బీజేపీకే పరిమితమైన కీలక శాఖలు! | Fadnavis' team, Portfolios allocated; BJP retains key depts | Sakshi
Sakshi News home page

బీజేపీకే పరిమితమైన కీలక శాఖలు!

Published Sat, Dec 6 2014 5:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీకే పరిమితమైన కీలక శాఖలు! - Sakshi

బీజేపీకే పరిమితమైన కీలక శాఖలు!

ముంబై: దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో తాజాగా కేబినెట్ విస్తరణ జరిగినా.. కీలక శాఖలు మాత్రం బీజేపీకే పరిమితమయ్యాయి. దాదాపు రెండు నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక విడిపోయిన శివసేన పార్టీ తిరిగి కలిసినా మంత్రి పదవుల విషయంలో మాత్రం సరైన ప్రాధాన్యత కల్పించలేదు. ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ వంటి కీలక పదవుల కోసం శివసేన పట్టుబట్టినా వారి ఆశలు తీరలేదు.  ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ, రెవెన్యూ, జలవనరులు వంటి కీలక శాఖలను బీజేపీ తమ వద్దే ఉంచుకుంది.

 

శివసేనకు ఐదు కేబినెట్ హోదా కల్గిన మంత్రిపదులతో పాటు, సహాయ హోదా కల్గిన 5 మంత్రి పదవులను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  288 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 121 మంది సభ్యులు, శివసేనకు 63 మంది సభ్యులు ఉన్నారు.

 

కేబినెట్ లో చోటు దక్కిన వారు..

గిరీష్ బాపత్(బీజేపీ)
గిరీష్ మహాజన్(బీజేపీ)
దివాకర్ రావుత్(శివసేన)
సుభాష్ దేశాయ్(శివసేన)
రాందాస్ కదామ్(శివసేన)
ఏక్ నాథ్ షిండే(శివసేన)
చంద్రశేఖర్ బవాన్ కులే(బీజేపీ)
బబాన్ రావ్ లోనికర్(బీజేపీ)
డా.దీపక్ సవంత్(శివసేన)
రాజ్ కుమార్ బడోలే(బీజేపీ)

సహాయ హోదాలో ప్రమాణ స్వీకారం చేసినవారు..

రామ్ షిండే(బీజేపీ)
విజయ్ దేశ్ ముఖ్(బీజేపీ)
సంజయ్ రాథోడ్(శివసేన)
దాదా భూజ్(శివసేన)
విజయ్ శివథారే(శివసేన)
దీపక్ కేశర్ కార్(శివసేన)
రాజే అమ్రీష్(బీజేపీ)
రవీంద్ర వాయ్ కర్(శివసేన)
డా.రంజిత్ పటిల్(బీజేపీ)
ప్రవీణ్ పోత్(బీజేపీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement