి స్వాతంత్య్రానికి ముందు ఉంటే మనకు ఈ రోజు స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదేమో అన్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగిస్తూ ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పోరాటాలు చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన సొంత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టారన్నారు. హోదాకోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కూడా చంద్రబాబు బెదిరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. – మేకపాటి రాజమోహన్‌రెడ్డి,నెల్లూరు ఎంపీ మోసగాడితో పోరాటం మనం పచ్చి మోసగాడైన చంద్రబాబుతో పోరాటం చేస్తున్నామనే విషయం గుర్తుపెట్టు కోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో సంక్షేమ పథకాల అమల్లో మొదటి స్థానంలో ఉంచి దేశానికే దశ, దిశ నిర్దేశించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట తప్పడన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెప్పిన అబద్ధాలను చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా అనే అంశం బతికుందంటే అది వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటంతోనే అన్నారు. చంద్రబాబుకు పచ్చమీడియా తొత్తుగా ఉంటూ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందన్నారు. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అరాచక పాలకులకు మూల్యం తప్పదు రాష్ట్రంలో అరాచకపాలకులు, ప్రభుత్వ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారన్నారు. నాలుగేళ్లుగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అధికార పార్టీ తాటాకు చప్పుళ్లకు బయపడే ప్రసక్తే లేదన్నారు. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రబాబు మోసాలపై చైతన్యం చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రజలకు చేస్తున్న మోసాలను, అన్యాయాలను ప్రజలకు వివరించే విధంగా చొరవ తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ ప్రత్యేక హోదాసాధన విషయంలో జగన్ వెనుదిరగని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రతి చోట బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాలన్నారు. బూత్ కమిటీ సభ్యులపై ఎంతో నమ్మకంగా పార్టీ ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టు కోవాలన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల విషయంపైగా ప్రజలకు వివరించాలన్నారు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రత్యర్థి ఓటమే..మన లక్ష్యం మన ప్రత్యర్థి ఓటమిని చవి చూసే వరకు వెనుతిరగకుండా పోరాటం చేద్దామని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ అన్నారు. 2019లో ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్నామన్నారు. జగన్ సీఎం అయితే లక్షల కుటుంబాలు ఆనందిస్తాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబానికి దూరంగా మండుటెండలో పాదయాత్ర చేస్తూ కష్టపడుతున్నారన్నారు. అందరం కష్టపడి జగన్మోహన్రెడ్డిని సీఎం చేస్తేనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి అర్పించినట్లు ఉంటుందన్నారు. – పి.అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు నగర ఎమ్మెల్యే -
వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణ గల పార్టీ
సాక్షి, నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులో రెండో రోజు కొనసాగుతున్న పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడాతూ.. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధిస్తుందని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాబోయే సీఎం అని అన్నారు. బూత్ కమిటీ సభ్యులే పార్టీ విజయానికి కీలకం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, జెడ్పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాయల పకీరు చంద్రబాబు
మోసపూరిత వాగ్దానాలతోగద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ మాయల పకీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లకునిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తణుకు: మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ మాయల పకీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ తరగతులు జరిగాయి. వీటికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ శిక్షణ తరగతులు పార్టీ రాష్ట్ర రాజకీయ మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ కమిటీలదేనన్నారు. కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్ర ప్రజలకు భరోసా కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్ర మరోసారి భరోసా కల్పించే దిశగా కదులుతోందన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నైజాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు రాజధాని పేరుతో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మధ్య ఉంటున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు ఖూనీచేస్తున్నారని దుయ్యబట్టారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బూత్‌స్థాయి కమిటీ సభ్యులు ప్రజలతో మమేకం కావాలన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆయా పోలింగ్ బూత్‌ల పరి«ధిలో ఓటరు జాబితాపై అవగాహన చేసుకోవాలన్నారు. ఇటీవలి కాలంలో అధికార పార్టీ నాయకులు ఓట్లు తొలగిస్తున్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పారు. తొలగించిన ఓట్లు స్థానంలో ఓటర్లను తిరిగి చేర్పించేందుకు బూత్ కన్వీనర్లు సహాయపడాలని సూచించారు. మోసమే చంద్రబాబు విజన్ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే, రాజకీయ సలహామండలి సభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే చంద్రబాబుకు ఉన్న విజన్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ప్రత్యేక హోదా డిమాండ్‌తో కేంద్రంపై పోరాడుతున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అన్ని పార్టీల నాయకులు అనుసరిస్తున్నారని అన్నారు. బీజేపీతో పోరాటం అంటూనే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు నివాళులు అర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు గుర్రాల నాగేంద్రకు సమావేశం నివాళులు అర్పించింది. కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలి పింది. శిక్షణ తరగతుల్లో బూత్ కన్వీనర్లకు సర్టిఫి కెట్లు బహూకరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, తూర్పుగోదావరి జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, పైబోయిన సత్యనారా యణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నాయకులు నార్గన సత్యనారాయణ, కౌరు వెంకటేశ్వర్లు, మ ద్దాల నాగేశ్వరరావు, ఆకుల కిరణ్ పాల్గొన్నారు. -
ఆమె చదువుకు ఆటంకాలెన్నో..!
సాక్షి, సిటీబ్యూరో : ఓవైపు చదువులో అమ్మాయిలు దూసుకెళ్తున్నప్పటికీ... మరోవైపు గ్రామాల్లో పరిస్థితులు ఇంకా మెరుగుపడాల్సి ఉందంటున్నారు ఆర్జీరావు ట్రస్ట్ నిర్వాహకులు బొంత దామోదర్‌రావు. పదేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో విద్యాసేవలు అందిస్తున్న ఆయన... అమ్మాయిల చదువుకు ఎదురవుతున్న అడ్డంకులు, తన అనుభవాలు, ఆలోచనలు ‘సాక్షి.. నేను శక్తి’ శీర్షికతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ఓ గ్రామంలోని అమ్మాయికి ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటొచ్చింది. అంత దూరం ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తామంటూ? తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఈ విషయం తెలిసి మా మేనేజర్ వెళ్లి వాళ్లను కన్విన్స్ చేసి, ఒప్పించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అడ్మిషన్ టైమ్ అయిపోయింది. ప్రస్తుత విద్యావ్యవస్థ రోజురోజుకూ ఖరీదెక్కి, వసతులతో కూడిన నాణ్యమైన విద్య సామాన్యులు అందుకోలేనిదే.! అన్నట్టుగా మారింది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అబ్బాయిల చదువుపై చూపిస్తున్న ఆసక్తి.. అమ్మాయిల విషయంలో చూపడం లేదు. పిల్లల చదువు ఆగిపోకూడదని, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని మేం ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్‌తో ట్రస్ట్ తరఫున అవసరమైన పుస్తకాలు కొనివ్వడం, హాస్టల్ ఫీజు కట్టడం తదితర చేస్తున్నాం. అయితే మేం 100 మంది పిల్లలకు చేయూతనందిస్తుంటే, అందులో 30శాతం వరకే కొనసాగుతున్నారని తేలింది. డ్రాపవుట్ అవుతున్న వారిలో అత్యధికులు ఆడపిల్లలే. దీనికి కారణాలేమిటని విశ్లేషిస్తే.. ఆడపిల్లల విద్యకు సంబం«ధించి తల్లిదండ్రుల్లో అవగాహన, ఆసక్తి పెరగకపోవడమే ప్రధానంగా కనిపించింది. వివాహంతో చదువుకు విడాకులు తల్లిదండ్రులు గట్టిగా అనుకుంటే ఇప్పుడున్న స్థితిలో పిల్లలను చదివించకుండా ఉండే పరిస్థితి నిజానికి లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, మాలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఓ స్థాయి వరకు సులభంగానే చదివించొచ్చు. అయితే ఆడపిల్ల పెళ్లికిస్తున్న ప్రాధాన్యత చదువుకు ఇవ్వడం లేదు. గ్రామాల్లో తల్లిదండ్రులు ఇప్పటికీ ఆడపిల్లను బరువుగానే భావిస్తున్నారు. మంచి సంబంధం వస్తే చాలు కూతురి చదువుకు గుడ్‌బై చెప్పించేస్తున్నారు. ‘ఓ అమ్మాయి చాలా బాగా చదివేది. మేం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహించాం. అయితే ఫైనల్ ఇయర్లో అడుగుపెడుతుందనగా పెళ్లి కుదరింది. అంతే... తల్లిదండ్రులు చదువు మాన్పించేశారు. మేం ఎంత కన్విన్స్ చేసినా వినలేదు. ఆ అమ్మాయి కోసం మేం పడిన వ్యయప్రయాసలన్నీ వృథా అయ్యాయి. ’ వసతుల లేమి.. దూరభారం.. దాదాపు 70శాతం గ్రామీణ పాఠశాలల్లో మరుగుదొడ్ల లాంటి కనీస వసతులు లేవు. వీటి నిర్మాణ, నిర్వహణలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న నిధులు వృథా అవుతున్నాయి. ఈ కారణంతో యుక్త వయసు తర్వాత ఆడపిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు సంశయిస్తున్నారు. అదే విధంగా చాలా పల్లెల్లో పాఠశాలలు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాకపోకలకు సంబంధించి తల్లిదండ్రుల్లో ఎన్నో రకాల భయాలున్నాయి. ఈవ్‌టీజింగ్ లేదా మరే పెద్ద, చిన్న సమస్య వచ్చినా స్కూల్/కాలేజ్‌కి గుడ్‌బై చెప్పించేసి ఇంటి దగ్గర కూర్చోబెడుతున్నారు. వీటికి తోడు ఇంగ్లిష్ చదువులు అమ్మాయిలకు ఎందుకనే భావన, ఎప్పటికైనా ఆడపిల్లే కదా.. అనే చులకన లాంటివన్నీ ఆడపిల్లల చదువుకు గండికొడుతున్నాయి. స్వచ్ఛందంగా కదలాలి.. సరిదిద్దాలి.. స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, విద్యావేత్తలతో కలిసికట్టుగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు చేపట్టాం. కస్తూర్బా బాలికల పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలు ఉండవు. అలాంటి వాళ్లకు వందేమాతరం ఫౌండేషన్‌తో కలిసి శిక్షణనిస్తున్నాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగీకరిస్తే ట్రస్టు ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల విద్యార్థులను విభిన్న అంశాల్లో సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ట్రిపుల్ ఎల్ (లాంగ్వేజ్, లాజిక్, లెర్నింగ్) పేరుతో లైఫ్‌స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. సహజంగా పాఠశాల చివరి పీరియడ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి... దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కస్తూర్బా స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థినులకు గైడెన్స్ అందించేందుకు ‘నిర్మాణ్’ సంస్థతో కలిసి టోల్‌ఫ్రీ నెంబర్(1800–425–2425) ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కొంతకాలం పనిచేస్తే ఆడపిల్లల చదువుకు అడ్డంకుల్ని అధిగమించొచ్చు. -
చంద్రబాబు చేసిన మేలేమిటి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల నాలుగో రోజు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి. చిత్రంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానర్సింహం, రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం, కృష్ణదాస్, భూమన కరుణాకరరెడ్డి తదితరులు శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన బూత్‌స్థాయి కన్వీనర్లకు ఇచ్చిన రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారంతో విజయవంతంగా ముగిశాయి. నాలుగురోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణ తరగతులు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జిల్లాలో పార్టీకి దశ, దిశ నిర్దేశం చేస్తున్న నేతలుగా గుర్తింపు పొందిన ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయపరచుకుని పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపై నిలిపి శిక్షణ తరగతులను విజయవంతం చేశారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వి.విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్ధసారథి వంటి రాష్ట్ర పెద్దలను ఈ తరగతులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారితో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ఇప్పించి దిశా నిర్ధేశం చేశారు. పార్టీ ఆవిర్భావం, భావజాలం, రాజన్న పాలనపై పార్టీ నేత భూమన కరుణాకరరెడ్డి చేసిన ప్రసంగం పార్టీ శ్రేణులను తన్మయం చేసింది. ప్రధానంగా పార్టీని మరింతగా బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి బూత్‌స్థాయి కన్వీనర్లు, సభ్యుల పాత్ర కీలకమని, ఇందుకు గాను వారికి పూర్తిస్థాయిలో ఎన్నికల విధులు, ఓటు ప్రాధాన్యత, ఓటరును ఏవిధంగా బూత్‌స్థాయి వరకూ తీసకురావాలి తదితర అంశాలపై పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుచే ఇప్పించిన శిక్షణ తరగతులు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇచ్చాయి. -
పార్టీ సైనికులకు దిశా నిర్దేశం
శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ త రగతులు శనివారం ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మొదటిసారి విశాఖపట్టణంలో శిక్షణ తరగతులు నిర్వహించగా రెండో సారి శ్రీకాకుళం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన బూత్‌స్థాయి కన్వీనర్లకు శనివారం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్డులోగల ఆనందమయి కన్వెన్షన్ హాల్ దీని కి వేదికగా నిలిచింది. తొలిరోజు టెక్కలి, పలాస నియోజకవర్గాల నుంచి బూత్‌స్థాయి కన్వీనర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ల కోసం బూత్ కమిటీ కన్వీనర్లు క్యూ కట్టారు. ఈ నెల 6వ తేదీ వరకూ నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ తరగతులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున జరుగుతాయి. శిక్షణలో పాల్గొన్న వారికి గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లను ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు అందజేయనున్నారు. శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9.50గంటలకు పార్టీ జెండాను పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు: సాయిరెడ్డి రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు సంభవించబోతున్నాయని, జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర ముగిసిన తర్వాత ఇందుకు బీజాలు పడతాయని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాల కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలంతా సైనికులు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలను దగ్గరుండి తెలుసుకునేందుకు జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారన్నారు. సామాన్య కార్యకర్త సలహాలను సైతం పరిగణనలోకి తీసుకునేందుకు జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తం గా శిక్షణ తరగతులను నిర్వహించాలని ఆదేశించారన్నారు. నవరత్న పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ టీడీపీ నాయకులు విదేశాల్లో జల్సా చేస్తున్నారని విమర్శించారు. దేశ చరిత్రలోనే అధ్వానమైన పాలన సాగిస్తున్న ముఖ్య మంత్రిగా చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిని చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. కష్టపడి పనిచేసిన వారందరికీ పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పి స్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి ముందు పలాసలో కన్వీనర్ దుశ్చర్యతో ఆత్మహత్యకు పాల్పడిన డోకి హరీష్ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన పార్టీ పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పార్టీ నేతలు దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్‌లను విజయసాయిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పార్టీ టెక్కలి, పలాస నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, పార్టీ నేతలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కళ్యాణి, అంధవరపు సూరిబా బు, చింతాడ మంజు, ప్రధాన రాజేంద్ర, మామిడి శ్రీకాంత్, శిమ్మ రాజశేఖర్, రొక్కం సూర్యప్రకాశరావు, కోణార్క్ శ్రీను, పొన్నాడ రుషి, తమ్మినేని చిరంజీవినాగ్, వూన్న నాగరాజు, నక్క రామరాజు, పలాస నాయకులు ఎం.భాస్కరరావు, దువ్వాడ శ్రీ కాంత్, దువ్వాడ శ్రీధర్, బల్ల గిరిబాబు, మెట్ట కుమారస్వామి, అగ్గున్న సూర్యారావు, పైల చిట్టిబాబు, పుక్కళ్ల గురయ్యనాయుడు, చంద్రబాబుపై నమ్మకం పోయింది ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయింది. అనుభవం ఉందని, నేను మారాను నన్ను నమ్మండని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు. పార్టీ బూత్‌స్థాయి కన్వీనర్లకు ఈ శిక్షణ ఎంతో అవసరం. పార్టీ నుంచి ఒక ఆదేశం వస్తే సైనికుల్లా పనిచేయాలి. రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పడం శోచనీయం. కేం ద్రంలో భాగస్వామి అయిన వ్యక్తి బాబు, అతనికి విమర్శించే హక్కు లే దు. కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వేస్తున్న ఎత్తుగడ ఇది. బాబుపై ప్రజలకు నమ్మకం పోయింది. రాజధాని నిర్మాణం పేరిట 57వేల ఎకరాల భూమిని సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేసి చెట్టూ, గట్టూ, పుట్టా అంటూ పచ్చ చొక్కా కార్యకర్తలకే దోచిపెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రధాని వద్ద ఏం విలువ ఉంటుంది. – ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయదుందుభి మోగిద్దాం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను గెలిపించుకుని విజయదుందుభిని మోగిద్దాం. సమయాభావం వల్ల గత ఎన్నికల ముందు శిక్షణ తరగతులు నిర్వహించుకోలేకపోయాం. పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోవడంతో అధికారానికి కాస్త దూరంలో నిలిచాం. ఈ సారి అలాంటి పొరపాట్లు జరగనీయవద్దు. కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేత లు తమS ఆలోచనలు, మేధస్సు మనతో పంచుకుని బూత్‌స్థాయిలో చేపట్టాల్సిన విధి, విధానాలను తెలియజేయడం సంతోషకరం. – తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అధికార దాహం లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార కాంక్షతోనో, రాజకీయాల కోసమే పనిచేయడం లేదు. అధికారం కోసమైతే ఆనాడే కాంగ్రెస్ అధినేత్రి సోనియా వద్ద జగన్మోహన్రెడ్డి మోకరిల్లేవాడు. పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చేయదు, సముద్రం ఒకరి కాళ్ల కింద నిలవదు. తుఫాన్ గొంతు చిత్తం అరవదు. వీటిని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఆపాదించవచ్చు. వైఎస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చేందుకే ఆయన అప్పట్లో ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్రతో జగన్మోహన్రెడ్డికి అశేష ప్రజాదరణ లభించింది. ఇది దేశ రాజకీయాలు శాసించిన కుటుంబానికి కంటగింపుగా మారింది. అదే వైఎ స్సార్సీపీ ఆవిర్భావానికి కారణమైంది. వైఎస్సార్ ఆలోచనలు, సిద్ధాం తాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావజాలం. జగన్‌కు మనమంతా మద్దతునిచ్చి అధికారంలోకి తీసకువస్తే వైఎస్ అందించిన సుపరిపాలనే జగన్మోహన్రెడ్డి కూడా అందిస్తారు. భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాకుళం–విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ప్రతి ఓటూ విలువైనదే... ప్రతి ఓటు ఎంతో విలువైనది. కార్యకర్త నాయకునిగా ఎదిగేందుకు శిక్షణా తరగతులు ఎందో దోహదపడతా యి. అందుకు నాయకత్వ లక్షణాలు అలవరచుకోవా లి. ఐదేళ్లకొకసారి ఎన్నికలు వస్తాయి. ఒక్కరోజు కోసం 1824 రోజులు కష్టపడాలి. ఓటరు లిస్ట్ ఎప్పటికప్పుడు రివైజ్డ్ అవుతుంది. దీనిని ఎప్పటికప్పు డు సరిచూసుకోవాలి. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి పోలింగ్‌బూత్‌లో 12 ఓట్లు అదనంగా సాధించి ఉంటే ఇపుడు రాజన్న రాజ్యంలో ఉండేవారం. ఓ టు విలువ అందరికంటే బూత్‌స్థాయి కన్వీనర్లు, సభ్యులకే బాగా తెలిసి ఉండాలి. దీనిని ప్రతి సభ్యుడు గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేయాలి. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ సోషల్ మీడియా పాత్ర కీలకం సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకం. సోషల్ మీడియా వాడే ఓటర్లు, తద్వారా ప్రభావితం అయ్యే ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. భారతదేశంలో సోషల్ మీడియా విస్తరణపై సర్వేల నివేదిక ప్రకారం 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 4కోట్ల 5లక్షల మంది సోషల్ మీడి యా వినియోగదారులు పెరుగుతున్నారు. గడిచిన 2014 ఎన్నికల్లో భారతదేశంలోని 543 లోక్‌సభ సీట్లలో 160 సీట్లు విజయంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. మన రాష్ట్రంలో 42 లోక్‌సభ సీట్లలో 11 లోక్‌సభ సీట్లు గెలుపులో సోషల్ మీడియా పాత్ర ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదపడేందుకు పార్టీ ఫేస్బుక్, యూ ట్యూబ్, వాట్సాప్, ద్వారా ప్రజల పక్షాన పార్టీ పోరాడుతున్న తీరు, టీడీపీ వైఫల్యాలు, అవినీతి, అసమర్థతను ప్రతిఒక్కరికీ తెలియజేయాలి. సమాచారహక్కు చట్టం 2005పై పూర్తి అవగాహన ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారితనం కోసం ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన కష్టం ఒక ఎత్తైతే రాబోయే ఏడాదిన్నర కాలం మరో ఎత్తు. బూత్‌స్థాయి కార్యకర్తలు, కన్వీనర్లు నూతనోత్సాహంతో పనిచేయాలి. చల్లా మధు, శిక్షకుడు ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలి ప్రభుత్వాల వైఫల్యాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు సైనికుల్లా పనిచేయాలి. – మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు -
6, 7 తేదీల్లో శిక్షణ తరగతులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మాదిగ విద్యార్థులకు జనవరి 6, 7 తేదీల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఎమ్మార్పీఎస్ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. పాతికేళ్లుగా ఎమ్మార్పీఎస్ వర్గీకరణపైనే దృష్టి పెట్టి ఎంతో నష్టపోయిందన్నారు. విద్యానగర్ టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం శిక్షణ తరగతుల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దండోరా ఉద్యమాన్ని రాజకీయంగా మలచుకోవడానికే తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 6న ఉదయం మేడిపాపయ్య స్వాగతోపన్యాసంతో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి.కృపాకర్ మాదిగ, ఎంబీసీ సిద్ధాంత కర్త కోప్రా, సుంకపాక దేవయ్య, గద్దర్, ఎలిషా కుమార్, జూపాక సుభద్ర, అల్లం నారాయణ, టి.హన్మంతు శిక్షణ తరగతులకు హాజరవుతారన్నారు. సమావేశంలో సుంకపాక దేవయ్య మాదిగ, యాతాకుల భాస్కర్, మేడిపాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ నేతలకు కేసీఆర్ క్లాసులు!
-
ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరాలి
మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని మంత్రి జోగురామన్న అన్నారు. సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేయాలని, ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల 2 రోజుల శిక్షణ తరగతుల్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ బీసీ విద్యానిధి పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఈ పథకం కింద అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు, ఈడిగ ఆంజనేయులుగౌడ్, గౌరీశంకర్‌లు మంత్రితో భేటి అయ్యారు. -
13,14 తేదీల్లో ఏపీసీసీ శిక్షణ తరగతులు
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు శిక్షణ తరగతులను ఈ నెల 13,14 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రతినిధి ఎస్.ఎన్ రాజా ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యలను క్షేత్ర స్థాయిలో కి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు తొమ్మిది అంశాలపై శిక్షణను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదాపై మండల స్థాయిలో పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్లు రాజా వెల్లడించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, నగర అధ్యక్షులు మల్లాది విష్టు ఆధ్వర్యంలో తరగతులు జరుతాయన్నారు. -
తేనెటీగల పెంపకం యూనిట్లకు రాయితీలు
జంగారెడ్డిగూడెం : తేనెటీగల పెంపకం కోసం రాయితీ కల్పిస్తున్నట్టు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అడపా దుర్గేష్ తెలిపారు. మంగళవారం తేనెటీగల పెంపకంపై శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొని మాట్లాడారు. తేనెటీగల పెంపకం కోసం ఒక్కో యూనిట్‌కు 8 బాక్సులు అందజేస్తామని, దీనికి యూనిట్‌కు రూ. 20 వేలు రాయితీ ఇస్తున్నామన్నారు. ఒక్కో బాక్సు నుంచి 40 కేజీల తేనె ఉత్పత్తి అవుతుందని 40 నుంచి 60 రోజుల్లో దిగుబడి వస్తుందన్నారు. తాము అందజేసిన తేనెటీగల పెంపకం బాక్సులు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలు పూతదశలో ఉండగా ఆ బాక్సులను అక్కడ పెడితే త్వరితగతిన తేనె దిగుబడి వస్తుందన్నారు. పంటలు కూడా ఫలదీకరణ చెంది పంట దిగుబడి పెరుగుతుందన్నారు. తేనెటీగల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చన్నారు. పే ద కుటుంబాలను ఎంపిక చేసి తేనెటీగల పెంపకానికి రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. విజయరాయి శాస్త్రవేత్త డాక్టర్ రావు, ఉద్యాన శాఖ అధికారి ఆర్.బిందు ప్రవీణ, గిరిజన వికాస సంస్థ ప్రతినిధి మూర్తి పాల్గొన్నారు. -
ముగిసిన స్కౌట్స్ శిక్షణ తరగతులు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్కౌట్స్, గైడ్స్ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ఈ నెల 6 నుంచి నిర్వహించిన శిబిరంలో పోల్కంపల్లి, పూడూర్, డోకూర్, అంకిళ్ల, పేరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, షాద్‌నగర్ పట్టణంలోని ఠాగూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు శిక్షణ పొందినట్లు స్కౌట్స్, గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ రాజగోపాల్ తెలిపారు. ఐదు రోజుల శిక్షణలో వీరికి ప్రథమచికిత్స, ముడులు, దిక్సూచి, పట నైపుణ్యం, హస్తకళలు, ఆరోగ్య, విద్య, సాహస క్రీడలు, ప్రకతి పర్యావరణ రక్షణ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల వల్ల విద్యార్థుల్లో మానవీయత, భావవ్యక్తీకరణ, వ్యక్తిగత వికాసం, ఆత్మసై ్థర్యం, ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యం వంటి లక్షణాలు అలవడుతాయని అన్నారు. క్యాంప్ లీడర్‌గా రవీందర్, అసిస్టెంట్ ఆఫీసర్లుగా హన్మంతు, ఆనంద్ వ్యవహరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వసంధుర, శకుంతల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆంగ్ల అధ్యాపకులకు శిక్షణ తరగతులు
హన్మకొండ చౌరస్తా : ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ సిలబస్‌పై హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ఎయిడెడ్ అధ్యాపకులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, కమిషనర్ డాక్టర్ ఏ.అశోక్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆర్జేడీ ఐఈ డాక్టర్ కాశీనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మొదటి రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ పై శిక్షణ కొనసాగింది. కార్యక్రమంలో ఆర్ఐఓ షేక్ అహ్మద్, రిటైర్డ్ ఆర్జేడీ మలహల్రావు, రిటైర్డ్ డీవీఈఓ ఎ.పరాయ్, జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.బాబురావు, రిసోర్స్ పర్సన్ ఇ.శ్రీనివాసరావు, టీఎస్ ప్రవీణ్‌కుమార్, ఇ.సత్యనారాయణ, స్వర్ణలత, డిప్యూటీ డీవీఈఓ రమణారావు, సూపరింటెండెంట్ మోహన్‌జీ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖది కీలకపాత్ర
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రజాసేవలో రెవెన్యూ శాఖది కీలకపాత్ర అని జేసీ ఎం.రాంకిషన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీఆర్వోలు, మీసేన ఆపరేటర్లకు వెబ్‌ల్యాండ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో టీంవర్క్ ముఖ్యమన్నారు. మ్యుటేషన్ దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో ఉంచుతున్నారని వీఆర్వోలను ప్రశ్నించారు. పనుల్లో పురోగతి పెంచాలని, ఎల్ఈసీ కార్డుల జారీ, మ్యుటేషన్లు, సాదాబైనామా, ప్రభుత్వ భూముల పరిశీలనపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్ఐసీ డీఐఓ మూర్తి, మీసేన సూపరింటెండెంట్ బక్కా శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రభుత్వోద్యోగులకు శిక్షణ తరగతులు
రూ.30 కోట్లు కేటాయింపు.. ఈ నెలాఖరు నుంచే శిక్షణ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ నినాదమే ఇతివృత్తంగా రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులతో వరుసగా మూడు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించనుంది. బంగారు తెలంగాణ లక్ష్యసాధనలో ఉద్యోగులను మరింత కార్యోన్ముఖులను చేయాలనే బృహత్ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఉద్యోగులందరికీ శిక్షణ ఇప్పించేందుకు రూ.30 కోట్లు కేటాయించారు. దీంతో ఈ నెలాఖరు నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ముందుగా సచివాలయ ఉద్యోగులకు మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, వివిధ రంగాల్లో అప్పట్లో జరిగిన దోపిడీ, ఆ పరిస్థితులను అధిగమించేందుకు కొత్త రాష్ట్రంలో దృష్టి సారించాల్సిన అంశాలను ఈ శిక్షణలో ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాలకు సంబంధించి ఆయా రంగాల్లో నిపుణులను రప్పించి వారితో ఉపన్యాసాలు ఇప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉద్యోగుల్లో ఆయా రంగాల్లో అవగాహన పెరిగి వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు తీరు మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు. -
నేటి నుంచి సాక్షి మైత్రి ఆధ్వర్యంలో సాఫ్ట్‌టాయిస్ తయూరీలో శిక్షణ
హన్మకొండ చౌరస్తా: సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో సాఫ్ట్ టాయిస్ తయారీలో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. టెడ్డీబేర్స్(3 సెజైస్), సిట్టింగ్ అండ్ స్టాండింగ్ డాగ్, కర్టెన్ మంకీల్లో శిక్షణ ఉంటుంది. ఈ నెల 11 నుంచి 14వ తేదీలోపు, హన్మకొండ పోలీస్ స్టేషన్ పక్కన గల శైలి బ్యూటీపార్లర్ వ ద్ద రిజి ష్ట్రేషన్ చేసుకోవాలి. రిజిష్ట్రేషన్ ఫీజు రూ.900 చె ల్లించాల్సి ఉంటుంది. తరగతులు ఈ నెల 15 వ తేదీ నుంచి 23 వరకు కొనసాగుతాయి. అభ్యర్థులు నోట్‌బుక్, పెన్ వెంట తెచ్చుకోవాలి. వివరాల కు 9505514424నంబర్లో సంప్రదించవచ్చు. -
మహిళా సాధికారత కోసం శిక్షణ
జిల్లా పరిషత్ ైచైర్పర్సన్ అనూరాధ మచిలీపట్నం (చిలకలపూడి) : మహిళా సాధికారిత కోసం, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా మహిళలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం ఆమెతో పాటు జిల్లా పరిషత్ సీఈవో వి. నాగార్జునసాగర్, డెప్యూటీ సీఈవో పి. కృష్ణమోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనూరాధ మాట్లాడుతూ రాబోయే వేసవిలో రెండు నెలల పాటు మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేందుకు మండల కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో సెర్ప్(ఎస్ఈఆర్పీ), ఆంధ్రాబ్యాంకు గ్రామీణ శిక్షణ సంస్థ, డీఆర్డీఏ తదితర సంస్థల ద్వారా ఈ తరగతులు జరుగుతాయన్నారు. శిక్షణ అనంతరం రుణాలు ఇప్పిస్తామన్నారు. దీనికితోడు వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. కంప్యూటర్, డ్రస్ డిజైనింగ్, సెల్ఫోన్ల మరమ్మతులు, జూట్ బ్యాగ్‌ల తయారీ, బ్యూటీషియన్, కలంకారీ అద్దకాలు, మామిడికాయ నుంచి పౌడర్ తయారు చేసే విధానాలపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ శిక్షణ వివరాలు జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు ఇప్పటికే మెసేజ్‌ల ద్వారా తెలియజేశామని, ఎక్కువ మంది మహిళలు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరినట్లు తెలిపారు. ఆసక్తిగల మహిళలు ఎంపీడీవోలకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని అనూరాధ తెలిపారు. ప్రధానమంత్రి జనరేషన్ ప్రోగ్రాం ఆధారంగా ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనే అభ్యర్థులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ సీఈవో వి. నాగార్జునసాగర్ మాట్లాడుతూ చదువుకున్న మహిళలకు ఈ శిక్షణ తోడైతే స్వయం ఉపాధి, ఆర్ధికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనూరాధ కోరారు. -
విండోస్ మొబైల్ అప్లికేషన్స్‌పై శిక్షణ నేడు
ఒంగోలు వన్‌టౌన్: స్థానిక పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో విండోస్ మొబైల్ అప్లికేషన్స్ అనే అంశంపై కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మూడు రోజుల శిక్షణ తరగతులను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు.కళాశాలలో శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వి.సుబ్బారావు మాట్లాడుతూ మొబైల్ అప్లికేషన్స్ వంటి ఆధునాతన అంశాలపై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. కంప్యూటర్‌సైన్స్ ఐటీ విభాగాధిపతి పి.మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఆండ్రాయిడ్ అప్లికేషన్లపై శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం విండోస్ అప్లికేషన్స్‌పై తరగతులు జరుగుతాయన్నారు. మైక్రోసాఫ్ట్‌లో విశేష అనుభవం గడించిన నల్లూరి శ్రీనివాసరావు, పవన్శుక్లాలు మాట్లాడుతూ విద్యార్థులు అహ్యూర్ అకౌంట్ ద్వారా అభివృద్ధి చేసిన అప్లికేషన్‌ను ఇంటర్నెట్ నిక్షితం చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచవచ్చునన్నారు. మొబైల్ అప్లికేషన్లో అనుభవం గడించిన విద్యార్థులు సమీప భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చునన్నారు. కార్యక్రమానికి సంధానకర్తలుగా ప్రాంగణ ఎంపిక విభాగం సంధానకర్త పి.రాజేష్, కంప్యూటర్‌సైన్స్ అధ్యాపకుడు ఎస్.ఫణికుమార్ వ్యవహరించారు. -
టీఆర్ఎస్... శిక్షణ
నల్లగొండ : ప్రభుత్వ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లడం...శాసనసభ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ వేదికగా ప్రజాప్రతినిధులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 7వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా... అంతకంటే నాలుగు రోజుల ముందుగా అంటే 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో చాలామంది ప్రజాప్రతినిధులు తొలిసారిగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే అభిప్రాయం పార్టీలో ఉంది. వృద్ధులకు ఆసరా ఫించన్లు, సన్నబియ్యం, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టారు. దీంట్లో ఆసరా పింఛన్లు రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచినప్పటికీ ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆహార భద్రత పథకం ద్వారా రూ.1 సన్నబియ్యం అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు...ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లో కూడా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారన్న భావన కేసీఆర్‌లో ఉంది. అదే విధంగా అధికారులతో ప్రజాప్రతినిధుల వ్యవహరించే తీరుపై కూడా విమర్శలు ఉన్నాయి. అవినీతిని అంతమొందిస్తామని సీఎం కేసీఆర్ వేధికల మీద చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి ఆనవాళ్లు ఇంకా కనిపిస్తున్నానే ఉన్నాయి. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎక్కుపెట్టే సందర్భంగా అధికార పార్టీ తరఫున దీటుగా ఎదుర్కోని పక్షంలో మరింత లోకువయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన సీఎం సమావేశాలకు ముందు శిక్షణ తరగతులు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. కదిలిరానున్న ప్రభుత్వం.. రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం వారంతా సాగర్ చేరకుంటారు. 4, 5 తేదీల్లో శిక్షణ తరగతులు ముగించుకుని 5వ తేదీ రాత్రి తిరుగు ప్రయాణమవుతారు. శిక్షణ తరగతుల ఏర్పాట్ల గురించి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. -
అసెంబ్లీ నిర్వహణలో కమిటీల పాత్ర కీలకం
హైదరాబాద్ : శాసనసభ నిర్వహణలో కమిటీల పాత్ర చాలా కీలకమని కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల శిక్షణా కార్యక్రమంలో శనివారం ఆమె మాట్లాడుతూ రూ.కోట్ల నిధులు ఎలా ఖర్చవుతున్నాయో కమిటీలు పరిశీలిస్తాయని తెలిపారు. ఎమ్మెల్యేలంతా కమిటీలపై అవగాహన పెంచుకోవాలని నజ్మా హెప్తుల్లా సూచించారు. అప్పుడే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు న్యాయం చేయగలుగుతారని ఆమె అన్నారు. -
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా సమావేశాలు
-
ఒక నిమిషం నిర్వహణకు రూ.8వేలు ఖర్చు
హైదరాబాద్ : ఒక్క నిమిషం పాటు అసెంబ్లీ నిర్వహణకు రూ.8వేలు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమంలో ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యలపై చర్చించి ఆ ఖర్చును సద్వినియోగం చేయాలన్నారు. ఎమ్మెల్యేల అవగాహన కోసం అసెంబ్లీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని కోడెల పేర్కొన్నారు. ఈసారి 95మంది కొత్తగా ఎన్నిక శాసనసభకు వచ్చారని స్పీకర్ తెలిపారు. -
ఎమ్మెల్యేలపై ప్రజల్లో చులకన భావం: బాబు
హైదరాబాద్ : ఎమ్మెల్యేలపై ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ శాసనసభ్యుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను వీక్షించేందుకు ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. టీవీ సీరియల్స్‌తో పోలిస్తే అసెంబ్లీ రేటింగ్స్ చాలా తక్కువ అని చంద్రబాబు అన్నారు. సభలో అర్థవంతమైన చర్చలకు ఎమ్మెల్యేలంతా సహకరించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చించి ఆదర్శంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలపై చులకన భావం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. -
తొలిసారి క్లాస్ తీసుకుంటున్న చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకు నేటి నుంచి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. చట్టసభల్లో ఎలా నడుచుకోవాలి...సభా సంప్రదాయాలు సభ్యుడు ఎలా పాటించాలనే అంశాలపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రాండ్ కాకతీయ హోటల్లో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. శాసన సభ స్పీకర్- కోడెల శివప్రసాదరావు స్వాగత ఉపన్యాసంతో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రం ఆర్థిక మంత్రి అరుణ్ -జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి
నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ, మునిసిపల్ చైర్మన్లతోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రతిఒక్కరూ పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని వారినుద్దేశించి కేసీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు * హైదరాబాద్‌లో సీఎంను కలిసిన నూతన ప్రజాప్రతినిధులు * ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పునరుద్ఘాటన త్వరలో ప్రజాప్రతినిధులకు * శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడి వరంగల్ : ఎన్నికల సమయంలో జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం అమలు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి ప్రగతి దిశగా అడుగేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ, మునిసిపల్ చైర్మన్లతో పాటు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, ఎంపీలు కడియం, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రమేష్, సురేఖ, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్సీలు బోడకుంటి, నాగపురి తదితరులు ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన వారిని ఆయన అభినందించారు. ప్రాథమిక స్థాయి నుంచి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అన్ని రంగాల్లో పల్లెలను ముందువరుసలో ఉంచాలని ఆయన హితబోధ చేసినట్లు జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధితోపాటు నగర అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, రాజకీయ అవినీతికి తావులేకుండా చూస్తామని చెప్పినట్లు వారు వివరిం చారు. ఆ తర్వాత సీఎం జిల్లాకు చెందిన ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రైల్వే పరంగా సాధించాల్సిన ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం. జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ -
ఇన్‌చార్జిలే దిక్కు
కనిగిరి: విద్యాశాఖలో మండల స్థాయిలో ఎంఈవోలదే కీలకపాత్ర. అయితే వారి స్థానంలో అత్యధికంగా ఇన్చార్జుల పాలనే సాగుతోంది. దీంతో అనేక చోట్ల విద్యాప్రగతికి విఘాతం కలుగుతోంది. జిల్లాలోని 56 మండలాల్లో పది మండలాల్లో మాత్రమే శాశ్వత ఎంఈవోలున్నారు. ఇన్చార్జ్ ఎంఈవోలుగా పనిచేసే ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు న్యాయం చేయలేకపోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలకు సంబంధించిన అనేక నివేదికలు తయారు చేయడంలో ఇన్చార్జ్ ఎంఈవోలు నిమగ్నమవుతారు. ప్రతినెలా పాఠశాలల మౌలిక వసతులు, అభివృద్ధి కమిటీల ఏర్పాటు, శిక్షణ తరగతులు తదితర అంశాలకు సంబంధించి ఎంఈవోలు పూర్తి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు హెచ్ఎంలుగా విధులు నిర్వహించే పాఠశాలలకు వారానికి మూడు రోజులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో సొంత పాఠశాలలోని విద్యార్థులకు న్యాయం చేయలేక పనిభారంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కందుకూరు డివిజన్లో పరిస్థితి దయనీయం... జిల్లాలో 56 మండలాలకు సంబంధించి ఉలవపాడు, అద్దంకి, కొరిశపాడు, సంతనూతలపాడు, జె పంగులూరు, దోర్నాల, కారంచేడు, మర్రిపూడి, కొమరోలు, టంగుటూరు మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. మిగతా చోట్ల ఇన్చార్జ్ అధికారుల పాలనే. కందుకూరు డివిజన్లో 17 మండలాల్లో కేవలం ఉలవపాడు, మర్రిపూడి మండలాల్లో మాత్రమే శాశ్వత ఎంఈవోలున్నారు. దీంతో మిగతా చోట్ల ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వహించే వారు పూర్తిస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోతున్నారు.అనేక చోట్ల రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న హెచ్ఎంలు కూడా ఇన్చార్జ్ ఎంఈవోలుగా పనిచేస్తున్నారు. దీంతో వారి అవస్థలు వర్ణనాతీతం.ఇన్చార్జ్ ఎంఈవోల పాలనతో ఈఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడింది. ఈ ఏడాదైనా మార్పు వచ్చేనా... ఈ విద్యా సంవత్సరంలోనైనా ఇన్చార్జ్ ఎంఈవోల పాలనకు విముక్తి కలిగిం చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విద్యావ్యవస్థ పనితీరుపై దృష్టి పెట్టాలి. విద్యావ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిలో పడాలంటే ఇన్చార్జుల పాలనకు స్వస్తి పలకాల్సిన అవశ్యకత ఉంది.