మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
ముంబై: దాదాపు రెండు నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక విడిపోయిన సైద్ధాంతిక సోదర పార్టీలు మళ్లీ కలిశాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరేందుకు రంగం సిద్ధకావడంతో శుక్రవారం రాష్ట్ర కేబినెట్ ను విస్తరించారు. తాజాగా 20 మంత్రులకు అవకాశం కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో శివసేన -బీజేపీ చెరో పది మంత్రి పదవులను పంచుకున్నాయి. ఇందులో శివసేనకు ఐదు కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి.
మంత్రివర్గ విస్తరణలో బీజేపీ కూడా ఇదే బాటలో పయనించడం గమనార్హం. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఐదుగురు బీజేపీ సభ్యులకు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో ఐదుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. 288 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 121 మంది సభ్యులు, శివసేనకు 63 మంది సభ్యులు ఉన్నారు. సీట్ల సర్దుబాటులో వైఫల్యంతో ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేయడం తెలిసిందే.
తాజాగా కేబినెట్ లో చోటు దక్కిన వారు..
గిరీష్ బాపత్(బీజేపీ)
గిరీష్ మహాజన్(బీజేపీ)
దివాకర్ రావుత్(శివసేన)
సుభాష్ దేశాయ్(శివసేన)
రాందాస్ కదామ్(శివసేన)
ఏక్ నాథ్ షిండే(శివసేన)
చంద్రశేఖర్ బవాన్ కులే(బీజేపీ)
బబాన్ రావ్ లోనికర్(బీజేపీ)
డా.దీపక్ సవంత్(శివసేన)
రాజ్ కుమార్ బడోలే(బీజేపీ)
సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు..
రామ్ షిండే(బీజేపీ)
విజయ్ దేశ్ ముఖ్(బీజేపీ)
సంజయ్ రాథోడ్(శివసేన)
దాదా భూజ్(శివసేన)
విజయ్ శివథారే(శివసేన)
దీపక్ కేశర్ కార్(శివసేన)
రాజే అమ్రీష్(బీజేపీ)
రవీంద్ర వాయ్ కర్(శివసేన)
డా.రంజిత్ పటిల్(బీజేపీ)
ప్రవీణ్ పోత్(బీజేపీ)