
ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. గ్రామీణ మహిళా సాధికారతకు మద్దతు తెలియజేస్తూ ఈ స్పెషల్ జెర్సీని రాజస్తాన్ ఆటగాళ్లు ధరించారు. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పింక్ కలర్‌తో నిండిపోయింది.
అదే విధంగా ఈ మ్యాచ్ కోసం అమ్ముడైన ఒక్కో టికెట్టుపై రూ.100ను మహిళల వృద్ధికి ఆ ప్రాంచైజీ విరాళంగా ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‍లో తమ జట్టు కొట్టే ఒక్కో సిక్సర్‌కు.. రాజస్థాన్‍లోని ఆరు కుటుంబాలకు సొలార్ పవర్‌ను ఆ ఫ్రాంచైజీ అందించనుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్
Tonight, we’re walking out to play for the women of Rajasthan… 💗#PinkPromise pic.twitter.com/ZPulqvGBI5
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024
Comments
Please login to add a commentAdd a comment