ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ సిలబస్‌పై హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ఎయిడెడ్ అధ్యాపకులకు శిక్షణ తరగతులను నిర్వహించారు.
ఆంగ్ల అధ్యాపకులకు శిక్షణ తరగతులు
Aug 10 2016 12:06 AM | Updated on Sep 4 2017 8:34 AM
హన్మకొండ చౌరస్తా : ఇంటర్ మొదటి, రెండో సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ సిలబస్‌పై హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ఎయిడెడ్ అధ్యాపకులకు శిక్షణ తరగతులను నిర్వహించారు.
ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, కమిషనర్ డాక్టర్ ఏ.అశోక్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆర్‌జేడీ ఐఈ డాక్టర్ కాశీనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మొదటి రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ పై శిక్షణ కొనసాగింది. కార్యక్రమంలో ఆర్‌ఐఓ షేక్ అహ్మద్, రిటైర్డ్ ఆర్‌జేడీ మలహల్‌రావు, రిటైర్డ్ డీవీఈఓ ఎ.పరాయ్, జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.బాబురావు, రిసోర్స్ పర్సన్ ఇ.శ్రీనివాసరావు, టీఎస్ ప్రవీణ్‌కుమార్, ఇ.సత్యనారాయణ, స్వర్ణలత, డిప్యూటీ డీవీఈఓ రమణారావు, సూపరింటెండెంట్ మోహన్‌జీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement