హైదరాబాద్ : ఒక్క నిమిషం పాటు అసెంబ్లీ నిర్వహణకు రూ.8వేలు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమంలో ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యలపై చర్చించి ఆ ఖర్చును సద్వినియోగం చేయాలన్నారు. ఎమ్మెల్యేల అవగాహన కోసం అసెంబ్లీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని కోడెల పేర్కొన్నారు. ఈసారి 95మంది కొత్తగా ఎన్నిక శాసనసభకు వచ్చారని స్పీకర్ తెలిపారు.
ఒక నిమిషం నిర్వహణకు రూ.8వేలు ఖర్చు
Published Fri, Jul 18 2014 1:10 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement