ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ | YSRCP MLA Chandrasekhar Sensational Comments On Chandrababu's Ruling | Sakshi
Sakshi News home page

ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌

Published Mon, Jul 22 2024 5:03 PM | Last Updated on Mon, Jul 22 2024 6:08 PM

YSRCP MLA Chandrasekhar Sensational Comments On Chandrababu's Ruling

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గురించి భజన చేయకుండా..రాష్ట్రంలో జరగుతున్న అరాచకపాలన గురించి మాట్లాడితే బాగుండేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. తాడేపల్లిలో వైఎస్సాఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గవర్నర్‌ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్‌ స్పందించారు. 

ఈ సందర్భంగా తాడిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగమంతా చంద్రబాబు భజనే కనపడింది. ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోయటానికే సరిపోయిందని మండిపడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. అమరావతి, ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్థావనే లేదని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్తారనుకున్నాం. కానీ దాని గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టోలోని‌ సూపర్ సిక్స్ అమలు గురించి కూడా మాట్లాడలేదు. అంటే హామీలన్నింటినీ తుంగలో తొక్కేసినట్టేనని అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి గవర్నర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు.  

2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి వంద కోట్లు కూడా లేవు. కానీ 2024నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.7 వేల కోట్ల పైనే ఉందన్న తోట చంద్రశేఖర్‌..ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటి వరకు అములు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప గవర్నర్ వాస్తవాలను మరిచిపోయారు. 2014-19 మధ్యలో 54 సంస్థలను ప్రయివేటుపరం చేశారు.వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యవహరించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు.షర్మిళ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటని తెలిపారు.

షర్మిల వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 50 రోజుల్లోనే రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా షర్మిల నోరెందుకు మెదపటం లేదు? చంద్రబాబు కోసమే తప్ప ప్రజల కోసం షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.

ఓట్ ఆన్ బడ్జెట్ ఏడు నెలలపాటు నిర్వహించాలనుకోవటం సిగ్గుచేటు.మేనిఫెస్టో పథకాలకు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నారు. ప్రజాస్వామ్య యుతంగా మేము నిరసనలు తెలిపితే పోలీసులు మాపై దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని చూస్తే కూటమి‌ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అసెంబ్లీలో ప్లకార్డులను చూపిస్తే చంద్రబాబు వణుకిపోతున్నారు. అరాచకాలపై అసెంబ్లీలో నిలదీశాం.ప్రభుత్వం స్పందించలేదనే బాయ్ కాట్ చేశామని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement