జిల్లా పరిషత్ ైచైర్‌పర్సన్ అనూరాధ
మచిలీపట్నం (చిలకలపూడి) : మహిళా సాధికారిత కోసం, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా మహిళలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం ఆమెతో పాటు జిల్లా పరిషత్ సీఈవో వి. నాగార్జునసాగర్, డెప్యూటీ సీఈవో పి. కృష్ణమోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనూరాధ మాట్లాడుతూ రాబోయే వేసవిలో రెండు నెలల పాటు మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేందుకు మండల కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో సెర్ప్(ఎస్‌ఈఆర్‌పీ), ఆంధ్రాబ్యాంకు గ్రామీణ శిక్షణ సంస్థ, డీఆర్‌డీఏ తదితర సంస్థల ద్వారా ఈ తరగతులు జరుగుతాయన్నారు. శిక్షణ అనంతరం రుణాలు ఇప్పిస్తామన్నారు. దీనికితోడు వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. కంప్యూటర్, డ్రస్ డిజైనింగ్, సెల్‌ఫోన్ల మరమ్మతులు, జూట్ బ్యాగ్‌ల తయారీ, బ్యూటీషియన్, కలంకారీ అద్దకాలు, మామిడికాయ నుంచి పౌడర్ తయారు చేసే విధానాలపై శిక్షణ ఇస్తారని చెప్పారు.
ఈ శిక్షణ వివరాలు జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు ఇప్పటికే మెసేజ్‌ల ద్వారా తెలియజేశామని, ఎక్కువ మంది మహిళలు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరినట్లు తెలిపారు. ఆసక్తిగల మహిళలు ఎంపీడీవోలకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని అనూరాధ తెలిపారు. ప్రధానమంత్రి జనరేషన్ ప్రోగ్రాం ఆధారంగా ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనే అభ్యర్థులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ సీఈవో వి. నాగార్జునసాగర్ మాట్లాడుతూ చదువుకున్న మహిళలకు ఈ శిక్షణ తోడైతే స్వయం ఉపాధి, ఆర్ధికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనూరాధ కోరారు.
మహిళా సాధికారత కోసం శిక్షణ
Published Wed, Mar 25 2015 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM
Advertisement