వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
శ్రీకాకుళం, మందస: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా అందరూ పని చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. మండలంలోని భేతాళపురం పంచాయతీ రట్టి గ్రామంలో గురువారం ఈయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా గెలిపించి, ఎల్లవేళలా డాక్టర్ సేవలు వినియోగించుకోవాలన్నారు.
ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా కార్యదర్శులు మెట్ట కుమారస్వామి, డొక్కరి దానయ్య, మండలాధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, పార్టీ నాయకులు మామిడి సింహాద్రి, నర్తు రామారావు, జుత్తు నీలకంఠం, హనుమంతు వెంకటరావుదొర, పాలీన శ్రీనివాసరావు, దువ్వాడ మధుకేశ్వరరావు, అందాల శేషగిరి, మరడ భాస్కరరావు, ఉంగసాయికృష్ణ, పైల చిట్టి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment