
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంపై మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను ఓదార్చేందుకు బుధవారం గుంటూరు మిర్చి యార్డ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల్ని ఓదార్చనున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
మిర్చి రైతుల గోడు వినడానికి వైఎస్ జగన్ రేపు (బుధవారం) మిర్చి యార్డుకు వస్తున్నారు.రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారు. మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యాన్ని రూ.1300 రూపాయలకే అమ్ముకున్నారు. పత్తి నాలుగు వేల రూపాయలకు కొనే దిక్కు లేదు.
వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వం నేరుగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధరల స్థిరీకరణ కోసం రూ.3000 కోట్లు కేటాయించాం. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై సిఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం.మేము అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేని ప్రతి పంట మా ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం నోరు మెదపదేం
మిర్చికు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్ని కలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్‌కి వస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఎకరానికి లక్షకు పైగా రైతు అప్పులు ఊబిలో కూలిపోయాడు.దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. మిర్చిపైన ఎందుకు మంత్రులు మాట్లాడట్లేదు’అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment