నజ్మా, సిద్ధేశ్వర్ అవుట్... | two central ministers resigned in modi cabinet | Sakshi
Sakshi News home page

నజ్మా, సిద్ధేశ్వర్ అవుట్...

Published Tue, Jul 12 2016 9:00 PM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

నజ్మా, సిద్ధేశ్వర్ అవుట్... - Sakshi

నజ్మా, సిద్ధేశ్వర్ అవుట్...

ఢిల్లీ: ప్రధాని మోదీ తన మంత్రివర్గ పునర్ వ్వవస్థీకరణలో భాగంగా ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి సిద్ధేశ్వర్ ఉన్నారు.

వీరిద్దరి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. మైనార్టీ శాఖను ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి, భారీ పరిశ్రమల శాఖను బాబుల్ సుప్రియోకు అప్పగించారు. నజ్మా హెప్తుల్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని ముందు నుంచీ ప్రచారంలో ఉంది. 75 ఏళ్ల వయస్సు పైబడిన  కారణంగా నజ్మాపై కచ్చితంగా వేటుపడితుందని ఊహించినదే కాగా, ఆ జాబితాలో సిద్ధేశ్వర్ కూడా చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement