సభలో కూటమి ఎమ్మెల్యేల విజ్ఞప్తి
శ్వేతపత్రంపై అభిప్రాయాలు చెప్పమంటే కోరికల చిట్టా
పాత కేసులు కూడా ఎత్తివేయాలని వినతి
సాక్షి, అమరావతి: శాసన సభ సమావేశాల్లో గురువారం విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభ్యులు చర్చించేందుకు స్పీకర్ అవకాశం కల్పించగా.. దొరికిందే ఛాన్సన్నట్లుగా సభ్యులు కేసులు ఎత్తేయాలని కోరడం కొసమెరుపు.
శ్వేత పత్రాల సంగతి తర్వాత చర్చించాలని కోరుతూ చాలామంది ఎమ్మెల్యేలు.. కోరికల చిట్టా విప్పారు. పాత కేసులు కూడా ఎత్తేయాలని కోరారు. తమ ఒక్కరిపై ఉన్న కేసులంటేనే బాగోదని భావించి, పార్టీ కార్యకర్తల పైన ఉన్న కేసులూ ఎత్తేయాలని చెప్పారు. ఒక సందర్భంలో సభలో కేసులున్న సభ్యులు లేచి నిల్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా.. దాదాపు 90 శాతం సభ్యులు లేచి నిలబడ్డారు. వీళ్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment