Mirchi farmer
-
వైఎస్ జగన్ పర్యటనతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామా
-
కూటమి ప్రభుత్వంలో రైతులకే కన్నీళ్లే
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంపై మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను ఓదార్చేందుకు బుధవారం గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల్ని ఓదార్చనున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతుల గోడు వినడానికి వైఎస్ జగన్ రేపు (బుధవారం) మిర్చి యార్డుకు వస్తున్నారు.రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారు. మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యాన్ని రూ.1300 రూపాయలకే అమ్ముకున్నారు. పత్తి నాలుగు వేల రూపాయలకు కొనే దిక్కు లేదు.వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వం నేరుగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధరల స్థిరీకరణ కోసం రూ.3000 కోట్లు కేటాయించాం. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై సిఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం.మేము అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేని ప్రతి పంట మా ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని వ్యాఖ్యానించారు.ప్రభుత్వం నోరు మెదపదేం మిర్చికు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్ని కలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్‌కి వస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఎకరానికి లక్షకు పైగా రైతు అప్పులు ఊబిలో కూలిపోయాడు.దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. మిర్చిపైన ఎందుకు మంత్రులు మాట్లాడట్లేదు’అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చి సాగులో రైతుల కష్టాలు
-
భద్రాద్రి జిల్లాలో ఒక్కసారిగా మిర్చి నారుకు పెరిగిన డిమాండ్
-
నమ్మిన చేలోనే ‘రుణం’ తీరిపోయె..
టేకుమట్ల: ఎన్నో ఆశలతో వేసిన మిర్చి పంటకు తెగులు సోకింది. తెచ్చిన అప్పులు మీద పడటంతో ఓ రైతు ఆ చేనులోనే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దూరి రవీందర్రావు (52) అనే రైతు గత ఏడాది తనకున్న రెండున్నరెకరాల భూమితోపాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. దిగుబడులు రాకపోవడంతో రూ.8 లక్షల మేర అప్పు అలానే ఉండిపోయింది. ఈ సంవత్సరం తనకున్న రెండున్నరెకరాల్లో మిర్చి సాగు చేయగా కొన్ని రోజులుగా కుచ్చు తెగులు, తామర పురుగుతో పంట మొత్తం ఎదుగుదల లోపించింది. ఈ పంట కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం లేకపోగా, మరిన్ని అప్పులు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మిర్చి చేనులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు చేను వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వినయ్‌కుమార్ పంచనామా చేసి మృతదేహాన్ని చిట్యాల మార్చురీకి పంపించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
మిర్చి రైతు.. కాసుల వర్షం
సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు ఈ ఏడాది కాసుల వర్షం కురుస్తోంది. కరోనా నేసథ్యంలో కొన్నిరకాల పంట ఉత్పత్తుల ధరలు తగ్గినా, మిర్చి ధరలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. విదేశాలకు ఆర్డర్లు భారీగా ఉండటంతో ధరలు పెరిగాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న రైతులకు లబ్ధిచేకూరింది. గుంటూరు మార్కెట్లో మంగళవారం తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.19,500 పలికింది. మిర్చి దిగుబడి వచ్చే సమయానికి కరోనా వ్యాప్తి చెందటంతో గుంటూరు మార్కెట్ యార్డులో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రైతులు మిర్చిని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో 118 కోల్డ్‌స్టోరేజీల్లో కోటి బస్తాలకు పైగా మిర్చిని నిల్వచేశారు. ఇంకా 25 లక్షలకు పైగా మిర్చి బస్తాలు కోల్డ్‌స్టోరేజీల్లో ఉన్నాయి. గత నెలతో పోలిస్తే మిర్చి ధర క్వింటాలుకు సగటున రూ.2000కు పైగా పెరిగింది. విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు గణనీయంగా పెరగడంతోపాటు మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలకు మిర్చి పంట దెబ్బతింది. ఆ రాష్ట్రాల్లో దిగుబడి కూడా ఆలస్యం అయింది. బంగ్లాదేశ్, చైనా దేశాల్లో తేజ రకం మిర్చికి, మలేసియాలో సీజెంటా బాడిగ రకం మిర్చికి గిరాకీ ఉంది. శ్రీలంకకు 334 రకం మిర్చి ఆర్డర్లు ఉన్నాయి. ఇండొనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు కూడా మిర్చి ఎగుమతి అవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి సరఫరా అవుతుండటంతో ధరలు పెరిగి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పెరిగిన క్రయవిక్రయాలు కరోనా సమయంలో గుంటూరు మార్కెట్లో రోజుకు 10 వేల బస్తాలలోపు మాత్రమే అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం మార్కెట్ యార్డులో 25 వేల బస్తాలకుపైగా అమ్మకాలు జరుగుతున్నాయి. కొత్త సరుకు జనవరి వరకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచుకున్న మిర్చిని రైతులు అమ్ముకుంటున్నారు. పత్తి ధరలు పతనం కావడం, గులాబీరంగు పురుగు నేపథ్యంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. మిర్చి ధరలు ఆశించిన స్థాయిలో ఉండటం, సాగునీటికి సైతం ఢోకా లేకపోవడంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి ఈ ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. తేజ రకం మిర్చి ధర క్వింటాలు రూ.19,500 పలికింది. కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు మిర్చిని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. ధరలు పెరగడంతో వారికి లబ్ధికలుగుతోంది. యార్డుల్లో మిర్చి క్రయవిక్రయాలు పెరిగాయి. విదేశీ ఎగుమతులకు ఆర్డర్లు రావడంతో మిర్చి ధరలు పెరుగుతున్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నతశ్రేణి యార్డు సెక్రటరీ, గుంటూరు -
మిర్చి రైతుల్లో ధర.. దడ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి మంచి ధర పలుకుతున్నప్పటికీ రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో వ్యవసాయ మార్కెట్లలో 50 రోజులుగా కొనుగోళ్లు నిలిచాయి. లావాదేవీలు స్తంభించడంతో రైతులు మిర్చి అమ్ముకునే పరిస్థితులు కనిపించక నష్టపోతున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలో కోల్డ్ స్టోరేజీలన్నీ మిర్చి నిల్వలతో నిండిపోవడంతో కొత్తగా తరలించే వీలు లేకుండాపోతోంది. జిల్లాలో ఈసారి 51,150 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు పండింది. మొత్తం 12.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొదట్లో మిర్చి క్వింటా రూ.18వేల నుంచి రూ.21వేల వరకు పలికింది. అనంతరం చైనాలో కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయంగా ఎగుమతులు కొంతమేరకు తగ్గడంతో ధర పడిపోయింది. దీంతో రైతులు జిల్లాలోని 37 కోల్డ్ స్టోరేజీల్లో మిర్చిని నిల్వ చేసుకున్నారు. ఇంకా మార్కెట్లలో కొనుగోళ్లు లేకపోవడంతో కొందరు ప్రైవేట్ వ్యాపారులు దండుకుంటున్నారు. క్వింటాకు రూ.9వేల నుంచి రూ.11వేలేనంట.. మిర్చికి రూ.15వేలు, రూ.16వేలు క్వింటా ధర పలుకుతున్న సమయంలోనే మార్చి 22వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు చేయడంతో వ్యవసాయ మార్కెట్లను మూసివేశారు. రాష్ట్రంలో వరంగల్ మార్కెట్ తర్వాత మిర్చి క్రయ విక్రయాలు ఖమ్మం మార్కెట్లో ఎక్కువగా సాగుతాయి. ప్రతిరోజూ దాదాపు 25వేల బస్తాలొస్తాయి. అంటే సుమారు 10వేల క్వింటాళ్లన్నమాట. కొద్ది రోజులుగా లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రైవేట్ వ్యాపారులకు మిర్చిని రైతులు అమ్ముకుంటున్నారు. వారు రూ.9వేల నుంచి రూ.11వేలకు మించి ధర పెట్టట్లేదు. ముదిగొండలో ఉన్న చైనాకు సంబంధించిన చెంగ్‌వాంగ్ మిల్లు వద్ద కూడా ఇదే పరిస్థితి. గ్రామాల్లో పోటీ లేకపోవడంతో వారు చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో ప్రతి క్వింటాకు రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య రైతులు నష్టపోతున్నారు. ఆశలు నీరుగారిన వేళ ధరాఘాతం తప్పట్లేదు. బాగా నష్టపోతున్నాం.. గ్రామాల్లో, గోదాముల వద్ద వ్యాపారులు మిర్చి కొనుగోలు చేస్తున్నారు. మిర్చికి డిమాండ్ ఉన్నా..వాళ్లేమో రేటు పెట్టడం లేదు. దీంతో క్వింటాకు వేలల్లో నష్టపోతున్నాం.– భూక్యా వీరన్న, రైతు, బాలాజీనగర్ తండా,తిరుమలాయపాలెం మండలం నిర్వహణ నిలిచింది.. లాక్డౌన్ నిబంధనల కారణంగా మార్కెట్ల నిర్వహణ నిలిచిపోయింది. పంట కొనుగోళ్లను నిర్వహించలేకపోతున్నాం. గ్రామాల్లో, పలు అర్బన్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ పంట క్రయ విక్రయాలకు అవకాశం కల్పించాం.– కె.నాగరాజు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
నాన్నా.. మమ్మల్ని చూడు!
గుంటూరు, ప్రత్తిపాడు: ‘నాన్న లే.. ఒక్కసారి మమ్మల్ని చూడు. పెద్దోడా.. చిన్నోడా.. అంటూ ఇంక మమ్మల్ని ఎవరు పిలుస్తారు. లే నాన్నా’ అంటూ కన్న కొడుకులు తండ్రి మృతదేహం వద్ద బోరున విలపించిన ఘటన నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా దుగ్గిలి మండలం రాతన గ్రామానికి చెందిన చాకలి వీరేష్ (43), లక్ష్మి దంపతులు. వీరి కుమారులు వినోద్, శేఖర్. వీరికి 15 ఏళ్ల వయసుంటుంది. కలిసి కొద్ది నెలల కిందట వ్యవసాయ కూలి పనుల నిమిత్తం కుటుంబం మొత్తం ప్రత్తిపాడుకు వచ్చారు. లక్ష్మి మిర్చి కోతకు పొలం వెళ్లింది. కుమారులు కూడా మరో చోట మిర్చి కోతకెళ్లారు. అదుపుతప్పి నక్కవాగులో తిరగబడ్డ ట్రాక్టర్ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వీరేష్ ఒక్కడే ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ముందు టైర్ ఉన్నట్టుండి పేలింది. ట్రాక్టర్ పూర్తిగా అదుపు తప్పి నక్కవాగులోకి దూసుకువెళ్లి తిరగబడింది. భూమ్మీద ఉండాల్సిన నాలుగు చక్రాలు ఆకాశం వైపు చూసేంతగా జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న వీరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారులిద్దరూ ఘటనా స్థలానికొచ్చి తండ్రి మృతదేహం వద్ద బోరున విలపించారు. ‘నాన్నా లే.. మమ్మల్ని చూడు నాన్నా..’ అంటూ కన్నీటిపర్యంతమవడం చూపరులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు ఏఎస్ఐ కె శివశంకర్ సింగ్ పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. -
ఘాటెత్తుతున్న యార్డులు
సాక్షి, వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు రైతులు భారీ మొత్తంలో తీసుకొస్తున్నారు. దీంతో యార్డులన్నీ ఘూటుతో పోటెత్తుతున్నాయి. గత వారం రోజులుగా 30వేల నుంచి 80వేల బస్తాల మిర్చిని రైతులు మార్కెట్లో విక్రయించారు. వేలాది బస్తాలు రావడంతో ఉన్న ఉద్యోగులతో కాంటాలు పెట్టించడం వల్ల రాత్రి వరకు సాగుతోంది. ఒక్కోసారి మరుసటి రోజున కాంటాలు పెడుతున్నారు. దీనికి తోడుగా ఎండలు ముదురుతుండటం వల్ల ఘాటు ఎక్కువ వస్తుండటంతో రైతులు యార్డుల్లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన బస్తాల నుంచి షాంపిల్స్ తీయడం వల్ల కింద పడిన మిర్చి ధ్వసం కావడంతో ఈ ఘాటు మరింత ఎక్కువగా వస్తోంది. మిర్చి ఘాటు ప్రధాన రహదారి వరకు వస్తున్నదంటే ఎంత తీవ్రత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ‘తేజ’ రకమే... మార్కెట్లో తేజ రకానికే డిమాండ్ ఉండటంతో రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. వరంగల్ మార్కెట్‌కు బుధవారం సుమారు 60వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఇందులో తేజ రకం సగానికి పైగా వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మేలిరకం సరుకు రావడం వల్ల ధరలు గత మూడు రోజులుగా నిలకడగా ఉంటున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.8వేలకు పైగా ధరతో కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వండర్ హాట్, యుఎస్–341, సింగిల్పట్టి, డీడీ, సన్నాలు, 1048 లాంటి రకాలు మార్కెట్‌కు వస్తున్నాయి. మిర్చి రెండవ కోతలు ప్రారంభం జోరుగా సాగుతుండటంతో భారీగా సరుకు మార్కెట్‌కు వస్తోంది. మిర్చి నాణ్యతగా ఉన్నప్పటికీ భారీగా సరుకు వస్తున్నందున ధరలు కొన్నింటికే ఎక్కువగా ఇస్తూ మిగిలిన వాటికి అంతగా పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంటాలు జాప్యం.. మిర్చి యార్డుల్లో మార్కెట్లోని అన్ని యార్డులకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నా... కాంటాలు జాప్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటాలు వేసే సమయానికి కమీషన్‌దారులు, కొనుగోలుదారులు లేకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. మిర్చి రాక ఎక్కువ కావడం, ఎండల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో యార్డుల్లో వస్తున్న మిర్చి ఘాటుకు రైతులు తల్లడిల్లిపోతున్నారు. యార్డుల్లోని రైతుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాల్లో నీళ్లు వస్తున్నప్పటికీ ఆయా పరిసర స్రాంతాలు శుభ్రంగా ఉంచడంలో మార్కెట్ పారిశుధ్య సిబ్బంది విఫలమవుతున్నారు. యార్డులను శుభ్రం చేస్తున్నాం మిర్చి భారీగా వస్తున్నందున యార్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేస్తున్నాం. మిర్చి ఘాటు రాకుండా నీళ్లు చల్లించాలంటే బస్తాలు అడ్డంకిగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి రోజు సాధ్యమైన మేరకు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – రాంమోహ్మన్రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి -
ఎకరానికి రూ.70వేలు నష్టపరిహారం ఇవ్వాలి మిర్చి రైతులు
-
మిర్చి.. మిర్చి.. మిర్చిలాంటి రైతు
దొడ్డబళ్లాపురం : హుక్కేరి తాలూకాలో హిరణ్యకేశి, ఘటప్రభా నదులు ప్రవహిస్తున్నా అనేక గ్రామాలకు సాగునీరు అందడంలేదు...ఈ గ్రామాలపైకి రక్షి గ్రామం కూడా ఒకటి. రక్షి గ్రామం హిరణ్యకేశి నదికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఈ నది వర్షా కాలంలో మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి ఈ ప్రాంతాల రైతులు సాధారణంగానే కూరగాయలు పండించడానికి సాహసించరు. అయితే రైతు నాగరాజు హుండేకార మాత్రం సాహసించారు. పచ్చి మిరప పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచారు. నాగరాజుకు మొత్తం 5 ఎకరాల భూమి ఉంది. కానీ ఎత్తైన ప్రదేశంలో ఉంది. అందులో నాలుగు ఎకరాల్లో సోనల్ అనే రకం మిరపకాయలు సాగు చేస్తున్నాడు. మిగతా ఎకరా భూమిలో గ్రీన్హౌస్ నిర్మించి పలు రకాల కూరగాయలు పండిస్తున్నాడు. కూరగాయలు పండించడం కోసమే రైతు నాగరాజు తన భూమిలో బోర్వెల్ తవ్వించాడు. అయితే నీరు పడలేదు. డబ్బులు మాత్రం ఖర్చయ్యాయి. అయినా ఆత్మస్థైర్యంతో దూరంగా తగ్గు ప్రదేశంలో కాస్త భూమి తీసుకుని బోర్వెల్ వేయించాడు. అక్కడ నీరు పడడంతో అక్కడి నుండి పైపు లైను ద్వారా పంటకు నీరు కడుతున్నాడు. పంట వేయడానికి ముందు మిరపకాయ మొక్కలు నాట్లకు ముందు నాలుగు ఎకరాలకు గాను 10 టన్నుల కొట్టం ఎరువు, మూడు లారీల బూడిద ఎరువు వేయించాడు. మట్టిలో ఎరువులు బాగా కలిసేలా భూమిని దున్ని, తరువాత ఫాస్పెట్ రీచ్, ఆర్గానిక్ మెన్యూర్ (ఎకరాకు 500 కేజీలు), 40కేజీల సల్ఫ ర్, 60కేజీల వేపపిండి,సూక్ష్మ పోషకాంశాలు గల ఎరువు, వినికామ్ (ఎకరాకు 2 కేజీలు) మట్టిలో కలపడం జరిగింది. మొక్కలునాటాక అమోనియం సల్ఫేట్ చల్లడం జరిగింది. మొక్కలు పెరిగే కొద్దీ నిత్యం డ్రిప్ ద్వారా నీటితో ఎరువు అందించాడు. గత 4 నెలలుగా మిరప పంట కోత కోయిస్తున్నాడు. మొదట కేజీకి రూ.15 నుండి రూ.20 మాత్రమే లభించేది. అయితే ఇప్పుడు రూ.30ల వరకూ ధర పలుకుతోంది. ఇప్పటి వరకూ మొత్తం రూ.5 లక్షలు ఖర్చుకాగా 80 టన్నుల మిరప పంట దిగుబడి వచ్చింది. రూ.20 లక్షల దాకా ఆదాయం వచ్చిందిట. ఇంకా 20 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నాడు నాగరాజు. పంట బాగా పండటంతో వ్యాపారులు తోట వద్దకే వచ్చి ఖరీదు చేస్తున్నారని రైతు సంతోషం వ్యక్తం చేశాడు. -
మిరపకాయలను ఉచితంగా పంచిన రైతు
కలిగిరి: కష్టపడి సాగు చేసిన పచ్చిమిర్చికి కనీస ధర పలకకపోవడంతో ఆవేదన చెందిన రైతు, వ్యాపారులకు అమ్మడం ఇష్టం లేక శుక్రవారం ప్రజలకు ఉచితంగా పంచిపెట్టాడు. పోలంపాడు గ్రామానికి చెందిన కల్లూరి చంద్రమౌళి ఎకరా పొలంలో పచ్చిమిరప సాగు చేస్తున్నాడు. పచ్చిమిరపకాయలను బస్తా కోసుకొని అమ్మడానికి మోటర్బైకుపై కలిగిరికి వచ్చాడు. వ్యాపారులు కిలో రూ. 4కు మిరపకాయలు తీసుకుంటామన్నారు. ఆ ధరకు అమ్మితే కనీసం కోత కూలీలు కూడా రావని రైతు ఆవేదన చెందాడు. వ్యాపారులకు తక్కువ ధరకు పచ్చిమిరపకాయలను ఇవ్వడానికి ఇష్టం లేక పోలిస్‌స్టేషన్ సమీపంలోకి వచ్చాడు. అక్కడ ఉన్న ప్రజలకు బస్తాలోని పచ్చిమిరపకాయలను ఉచితంగా అందించాడు. రైతు చంద్రమౌళి కూరగాయలు పండించే రైతులకు చెల్లించే ధరలకు, మార్కెట్లో వ్యాపారులు అమ్మే ధరలకు పొంతన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
గిట్టుబాటు ధర లేక మిర్చి రైతు విలవిల
-
‘మిర్చి’ తరుణమొచ్చే..
ఖమ్మంవ్యవసాయం: మంచి తరుణం మించినా రాదు..అన్నట్లు ఇప్పుడు మిర్చి రైతులకు కలిసొచ్చే కాలమొచ్చింది. గతేడాది పండించిన మిర్చికి అప్పుడు క్వింటాకు రూ.4వేలు ఓ దశలో రూ.2వేలు మాత్రమే పలకడంతో..అడ్డికి అమ్ముకోలేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఈక్రమంలో ఇప్పుడు రేటు అమాంతం పెరిగి క్వింటా రూ.10వేలకు చేరింది. ప్రస్తుతం ఈఏడాది సాగు చేసిన పంట ఇంకా చేతికి రాలేదు. అయినా..పాత మిర్చికి మాత్రం రేటు బాగా పలుకుతోంది. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పలుకుతుండడంతో..మిరప కొనుగోళ్లకు ఆదరణ పెరిగింది. విదేశాల్లో డిమాండ్.. ఇక్కడ పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో మంచి ధర పడుతోంది. అక్కడ ఈ మిర్చి నుంచి నూనె (ఆయిల్) తీసి ఆహారంగా, ఇతర అవసరాలకు, రసాయనాల్లో వినియోగిస్తుంటారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో తేజా మిర్చి ఆయిల్ కొరత ఏర్పడటంతో ధరకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయంగా మిర్చికి రేటు పెరగడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మరో నెల రోజుల్లో ఈ ఏడాది సాగు చేసిన మిర్చి పంట ఉత్పత్తి రానుండటంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు, రైతులు విక్రయించేస్తున్నారు. ఇప్పటికే 4 వేల క్వింటాళ్ల వరకు విక్రయించేశారు. ఖమ్మం, మధిర, తల్లాడ తదితర ప్రాంతాల్లో మిర్చి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఏసీ మిర్చితో పాటు, తాలు మిరప బేరం కూడా కొనసాగుతోంది. వ్యాపారులు నేరుగా కోల్డ్ స్టోరేజీలకు వెళ్లి కొంటున్నారు. ఊహించని ధర.. గతేడాది పంట సీజన్లో మిర్చికి రూ.4వేలకు మించి ధర పలకలేదు. ఓ దశలో (ఏప్రిల్ నెల) క్వింటాకు రూ.2వేలు కూడా పడలేదు. 2015–16 సంవత్సరంలో పంటకు రూ. 13 వేల వరకు కూడా ధర పలికింది. దీంతో గతేడాది మిర్చిని విస్తారంగా సాగు చేశారు. ఉత్పత్తి కూడా పెరగడంతో ధర మందగిస్తూ పూర్తిగా పడిపోయింది. కనీసం పంట కోత కూలి ఖర్చులకు కూడా రాలేదు. చేసేది లేక, భవిష్యత్‌పై ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో పెద్ద ఎత్తున నిల్వలు పెట్టారు. వాటికి ప్రస్తుతం సీజన్‌తో పోలిస్తే రెట్టింపునకు పైగా రూ.10 వేల వరకు ధర పలుకుతుండడంతో ఆనందంలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 32 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఒక్కో కోల్డ్ స్టోరేజీలో 80నుంచి 1.10 లక్షల బస్తాల వరకు నిల్వ సామర్థ్యం ఉంది. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 32లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండగా, ప్రస్తుతం పంటకు ధర పలుకుతుండటంతో నిల్వలు సగానికి చేరి ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా 16 నుంచి 18 లక్షల బస్తాల వరకు స్టోరేజీల్లో నిల్వ ఉండి ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. దాదాపు నెల రోజుల్లో ఈ నిల్వలు మొత్తం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. -
కాసేపట్లో వెల్దుర్తికి వైఎస్ జగన్
-
మిర్చి రైతును నట్టేట్లో ముంచిన కేంద్రం
బీజేపీ నేతలపై మండిపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతును నట్టేట్లో ముంచిందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.మిర్చి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఢిల్లీలో నిలదీయకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు గల్లీలో రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్లో కొన్ని పార్టీలు చేసిన కుట్రలో తాము పాల్గొనలేకపోయామన్న బాధతోనే మిర్చి మార్కెట్ల వద్ద బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్చి రైతుల సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. -
మిర్చి రైతు కన్నీటి గాథ
-
కష్టాల ఊబిలో మిర్చి రైతు
► వంచించిన వ్యాపారులు ► పట్టించుకోని ప్రభుత్వం ► పడిపోయిన మిర్చి ధర ► జిల్లా కోల్డ్ స్టోరేజీలు గుంటూరు వ్యాపారులపరం ► పంట దాచుకునే అవకాశం లేక జిల్లా రైతు విలవిల ► తక్కువ ధరకే మిర్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి ► జిల్లావ్యాప్తంగా ఇప్పటికే ముగ్గురు మిర్చి రైతుల ఆత్మహత్య ► మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలుకు డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అటు ప్రభుత్వం, ఇటు వ్యాపారులు కలిసి మిరప రైతులను కష్టాల ఊబిలోకి నెట్టారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక ప్రభుత్వం రైతులను నడిరోడ్డుపైకి నెట్టింది. ప్రస్తుత ధరలతో పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు విలవిల్లాడుతున్నారు. అప్పుల ఊబిల్లో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన చెందుతున్నారు. పోనీ గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట దాచుకుందామనుకుంటే ఉన్న కోల్డ్ స్టోరేజీలను సైతం గుంటూరు జిల్లా వ్యాపారులు వశం చేసుకున్నారు. దీంతో ఏ దారీ లేక రైతులు మిరప పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది.జిల్లా వ్యాప్తంగా 52 కోల్డ్ స్టోరేజీలున్నాయి. అయితే గుంటూరు ప్రాంతానికి చెందిన మిర్చి వ్యాపారులు కోల్డ్ స్టోరేజీలను గుత్తమొత్తంగా తీసేసుకున్నారు. తక్కువ ధరకు రైతుల వద్ద మిర్చిని కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో స్టాకు పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు మిర్చిని దాచుకోవాలనుకున్న జిల్లా రైతులకు ఇది అడ్డంకిగా మారింది. కోల్డ్ స్టోరేజీల్లో ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో వారు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా లక్షా 50వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో సగటున 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వచ్చింది. గతేడాది బేడిగ రకం మిర్చి క్వింటా రూ.18 వేలు ఉండగా, తేజా రకం మిర్చి రూ.13 వేల వరకు ఉంది. ప్రస్తుతం బేడిగ రకం రూ.7 వేల లోపు ఉండగా తేజా రకం రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో మిర్చి అమ్మకానికి పెడితే రైతులకు పంట కోత కూలీలు కూడా వచ్చే పరిస్థితుల్లేవు. కౌలుతో కలుపుకొని ఎకరానికి లక్షా 20 వేల నుంచి లక్షా 50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత దిగుబడి, ధరను పోల్చి చూస్తే ఎకరానికి రూ.80 వేలకు తగ్గకుండా రైతుకు నష్టం వస్తోంది. ఒక వేళ ధర వచ్చే వరకు పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకుందామన్నా..గుంటూరు ప్రాంత వ్యాపారులు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. దీంతో ఇక్కడి రైతాంగం లబోదిబోమంటోంది. కోల్డ్ స్టోరేజీల్లో వ్యాపారులకు కాకుండా రైతులకు అవకాశమివ్వాలంటూ రైతులతో పాటు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యల దిశగా రైతులు: మిర్చి ధరలు పతనావస్థకు చేరడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆదిలో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులకు ఆ తర్వాత పంట దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇదే సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకులు సైతం రుణాలు కట్టాలంటూ రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇప్పటికే యర్రగొండపాలెం, దర్శి తదితర ప్రాంతాల పరిధిలో ముగ్గురు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఆత్మహత్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మిరప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకుండా సమస్యను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మిర్చిని మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వెంటనే ఫసల్ బీమా యోజన ఇవ్వాలి: మిరప రైతుల నుంచి 10 శాతం చొప్పున రూ.6 వేలు ఫసల్ బీమా యోజన కింద కట్టించుకున్నారు. దీనికి సంబంధించిన పరిహారాన్ని తక్షణం మిరప రైతులకు చెల్లించాలి. జిల్లాలోని అన్ని మండలాల ను కరువు మండలాలుగా ప్రకటించినందున వడ్డీ లేకుండా రీ–షెడ్యూలు రుణాలను రైతులకు ఇవ్వాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం తక్షణం స్పందించి మిరప రైతుల సమస్యను కేంద్రంపైకి నెట్టక మార్క్‌ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చి కొనుగోలు చేయాలని రైతు సంఘం నేత గోపినాథ్ డిమాండ్ చేశారు.