శాసనసభ నిర్వహణలో కమిటీల పాత్ర చాలా కీలకమని కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా అన్నారు.
హైదరాబాద్ : శాసనసభ నిర్వహణలో కమిటీల పాత్ర చాలా కీలకమని కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల శిక్షణా కార్యక్రమంలో శనివారం ఆమె మాట్లాడుతూ రూ.కోట్ల నిధులు ఎలా ఖర్చవుతున్నాయో కమిటీలు పరిశీలిస్తాయని తెలిపారు. ఎమ్మెల్యేలంతా కమిటీలపై అవగాహన పెంచుకోవాలని నజ్మా హెప్తుల్లా సూచించారు. అప్పుడే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు న్యాయం చేయగలుగుతారని ఆమె అన్నారు.