Japan Sends Man to G7 Ministerial Meeting on Women's Empowerment - Sakshi
Sakshi News home page

జెండర్‌ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్‌ జపాన్‌'

Published Sat, Jul 1 2023 4:36 PM | Last Updated on Sat, Jul 1 2023 5:54 PM

Japan Sends Man On G7 Ministerial Meeting on Gender Equality - Sakshi

ఇటీవల జూన్‌ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్‌ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క  మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం.

ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్‌ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్‌ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్‌" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది.

ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్‌కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్‌ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్‌ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు.

అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్‌ మ్యాగ్జైన్‌ ప్రకారం..వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్‌లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్‌​ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ని అంచనా వేస్తుంది. 

(చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్‌')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement