
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9 జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణాతరగతులు నిర్వహించామని, వీటి ద్వారా 6 వేల మంది జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగు పరచుకున్నారని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియా అకాడమీ నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యానికి ఉపయోగపడే 12 పుస్తకాలు మీడియా అకాడమీ ప్రచురించి శిక్షణ తరగతుల్లో ఒక కిట్‌ను జర్నలిస్టులకు అందజేస్తుందని వెల్లడిం చారు.
సీఎం కేసీఆర్ మీడియా అకాడమీకి రూ.100 కోట్ల నిధిని ప్రకటించి, ఇప్పటివరకు రూ.42 కోట్లు విడుదల చేశారని తెలిపారు. రూ.42 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.16 కోట్లను జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అకాడమీ అందజేసిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment