రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వనున్నారు. స్టార్ హోటళ్లలో శిక్షణ వద్దని, దుబారా చేయవద్దన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచనల మేరకు అసెంబ్లీ కమిటీ హాల్లోనే సదస్సును ఏర్పాటు చేశారు.