మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నజ్మా | Heptulla sworn-in as Governor of Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నజ్మా

Published Sun, Aug 21 2016 1:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నజ్మా

మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నజ్మా

ఇంఫాల్: బీజేపీ సీనియర్ నాయకురాలు నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంఫాల్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో ఆమె చేత ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ రాజన్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, పలువురు రాష్ట్రమంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అలాగే వివిధ శాఖల కార్యదర్శులతోపాటు పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ మంత్రివర్గంలో మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన నజ్మా జులై 12వ తేదీన ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె వయస్సు 75 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమెను మణిపూర్ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి గత వారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement