Bharatiya Janata Party leader
-
మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నజ్మా
ఇంఫాల్: బీజేపీ సీనియర్ నాయకురాలు నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ఆమె చేత ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ రాజన్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, పలువురు రాష్ట్రమంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే వివిధ శాఖల కార్యదర్శులతోపాటు పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ మంత్రివర్గంలో మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన నజ్మా జులై 12వ తేదీన ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె వయస్సు 75 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమెను మణిపూర్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి గత వారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. -
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాలసిన మెజార్టీ బీజేపీ సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. ఆదివారం ముంబైలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. తొలిసారిగా మహారాష్ట్రలో ప్రభుత్వాని ఏర్పాటు చేస్తామన్నారు. సీట్లు సాధించే క్రమంలో కొన్ని స్థానాలు అటు ఇటు అయినా చిన్న పార్టీలతో కలుస్తామన్నారు. పాత మిత్రుడు శివసేనతో పొత్తు పెట్టుకుంటారా అని విలేకర్లు అడిగి ప్రశ్నకు ఆ పార్టీతో తమకు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేదన్నారు. కాకుంటే శివసేన వ్యవహరించిన తీరు తమను, ప్రధాన మంత్రి మోడీని తీవ్రంగా కలచి వేసిందని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. నాగపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు.