
సాక్షి, అమరావతి : మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ చేయమన్నా.. చేయలేమని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వేరే రాష్ట్రాలనుంచి మిర్చి వస్తుంది కాబట్టి..మిర్చి విషయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకోలేమని తేల్చేశారు.
అదే సమయంలో ఇ-క్రాప్ ఆధారంగా రైతులవారీగా సబ్సిడీ ఆలోచన చేస్తామన్నారు. అదికూడా ఆలోచనలోనే ఉందన్నారు. అయితే, మరి అదే ఇ-క్రాప్ ఆధారంగా మార్కెట్లో జోక్యం ఎందుకు చేసుకోలేకపోతున్నారని, రైతుకు మంచి ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment