ఎమ్మెల్యేలపై ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
హైదరాబాద్ : ఎమ్మెల్యేలపై ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ శాసనసభ్యుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను వీక్షించేందుకు ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. టీవీ సీరియల్స్తో పోలిస్తే అసెంబ్లీ రేటింగ్స్ చాలా తక్కువ అని చంద్రబాబు అన్నారు. సభలో అర్థవంతమైన చర్చలకు ఎమ్మెల్యేలంతా సహకరించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చించి ఆదర్శంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలపై చులకన భావం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.