
మిర్చి రైతును నట్టేట్లో ముంచిన కేంద్రం
బీజేపీ నేతలపై మండిపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతును నట్టేట్లో ముంచిందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.మిర్చి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఢిల్లీలో నిలదీయకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు గల్లీలో రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్లో కొన్ని పార్టీలు చేసిన కుట్రలో తాము పాల్గొనలేకపోయామన్న బాధతోనే మిర్చి మార్కెట్ల వద్ద బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్చి రైతుల సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు.