శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ త రగతులు శనివారం ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మొదటిసారి విశాఖపట్టణంలో శిక్షణ తరగతులు నిర్వహించగా రెండో సారి శ్రీకాకుళం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన బూత్‌స్థాయి కన్వీనర్లకు శనివారం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్డులోగల ఆనందమయి కన్వెన్షన్ హాల్ దీని కి వేదికగా నిలిచింది. తొలిరోజు టెక్కలి, పలాస నియోజకవర్గాల నుంచి బూత్‌స్థాయి కన్వీనర్‌లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ల కోసం బూత్ కమిటీ కన్వీనర్‌లు క్యూ కట్టారు. ఈ నెల 6వ తేదీ వరకూ నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ తరగతులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున జరుగుతాయి. శిక్షణలో పాల్గొన్న వారికి గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లను ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు అందజేయనున్నారు.
శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9.50గంటలకు పార్టీ జెండాను పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.
రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు: సాయిరెడ్డి
రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు సంభవించబోతున్నాయని, జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర ముగిసిన తర్వాత ఇందుకు బీజాలు పడతాయని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాల కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలంతా సైనికులు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలను దగ్గరుండి తెలుసుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారన్నారు.
సామాన్య కార్యకర్త సలహాలను సైతం పరిగణనలోకి తీసుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తం గా శిక్షణ తరగతులను నిర్వహించాలని ఆదేశించారన్నారు. నవరత్న పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ టీడీపీ నాయకులు విదేశాల్లో జల్సా చేస్తున్నారని విమర్శించారు. దేశ చరిత్రలోనే అధ్వానమైన పాలన సాగిస్తున్న ముఖ్య మంత్రిగా చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని దుయ్యబట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిని చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పార్టీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. కష్టపడి పనిచేసిన వారందరికీ పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పి స్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి ముందు పలాసలో కన్వీనర్ దుశ్చర్యతో ఆత్మహత్యకు పాల్పడిన డోకి హరీష్ ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన పార్టీ పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పార్టీ నేతలు దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్‌లను విజయసాయిరెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పార్టీ టెక్కలి, పలాస నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, పార్టీ నేతలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కళ్యాణి, అంధవరపు సూరిబా బు, చింతాడ మంజు, ప్రధాన రాజేంద్ర, మామిడి శ్రీకాంత్, శిమ్మ రాజశేఖర్, రొక్కం సూర్యప్రకాశరావు, కోణార్క్ శ్రీను, పొన్నాడ రుషి, తమ్మినేని చిరంజీవినాగ్, వూన్న నాగరాజు, నక్క రామరాజు, పలాస నాయకులు ఎం.భాస్కరరావు, దువ్వాడ శ్రీ కాంత్, దువ్వాడ శ్రీధర్, బల్ల గిరిబాబు, మెట్ట కుమారస్వామి, అగ్గున్న సూర్యారావు, పైల చిట్టిబాబు, పుక్కళ్ల గురయ్యనాయుడు,
చంద్రబాబుపై నమ్మకం పోయింది
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయింది. అనుభవం ఉందని, నేను మారాను నన్ను నమ్మండని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు. పార్టీ బూత్‌స్థాయి కన్వీనర్లకు ఈ శిక్షణ ఎంతో అవసరం. పార్టీ నుంచి ఒక ఆదేశం వస్తే సైనికుల్లా పనిచేయాలి. రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పడం శోచనీయం. కేం ద్రంలో భాగస్వామి అయిన వ్యక్తి బాబు, అతనికి విమర్శించే హక్కు లే దు. కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వేస్తున్న ఎత్తుగడ ఇది. బాబుపై ప్రజలకు నమ్మకం పోయింది. రాజధాని నిర్మాణం పేరిట 57వేల ఎకరాల భూమిని సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేసి చెట్టూ, గట్టూ, పుట్టా అంటూ పచ్చ చొక్కా కార్యకర్తలకే దోచిపెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రధాని వద్ద ఏం విలువ ఉంటుంది.
– ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్
విజయదుందుభి మోగిద్దాం
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను గెలిపించుకుని విజయదుందుభిని మోగిద్దాం. సమయాభావం వల్ల గత ఎన్నికల ముందు శిక్షణ తరగతులు నిర్వహించుకోలేకపోయాం. పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోవడంతో అధికారానికి కాస్త దూరంలో నిలిచాం. ఈ సారి అలాంటి పొరపాట్లు జరగనీయవద్దు. కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేత లు తమS ఆలోచనలు, మేధస్సు మనతో పంచుకుని బూత్‌స్థాయిలో చేపట్టాల్సిన విధి, విధానాలను తెలియజేయడం సంతోషకరం.
– తమ్మినేని సీతారాం, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు
అధికార దాహం లేదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార కాంక్షతోనో, రాజకీయాల కోసమే పనిచేయడం లేదు. అధికారం కోసమైతే ఆనాడే కాంగ్రెస్ అధినేత్రి సోనియా వద్ద జగన్‌మోహన్‌రెడ్డి మోకరిల్లేవాడు. పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చేయదు, సముద్రం ఒకరి కాళ్ల కింద నిలవదు. తుఫాన్ గొంతు చిత్తం అరవదు. వీటిని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించవచ్చు. వైఎస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చేందుకే ఆయన అప్పట్లో ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్రతో జగన్‌మోహన్‌రెడ్డికి అశేష ప్రజాదరణ లభించింది. ఇది దేశ రాజకీయాలు శాసించిన కుటుంబానికి కంటగింపుగా మారింది. అదే వైఎ స్సార్‌సీపీ ఆవిర్భావానికి కారణమైంది. వైఎస్సార్ ఆలోచనలు, సిద్ధాం తాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావజాలం. జగన్‌కు మనమంతా మద్దతునిచ్చి అధికారంలోకి తీసకువస్తే వైఎస్ అందించిన సుపరిపాలనే జగన్‌మోహన్‌రెడ్డి కూడా అందిస్తారు.
భూమన కరుణాకరరెడ్డి,
శ్రీకాకుళం–విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్
ప్రతి ఓటూ విలువైనదే...
ప్రతి ఓటు ఎంతో విలువైనది. కార్యకర్త నాయకునిగా ఎదిగేందుకు శిక్షణా తరగతులు ఎందో దోహదపడతా యి. అందుకు నాయకత్వ లక్షణాలు అలవరచుకోవా లి. ఐదేళ్లకొకసారి ఎన్నికలు వస్తాయి. ఒక్కరోజు కోసం 1824 రోజులు కష్టపడాలి. ఓటరు లిస్ట్ ఎప్పటికప్పుడు రివైజ్డ్ అవుతుంది. దీనిని ఎప్పటికప్పు డు సరిచూసుకోవాలి. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి పోలింగ్‌బూత్‌లో 12 ఓట్లు అదనంగా సాధించి ఉంటే ఇపుడు రాజన్న రాజ్యంలో ఉండేవారం. ఓ టు విలువ అందరికంటే బూత్‌స్థాయి కన్వీనర్‌లు, సభ్యులకే బాగా తెలిసి ఉండాలి. దీనిని ప్రతి సభ్యుడు గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేయాలి. – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్
సోషల్ మీడియా పాత్ర కీలకం
సోషల్ మీడియా పాత్ర ఎంతో కీలకం. సోషల్ మీడియా వాడే ఓటర్లు, తద్వారా ప్రభావితం అయ్యే ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. భారతదేశంలో సోషల్ మీడియా విస్తరణపై సర్వేల నివేదిక ప్రకారం 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 4కోట్ల 5లక్షల మంది సోషల్ మీడి యా వినియోగదారులు పెరుగుతున్నారు. గడిచిన 2014 ఎన్నికల్లో భారతదేశంలోని 543 లోక్‌సభ సీట్లలో 160 సీట్లు విజయంలో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. మన రాష్ట్రంలో 42 లోక్‌సభ సీట్లలో 11 లోక్‌సభ సీట్లు గెలుపులో సోషల్ మీడియా పాత్ర ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదపడేందుకు పార్టీ ఫేస్‌బుక్, యూ ట్యూబ్, వాట్సాప్, ద్వారా ప్రజల పక్షాన పార్టీ పోరాడుతున్న తీరు, టీడీపీ వైఫల్యాలు, అవినీతి, అసమర్థతను ప్రతిఒక్కరికీ తెలియజేయాలి. సమాచారహక్కు చట్టం 2005పై పూర్తి అవగాహన ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారితనం కోసం ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన కష్టం ఒక ఎత్తైతే రాబోయే ఏడాదిన్నర కాలం మరో ఎత్తు. బూత్‌స్థాయి కార్యకర్తలు, కన్వీనర్‌లు నూతనోత్సాహంతో పనిచేయాలి.
చల్లా మధు, శిక్షకుడు
ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలి
ప్రభుత్వాల వైఫల్యాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు సైనికుల్లా పనిచేయాలి.
– మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment