najma heptulla
-
బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ప్రచార హడావిడి దాదాపుగా ముగియవస్తుండడంతో.. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి రేసులో మాజీ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ , నజ్మా హెప్తుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
‘సీఎం పదవికి ముందు రాజీనామా చేయండి’
ఇంపాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబీ సింగ్‌ను రాజీనామా చేయాల్సింది ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మాహెప్తుల్లా కోరారు. రాజీనామా చేస్తే తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న ఆయన డిమాండ్‌ను గవర్నర్ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మొత్తం 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు, మిగితా సీట్లు ఇతర పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే 31 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ ప్రకారం కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్ మాత్రం అందుకోలేకపోయింది. ఇతర పార్టీలవారు బీజేపీకి మద్దతిస్తామని చెబుతున్నారు. అయితే, గత రాత్రి ఇబోబీతోపాటు డిప్యూటీ సీఎం గైఖాంగమ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్ హావోకిప్ గవర్నర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలని ఇబోబీకి గవర్నర్ హెజ్మా సూచించారు. అయితే, తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చాయని, 28 సీట్లు గెలుచుకున్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇబోబీ కోరారు. దాంతోపాటు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ఖాళీ పేపర్లో రాసుకొని వచ్చి చూపించారు. అయితే, కాగితంపై రాసివ్వడం కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడిని, గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి చూపించాలని కోరారు. బీజేపీ 21మంది గెలిచిన అభ్యర్థులతోపాటు ఎన్పీపీ అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలనుచ ఎల్జేపీ, టీఎంసీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి తమకే అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇబోబిని రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. -
మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నజ్మా
ఇంఫాల్: బీజేపీ సీనియర్ నాయకురాలు నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ఆమె చేత ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ రాజన్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, పలువురు రాష్ట్రమంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే వివిధ శాఖల కార్యదర్శులతోపాటు పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ మంత్రివర్గంలో మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన నజ్మా జులై 12వ తేదీన ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె వయస్సు 75 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమెను మణిపూర్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి గత వారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. -
నజ్మా, సిద్ధేశ్వర్ అవుట్...
ఢిల్లీ: ప్రధాని మోదీ తన మంత్రివర్గ పునర్ వ్వవస్థీకరణలో భాగంగా ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి సిద్ధేశ్వర్ ఉన్నారు. వీరిద్దరి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. మైనార్టీ శాఖను ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి, భారీ పరిశ్రమల శాఖను బాబుల్ సుప్రియోకు అప్పగించారు. నజ్మా హెప్తుల్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని ముందు నుంచీ ప్రచారంలో ఉంది. 75 ఏళ్ల వయస్సు పైబడిన కారణంగా నజ్మాపై కచ్చితంగా వేటుపడితుందని ఊహించినదే కాగా, ఆ జాబితాలో సిద్ధేశ్వర్ కూడా చేరారు. -
'మెజారిటీ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలి'
న్యూఢిల్లీ: రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు గొడ్డుమాంసం వినియోగంపై నిషేధం విధించడాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా సమర్ధించారు. ఆవులపై ప్రత్యేక పూజ్యభావం కలిగిన మెజారిటీ ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిందేనన్నారు. ‘ఎవరి సెంటిమెంట్లనూ గాయపర్చకూడదన్నది నా విధానం. మైనారిటీల సెంటిమెంట్ల గురించి మాట్లాడే మీరు.. మెజారిటీ ప్రజల భావోద్వేగాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు?’ అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. దేశ రాజధానిలో సోమవారం వక్ఫ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఒక ఆహార పదార్ధం తినడం ఇతరుల భావోద్వేగాలను గాయపరుస్తుందనుకున్నప్పుడు.. దాన్ని తినకపోవడమే మంచిదన్నారు. ‘మన పొరుగింటివారి సెంటిమెంట్ల గురించి కూడా ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత హర్యానా, మహారాష్ట్రలు ఇటీవల గోవధను, గొడ్డు మాంసం వినియోగాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. -
కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతీయ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మైనారిటీ శాఖామంత్రి నజ్మా హెప్తుల్లా కొత్త వివాదానికి తెర తీశారు. భారతీయులందర్ని 'హిందీ' అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపడంతో తర్వాత ఆమె వివరణ ఇచ్చారు. హిందీ అనే పదం మతానికి సంబంధించినది కాదని, కేవలం జాతీయతగానే చూడాలని నజ్మా చెప్పారు. భారతీయులందరూ హిందువులని అనలేదని ఆమె తెలిపారు. అరబిక్ భాషలలో భారతీయులను హిందీ, హిందుస్థానీ అనే పదాలతో పిలుస్తారని అన్నారు. జాతీయత సూచించే విధంగా హిందీ, హిందుస్థానీ అంటామని వివరణలో భాగంగా పేర్కోన్నారు. భారతీయులను హిందువులుగానే చూడాలని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై నజ్మా హెప్తుల్లా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. భారతీయుందరూ హిందీ(హిందువులు) అని నజ్మా హెప్తుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపింది -
'నెమలి వద్దు... వెంకన్న బొమ్మ కావాలి'
హైదరాబాద్: బీజేపీ ఉపాధ్యక్షురాలు, కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా విలక్షణ నాయకురాలు. ముక్కుసూటిగా మాట్లాడడం, తనకు నచ్చింది చేయడం ఆమెకు అలవాటు. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆమె తన సహజ ధోరణి ప్రదర్శించారు. ఆంధప్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన శిక్షణకు తరగతులకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె సభా కమిటీల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెకు నెమలి బొమ్మ ఉన్న జ్ఞాపికను అందజేయబోయారు. అయితే వెంకటేశ్వరస్వామి చిత్రం ఉన్న జ్ఞాపిక కావాలని ఆమె అడిగి తీసుకోవడంతో అక్కడుకున్న వారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అంతకుముందు వెంకటేశ్వరస్వామి బొమ్మ ఉన్న జ్ఞాపికను కోడెల బహూకరించారు. -
అసెంబ్లీ నిర్వహణలో కమిటీల పాత్ర కీలకం
హైదరాబాద్ : శాసనసభ నిర్వహణలో కమిటీల పాత్ర చాలా కీలకమని కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల శిక్షణా కార్యక్రమంలో శనివారం ఆమె మాట్లాడుతూ రూ.కోట్ల నిధులు ఎలా ఖర్చవుతున్నాయో కమిటీలు పరిశీలిస్తాయని తెలిపారు. ఎమ్మెల్యేలంతా కమిటీలపై అవగాహన పెంచుకోవాలని నజ్మా హెప్తుల్లా సూచించారు. అప్పుడే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు న్యాయం చేయగలుగుతారని ఆమె అన్నారు.