మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాలసిన మెజార్టీ బీజేపీ సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. ఆదివారం ముంబైలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. తొలిసారిగా మహారాష్ట్రలో ప్రభుత్వాని ఏర్పాటు చేస్తామన్నారు. సీట్లు సాధించే క్రమంలో కొన్ని స్థానాలు అటు ఇటు అయినా చిన్న పార్టీలతో కలుస్తామన్నారు.
పాత మిత్రుడు శివసేనతో పొత్తు పెట్టుకుంటారా అని విలేకర్లు అడిగి ప్రశ్నకు ఆ పార్టీతో తమకు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేదన్నారు. కాకుంటే శివసేన వ్యవహరించిన తీరు తమను, ప్రధాన మంత్రి మోడీని తీవ్రంగా కలచి వేసిందని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. నాగపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు.