MLAs MLCs
-
Ayodhya Ram Mandir: అయోధ్యలో యూపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అయోధ్య/లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి సుమారు 325 మంది అయోధ్యలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం లక్నో నుంచి 10 బస్సుల్లో, కొందరు తమ కార్లలో బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. నగరంలో వారికి ఘన స్వాగతం లభించింది. పుణేలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని వారితో కలిశారు. కొందరు శాసనసభ్యులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అంతా కలిపి సుమారు 400 మంది విడతల వారీగా సుమారు రెండున్నర గంటల సమయంలో బాల రాముడి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. రాముడిని దర్శించుకున్న వారిలో బీజేపీ మిత్ర పక్షాల శాసనసభ్యులతోపాటు కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన వారు కూడా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలె వరూ ఈ కార్యక్రమానికి రాలేదు. ప్రస్తుతం యూపీ శాసనసభలోని 399 మందిలో బీజేపీకి 252 మంది, మిత్రపక్షాలకు 19 మంది సభ్యుల బలముంది. ప్రతిపక్షంలో ఎస్పీకి 108 మంది, ఇతరులకు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సైతం ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. -
రాజకీయ కట్టప్పలు.. ఛీ కొడుతున్న ప్రజానీకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విశ్వసనీయత, విలువల్లేని రాజకీయ నేతల వల్ల నెల్లూరు జిల్లాకు చెడ్డపేరు వస్తోంది. వైఎస్సార్సీపీ బీ ఫారం ద్వారా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) పార్టీకి వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడంపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. వైఎస్ కుటుంబానికి వీరవిధేయులమని నిత్యం వల్లించిన ఆ ముగ్గురు శాసససభ్యులు డబ్బు కోసం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ప్రవర్తించారని ప్రజానీకం ఛీ కొడుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వైఎస్సార్సీపీ అధిష్టానం శుక్రవారం సస్పెన్షన్ వేటు వేయడంతో సింహపురి రాజకీయ కట్టప్పలకు సరైన గుణపాఠం చెప్పారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుటుంబంలో రాజకీయ సస్పెన్షన్ల చరిత్ర ఉంది. టీడీపీలో సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్రావుకి రామనారాయణరెడ్డి తండ్రి వెంకటరెడ్డి మద్దతు ఇవ్వడంతో అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. రాజకీయ గుర్తింపు వచ్చేలా చేశారు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాల్సిన ఆనం కుటుంబం వ్యతిరేకంగా పనిచేసింది. అయినా 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చేసుకుని వెంకటగిరి సీటును రామనారాయణరెడ్డికి ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడవడంతో సస్పెండ్ చేసింది. గతంలో కూడా.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఇప్పటికి రెండుసార్లు సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి విజయానికి సహకరించారు. దీంతో మేకపాటిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో మేకపాటి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడైన చంద్రశేఖర్‌రెడ్డికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం దక్కేలా చేశారు. 2014లో ఓటమి చెందినా 2019లో మళ్లీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ దఫా మాత్రం మేకపాటి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత కుటుంబంపైనే తిరుగుబాటు చేసినట్లు చెబుతున్నారు. అవినీతి, అక్రమాలను ప్రోత్సహించి వసూళ్ల రాజాగా మారారు. అతని తీరుపై ఫిర్యాదులు వెళ్లడంతో పార్టీ అధిష్టానం మందలించింది. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న సంకేతాలతో చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. నమ్మకద్రోహం చేసిన చంద్రశేఖర్‌రెడ్డి దిష్టిబొమ్మను వింజమూరులో శుక్రవారం దహనం చేశారు. ఆది నుంచి శ్రీధర్‌రెడ్డిది అదే తీరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరు ఆది నుంచి వివాదాస్పదమే. విద్యార్థి సంఘం నుంచి బీజేపీలో చేరిన ఆయన రూరల్ మండలాధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి చెందారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంతో 1989లో ఆ పార్టీ నుంచి సన్పెన్షన్కు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి నేదురుమల్లి జనార్దనరెడ్డి సహకారంతో యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ పదవి తెచ్చుకున్నారు. తర్వాత నేదురుమల్లితో విభేదించి అప్పటి పీసీసీ చీఫ్ హనుమంతరావు చెంతన చేరారు. ఆపై పి.జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వద్దకు వెళ్లారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కోటంరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి ఓ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. వైఎస్ మరణంతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రలో శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. జగన్ సముచిత స్థానం కల్పించి 2014, 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. అధికారం చేతిలో ఉందని విర్రవీగిన కోటంరెడ్డిపై అధిష్టానం సీరియస్ కావడంతో ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా చేసి టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తానంటూ టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి పెంచి పెద్ద చేసిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచారు. కొండాపురంలో.. కొండాపురం: మండలంలోని కొమ్మి గ్రామంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిచంద్రశేఖర్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఫ్లెక్సీకి చెప్పులు వేలాడదీశారు. అనంతరం చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గానికి పట్టిన పీడ విరగడైందని ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీకి అమ్ముడుబోయిన చంద్రశేఖర్‌రెడ్డికి సరైన శిక్ష వేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మన్నం వెంకటసుబ్బయ్య, మాల్యాద్రి, ప్రభాకర్, ఖాజారంతుల్లా, హరి చౌదరి, తేజ నాయక్, మధు, రాజేష్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అందరం కలిసి సుపరిపాలన అందిద్దాం
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాలునీళ్లలా కలిసి మెలిసి పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించేందుకు అంతా కృషి చేయాలన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి విజయవాడలోని బరంపార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులకు సీఎం విందు ఇచ్చారు. ఇద్దరు ఎంపీలు కూడా దీనికి హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ ఇందులో పాల్గొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! మనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అధికారులు, ప్రజాప్రతినిధులు సఖ్యతగా ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాటిని ప్రజలకు సంపూర్ణంగా అందించేందుకు పనిచేయాలన్నారు. అహంభావానికి తావు ఇవ్వవద్దని, ప్రజాప్రయోజనాలే అంతిమమని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం కోసం తరచూ సమావేశమవ్వాలని, సీఎం కార్యాలయ అధికారులు సహకరిస్తారని సీఎం చెప్పారు. కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్, డీజీపీ 1 నుంచి గ్రామాల బాట జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామాల బాట పట్టాలని ఆదేశించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను పరిశీలించాలని కోరారు. పథకాల లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, పేరు లేకపోతే అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా సూచిస్తున్నామన్నారు. మనకు ఓటు వేయని వారికి కూడా అర్హులైతే పథకాల ప్రయోజనాలు అందించాలన్నారు. ఉదయం 8 గంటల్లోపు, రాత్రి 9 గంటల తర్వాత అధికారులకు ఫోన్లు చేసి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగించొద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినప్పుడు అధికారులు కచ్చితంగా స్పందించాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారుల విందులో సీఎం జగన్, సీఎస్, డీజీపీ -
రైతు దినోత్సవానికి సర్వం సిద్ధం
సాక్షి, జమ్మలమడుగడు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర రైతు దినోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమాన్ని సొంత జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో సోమవారం పట్టణంలోని ముద్దనూరు రహదారిలో పనులను వేగ వంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే సభాప్రాంగణం పూర్తి చేయడంతోపాటు రైతులకు సంబంధించిన పరికరాల పంపిణీ కోసం, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం సభకు భారీగా వస్తారని అంచనాతో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి జిల్లాకు వస్తుండటంతో భారీగా ప్రజలు, రైతులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అదే స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు, మహిళలకు, ప్రజలకు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయించారు. వర్షం పడినా సభకు అంతరాయం కలుగకుండ రేకుల షెడ్లతో కూడిన సభావేదికను తీర్చిదిద్దారు. భారీగా బందోబస్తు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దినోత్సవ సభకు హాజరవుతుండటంతో పాటు జిల్లాలోని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయాశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిధున్రెడ్డిలతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి, ఆళ్లగడ్డ, అనంతపురం జిల్లా నుంచి తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు సైతం ఈ సభకు హాజరవుతుండటంతో పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
నేడు 2వ రోజు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు గురువారం రెండవ రోజు ప్రారంభంకానున్నాయి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణ రావు ప్రసంగం ఇవ్వనున్నారు. అనంతరం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. మధ్యాహ్నం సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ సభ్యుల పాత్ర అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడతారు. శాసన సభ్యులు రాజకీయ నైతికత, ప్రజామోదం అంశంపై డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ ప్రసంగించనున్నారు. -
2వ రోజు శిక్షణ తరగతులు
-
ముఖ్యమంత్రి అసెంబ్లీ పాఠాలు
-
ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో అవకాశాలు దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలు అని అనుకోకూడదని, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుందని అన్నారు. చదవండి: ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు ప్రారంభం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ముందు కసరత్తు చెయ్యాలని, ఎంత గొప్ప వ్యాఖ్యాత అయిన అసెంబ్లీలో ఫెయిల్ అవుతారని ఆయన అన్నారు. సభలో నిబంధనల ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని, ప్రతి అంశంపై సభ్యుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అవకాశం వచ్చి మాట్లాడకుంటే ఆ సభ్యుడు ఫెయిల్ అవుతారని అన్నారు. సరైన ప్రజెంటేషన్ లేకుంటే సభ్యుడు రాణించలేడని ఆయన పేర్కొన్నారు. సభా సమయాన్ని వృధా చేయొద్దని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే రూల్స్ బుక్‌ని చదవాలని ముఖ్యమంత్రి సూచన చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తాను తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రిపేర్ అయ్యేవాడనని సీఎం జగన్ తెలిపారు. ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుంది.. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే గత ప్రభుత్వం మైక్‌లు కట్ చేసేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ప్రభుత్వంలో ఉన్న విధంగా ఈ అసెంబ్లీ నిర్వహణ ఉండదని అన్నారు. శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉంటేనే బాగుంటుందన్నారు. టీడీపీకీ 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో అయిదుగురిని లాగేస్తే ప్రతిపక్షం ఉండదని తనకు చాలామంది చెప్పారన్నారు. కానీ తాను అలా చేయనని చెప్పానని, పార్టీ మారితే రాజీనామా అయినా చేయాలి, లేకుంటే అనర్హత వేటు అయినా వేయాలని అన్నారు. ఇక్కడ గతంలో ఎక్కడా అనర్హత వేటు వేయలేదని, రాజీనామాలు చేయించలేదని, వీటిని భిన్నంగా ఉండాలంటే మనం మార్గదర్శకంగా ఉండాలన్నారు. మనకు వాళ్లకు తేడా ఉండాలి కదా అన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షం అనేది ఉండాలని, మనం ఎవరైనా ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే రాజీనామా చేయించాలని, ప్రజల్లోకి వెళ్లి మనం గెలిపించుకున్న తరువాత మన ఎమ్మెల్యే అవుతారని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్షం ఏం మాట్లాడినా సమాధానం ఇస్తాం ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తామని, వారు చెప్పేది కూడా పూర్తి విందామని సీఎం తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం చెప్పే సమాధానంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మనపై మనకు, పాలనపై అంతకన్న నమ్మకం ఉందని అన్నారు. చంద్రబాబు గురించి చెప్పేముందు ఒక్క మాట కూడా చెప్పాలని, ఆయనకు చంద్రబాబుకు అబద్దాలు చెప్పే అలవాటు ఉందని.. గతంలో అందరికి గుర్తు ఉండే ఉంటుందని, నాన్నగారు (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఒక ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నకిలీ డాక్యుమెంటరీ తీసుకొచ్చారని, అసెంబ్లీలో నాన్నకు కూడా అర్థం కాలేదని, ఏంటి అని గమనిస్తే..ఆ డ్యాకుమెంట్ నకిలీ అని గుర్తించారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో నాన్నగారు ఒరిజినల్ డాక్యుమెంటరీ ఎందుకు చూపించావు అంటే..ఆయన అబద్ధాలు చెప్పారన్నారు. ఇలా అబద్ధాలు ఆడితేనే మీరు నిజం చెబుతానని చంద్రబాబు ఒప్పుకున్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. అలాంటి తప్పుడు పని ఈ అసెంబ్లీలో సభ్యులెవరూ చేయకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభలో మోసాలు, అబద్ధం చెప్పే కార్యక్రమం ఉండకూడదని, సభలో తప్పు చేయొద్దని, అవాస్తవాలు చెప్పొద్దని ముఖ్యమంత్రి సూచిస్తూ...చర్చ జరిగే అంశంపై పూర్తి అవగాహనతో రావాలన్నారు. సభ్యులు సమావేశాలకు గైర్హాజరు కావద్దని కోరారు. అసెంబ్లీ ప్రారంభం కంటే కనీసం 30 నిమిషాలు ముందు ఉండాలని, ప్రతి పదిమంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యేలను సమన్వయం కోసం కేటాయిస్తామన్నారు. ఈసారి హుందాగా సభ నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. చట్టాలు చేసే సభలో ప్రతి చట్టాన్ని గౌరవిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కాగా స్పీకర్ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. -
సభలో తప్పు చేయొద్దు, అవాస్తవాలు చెప్పొద్దు..
-
నేడు ,రేపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు
-
ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు ప్రారంభం
సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారం ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వనున్నారు. స్టార్ హోటళ్లలో శిక్షణ వద్దని, దుబారా చేయవద్దన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు అసెంబ్లీ కమిటీ హాల్లోనే సదస్సును ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి రూపాయి ఆదా చేసే దిశగా అతి తక్కువ ఖర్చుతో శిక్షణ ఇస్తుండగా.. గత ప్రభుత్వంలో గ్రాండ్ కాకతీయలో శిక్షణ తరగతులు నిర్వహించి ప్రజాధనాన్ని వృధా చేశారు. నేటి శిక్షణ తరగతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు హాజరుకాగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాకపోవటం గమనార్హం. -
అర్హులందరికీ నవరత్నాలు
సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అర్హులందరికీ నవరత్నాలను అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. శనివారం ఆయన జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాక్షి, అనంతపురం అర్బన్: ‘జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి. సుపరిపాలన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత సంక్షేమ పాలన అందించే దిశగా ముందుకెళుతోంది. ‘నవరత్నాల’ ఫలాలు అర్హులైన ప్రతి పేదవానికి అందాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిద్దాం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, కరువుతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా రైతులకు రూ.1,007 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఈ క్రమంలోనే రైతులను ఆదుకునేందుకు 2014 నుంచి వారికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.2,000 కోట్లు ఇచ్చేందుకు తొలి కేబినెట్లోనే ఆమోదం తెలిపారన్నారు. ఇందులో జిల్లా రైతులకు రూ.1,007 కోట్లు అందనుందని తెలిపారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, రైతు భరోసా ద్వారా పేద రైతులకు పెట్టుబడికి ఏటా రూ.12,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పకృతి వైపరిత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో పకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతి పేదవానికి ఇల్లు, వృద్ధులకు దశలవారీగా పింఛన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్ అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, నిత్యావసరాలను ఇంటికే చేర్చడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి), సీపీఎస్ రద్దు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనం, రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లాంటి కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్నారని గుర్తు చేశారు. తాగునీరు, వ్యవసాయం, విత్తన పంపిణీ, ఉద్యన పంటలు, తదితర అంశాలపై సమీక్షించారు.సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్, ఎమ్మెలేలు వై.వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉరవకొండలో నీటి ఎద్దడి ఉరవకొండ పట్టణంలో తొమ్మిది రోజులుగా నీటి సరఫరా లేదు. నిర్వహణ లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. వారంలోగా సమస్య పరిష్కరించాలి. పంటల బీమాలో మార్పు తేవాలి. వాతావరణ బీమా వల్ల రైతుకు ప్రయోజనం కలగడం లేదు. గ్రామం యూనిట్‌గా బీమా వర్తించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. – పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే ఎస్కేయూలో నీటి ఎద్దడి పరిష్కరించాలి శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి. నగర పాలక సంస్థలో ఉపాధ్యాయులకు సంబంధించి రూ.36 లక్షలు దుర్వినియోగమయ్యాయి. విచారణ చేసి వారి ఖాతాల్లో జమ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు కొన్ని పాఠశాల్లో నీటి సమస్య ఉంది. అలాంటి చోట ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. – కత్తినరసింహారెడ్డి, ఎమ్మెల్సీ రిజర్వాయర్‌తో శాశ్వత పరిష్కారం నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జీడిపల్లి, పీఏబీఆర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఆత్మకూరు మండల కేంద్రానికి నీటిని ఇవ్వవచ్చు. పీఏబీఆర్ పైన్లైన్ ద్వారా కక్కలపల్లి, నారాయణపురం, రాజీవ్‌కాలనీ, ఇలా మరికొన్ని పంచాయతీలకు నీటిని ఇవ్వడం ద్వారా ఎద్దడి నివారించవచ్చు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు జరగాలి. ప్రత్యేకంగా బెంగుళూరు, తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలను ఒక చోటకు చేర్చి సదస్సు నిర్వహించాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆ దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. బుక్కపట్నం, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ ఉండేలా చూడాలి. ఇందుకు స్లూయిజ్ గేట్లు ఏర్పాటు చేయాలి. – దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే జేసీ నాగిరెడ్డి పథకం పూర్తి చేయాలి తాడిపత్రిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. పెన్నా, చిత్రావతిలో ఇసుక తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇసుకు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జేసీ నాగిరెడ్డి పథకాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే తాగునీటి ఎద్దడి అధికం మా నియోజకర్గలోని 120 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీరు ఇవ్వకుండా తుమ్మలూరుకు తీసుకెళ్లడం ఏమిటి. శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలి. రోడ్డు విస్తరణలో భాగంగా బాలికల పాఠశాల కూల్చేశారు. – డాక్టర్ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే నీటి సమస్య తీవ్రంగా ఉంది మా నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. సత్యసాయి పైప్‌లైన్–2 ద్వారా నీటిని అందించాలి. సీపీడబ్లూ స్కీమ్ ద్వారా ట్యాంక్‌లు నింపాలి. నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాల్లో తక్షణం నీరు సరఫరా చేయాలి. తీవ్ర వర్షాభావంతో మామిడి చెట్లు ఎండిపోతున్నాయి. – డాక్టర్ సిద్ధారెడ్డి, కదిరి ఎమ్మెల్యే శాశ్వత చర్యలు చేపట్టాలి జిల్లావ్యాప్తంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలి. శింగనమల చెరువు చాలా పెద్దది. పైనున్న వారు నీటిని తమ ప్రాంతాలకు మళ్లిస్తుండడంతో ఈ చెరువుకు నీరు రావడం లేదు. ఈసారి తప్పకుండా చెరువు నింపాలి. బీసీ హాస్టల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. – శమంతకమణి, ఎమ్మెల్సీ -
వీడలేమంటూ..వీడ్కోలంటూ..
ఎక్కడో పుట్టి..ఎక్కడో ఎన్నికై.. ఇక్కడే కలిశాం..వీడలేమంటూ వీడ్కో లంటూ.. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన సభ్యులు శనివారం చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశంతో విడిపోయారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జెడ్పీ విభజ న జరగడం..ఇటీవల కొత్త పాలకవర్గాలు ఎన్నిక కావడంతో అరవై ఏళ్ల అనుబంధానికి ఫుల్స్టాప్ పడింది. చివరిరోజు ఆత్మీయ పలకరింపులు..సన్మానాలు, సత్కారాలు, ఆద్యంతం ఉద్విగ్న భరిత వాతావరణంలో సభ్యులంతా పాత జెడ్పీకి బైబై చెప్పారు. సాక్షి, ఆదిలాబాద్: యాభై రెండు మంది జెడ్పీటీసీలు.. పది మంది శాసన సభ్యులు.. అందులోంచే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. జిల్లా ఉన్నతాధికారులు.. వీరంతా ఒకేసారి కలిసేది ఉమ్మడి జెడ్పీ సమావేశం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నాలుగు జిల్లాల కలెక్టర్లు అదనపు ఆకర్షణగా నిలిచింది. చరిత్ర కలిగిన ఉమ్మడి జెడ్పీ ఠీవి ఇక ముగిసిన ప్రస్థానం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త జెడ్పీ పాలకవర్గాలు త్వరలో కొలువుదీరనుండగా, ఉమ్మడి జిల్లాలోని పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల పూర్తి కావస్తుంది. అంతకుముందు చివరిసారిగా సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్పర్సన్ వి.శోభాసత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్, ఇన్చార్జి ఆదిలాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆదిలాబాద్ జేసీ సంధ్యారాణి, మంచిర్యాల జేసీ సురేందర్‌రావు, నిర్మల్ ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు. మధుర క్షణాలు.. ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశం ప్రారంభమైంది. వేదికను జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్, జేసీలు, జెడ్పీ సీఈఓ కె.నరేందర్ అలంకరించారు. ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రాథోడ్ బాపురావు వేదిక ఎదురుగా ఆసీనులయ్యారు. జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజీరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అదే వరుసలో కూర్చున్నారు. సమావేశం మధ్యలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ పాలకవర్గానికి ఇదే చివరి సభ అని, జూలై 4 వరకు పదవీ కాలం ఉన్నా అధికారికంగా సభ ఇదే చివరిదని పేర్కొన్నారు. ఈ సభలో సభ్యులు హుందాగా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రధాన అంశాలపైనే చర్చ.. ఉమ్మడి జెడ్పీ చివరి సమావేశంలో ఎజెండా అంశాలు అనేకంగా ఉన్నా ప్రధాన అంశాలపైనే చర్చ సాగింది. సమావేశంలోనే సభ్యులకు వీడ్కోలులో భాగంగా సన్మానం చేయాలని ముందుగానే నిర్ణయించడంతో ప్రధాన అంశాల మట్టుకు చర్చించారు. మిషన్ భగీరథ, హరితహారం, వ్యవసాయంపై మాట్లాడారు. సభలో జెడ్పీటీసీలు అశోక్, జగ్జీవన్, సుజాత, రాథోడ్ విమల, కేశవ్‌గిత్తే వివిధ అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా వర్షాలు పడిన తర్వాత హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని మంత్రి ఐకేరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం సమావేశాన్ని ముగిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుండె దిటువు.. సన్మాన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత సభ్యుల్లో తాము ఇక ఒకేచోట కలవలేమన్న ఆవేదన కనిపించింది. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన ప్రస్తానం వారి కళ్లముందు కదలాడింది. మొదట సభ్యులు సభ ప్రాంగణంలోకి వస్తున్న సమ యంలోనూ అందరిలో ఈ పాలకవర్గానికి ఇదే చివరి సభ కావడంతో వస్తువస్తూనే ఒకరికొకరు పలకరించుకోవడం కనిపించింది. మహిళ సభ్యులు గుమిగూడి మాట్లాడుకోవడం అగు పించింది. పురుష సభ్యులు కరచలనం చేసుకుంటూ కనిపించారు. మొత్తం మీదా సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వీడ్కోలు ఘట్టం వారి హావభావాలతో కొనసాగింది. మొదట ఉమ్మడి జిల్లా మంత్రి ఐకేరెడ్డిని జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, వైస్‌చైర్మన్ మూల రాజీరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణిని మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, తదితరులను సన్మానించి మెమోంటోలను అందజేశారు. సభ్యులకు సన్మానం.. జెడ్పీటీసీలకు ఆ తర్వాత సన్మానం నిర్వహించారు. మొదట మహిళా జెడ్పీటీసీలను అనంతరం మిగతా జెడ్పీటీసీలకు శాలువా కప్పి పూలమాల వేసి జ్ఞాపికను ఇచ్చి సన్మానించారు. జైనూర్ జెడ్పీటీసీ మస్రత్ ఖానమ్‌ను సన్మానించినప్పుడు ఆమె ప్రసంగించారు. ఐదేళ్లు సభలో ఎంతో నేర్చుకున్నామని, ఏదైన తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరారు. మంత్రి, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేల సహకారం మరవలేనిదన్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరిలో ఒక రకమైన ఆవేదన కనిపించింది. అనంతరం సభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఐదేళ్ల జ్ఞాపకాలను చివరి రోజు మధుర ఘట్టంగా మలుచుకున్నారు. అదే సందర్భంలో మంత్రి ఐకేరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలుగా పదవి కాలం ముగిసినప్పటికీ భవిష్యత్‌లో ఇతర పదవుల ద్వారా ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. -
వైఎస్సార్ఎల్పీ సమావేశం నేడు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని ఈ నెల 8వ తేదీన విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో 7వ తేదీన ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష (వైఎస్సార్ఎల్పీ) సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ భేటీకి 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన రెండో శాసనసభలోకి అడుగు పెడుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పునకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలనే దానిపై ప్రధానంగా జగన్ మాట్లాడతారని తెలుస్తోంది. వాగ్దానాల అమలు... పార్టీ బలోపేతం మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుందన్న ఊహాగానాలు ఎమ్మెల్యేల్లో సాగుతుండడంతో ఈ అంశంపై కూడా జగన్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రభుత్వ పరంగా కృషి చేయడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గం కూర్పు విషయంలో ప్రాంతీయ, సామాజిక వర్గాల మధ్య పాటించాల్సిన సమతౌల్యం, పార్టీలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు వివరిస్తారని సమాచారం. 10న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు! శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన విధంగానే మంత్రివర్గాన్ని సైతం విడతల వారీగా కాకుండా ఒకేసారి విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీలో చర్చ సాగుతోంది. 8వ తేదీన 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవుల ఎంపికపైనా జగన్ పూర్తి స్పష్టతతో ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అయితే కొత్త శాసనసభ ప్రారంభానికి ముందు విజయం సాధించిన పార్టీ తమ శాసనసభాపక్షం నేతను ఎన్నుకోవడానికే సమావేశం అవుతూ ఉంటుంది. ఆ తరువాత మళ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తరువాతనే తదుపరి శాసనసభాపక్షం సమావేశమవుతుంది. కానీ, దీనికి భిన్నంగా జగన్ ప్రస్తుతం కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తొలి శాసనసభా సమావేశాల ప్రారంభానికి ముందే మరోసారి తమ పార్టీ శాసనసభాపక్షాన్ని సమావేశపరుస్తున్నారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఆ తరువాత రెండు రోజులకు జూన్ 10వ తేదీన నూతనంగా విస్తరించిన మంత్రివర్గం తొలి సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరుగుతుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన పలు సంకేతాలను జగన్ ఇచ్చారు. 14న ఉభయ సభల సంయుక్త సమావేశం రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజున ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన 175 ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకేరోజున ప్రమాణ స్వీకారం పూర్తయితే, మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాలు రెండోరోజు కూడా కొనసాగితే.. అవి ముగిశాక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 14వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తరువాత రోజున ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు సభల్లోనూ చర్చ, ముఖ్యమంత్రి సమాధానానికి ఆమోదం ఉంటాయి. -
మంత్రులు,అధికారులపై చంద్రబాబు ఆగ్రహం
-
నియంత రాజ్యంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా తెలంగాణను నియంత రాజ్యంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో విలీనం చేసుకోవడం ద్వారా కేసీఆర్ శాసనవ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని నిర్ధారణ అయిందన్నారు. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన 25 మంది ఎమ్మెల్యేలు, రెండు డజన్ల మంది ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇచ్చిన పిటిషన్లను స్పీకర్, మండలి చైర్మన్లు పట్టించుకోలేదని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దయ కోసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోని ఆ ఇద్దరూ రాజ్యాంగాన్ని మోసగించిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు శాసన వ్యవస్థ పట్ల గౌరవం లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇప్పటివరకు కేబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడం, గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. -
వేటు వేయిద్దాం
సాక్షి, హైదరాబాద్: టీడీపీలో చేరిన పార్టీ ఎమ్మెల్సీలపై చర్యలకు కాంగ్రెస్ రంగం సిద్ధంచేస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారితోపాటు పార్టీకి అనుబంధంగా కొనసాగి పార్టీ మారిన ఎమ్మెల్సీలకూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఈ నోటీసులు ఇవ్వనున్నారు. షోకాజ్ నోటీసులకు ఆయా ఎమ్మెల్సీలు వారం రోజుల్లో సమాధానమివ్వాలని కోరనున్నారు. ఎమ్మెల్సీల సమాధానాలు అందిన తదుపరి పార్టీ మండలిలో కాంగ్రెస్ పక్షం ద్వారా ఆ ఎమ్మెల్సీలపై అనర్హత చర్యలకోసం చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఛైర్మన్‌కు సమర్పించనున్నారు. లక్ష్మీ శివకుమారి, బలశాలి ఇందిర, షేక్ హుస్సేన్, రవి కిరణ్‌వర్మ, చైతన్యరాజు, శ్రీనివాసులునాయుడు, బచ్చల పుల్లయ్యలు సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారు కాగా మరికొందరు ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగారు. వారు పార్టీ కండువాలు కప్పుకోవడంతో పాటు తాము తెలుగుదేశంలో చేరినట్లు బహిరంగంగా కూడా ప్రకటించారు. మరో ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఇంతకుముందే టీడీపీలో చేరి మండలి సమావేశాలకు టీడీపీ కండువా వేసుకొని హాజరవుతున్నారు. సోమవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భేటీ అయినప్పుడు ఈ ఎమ్మెల్సీల వ్యవహారం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మండలిలో బలం పెంచుకొనేందుకు టీడీపీ ఇతర పార్టీల ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేస్తోందని రఘువీరా చెప్పారు. పార్టీ మారిన వారికి షోకాజ్ నోటీసులివ్వడంతోపాటు, టీడీపీలో చేరినట్లు సాక్ష్యాధారాలతో సహా మండలి ఛైర్మన్‌కు అనర్హత ఫిర్యాదు అందించాలని అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్‌లో మిగిలింది వీరే: ఇటీవల టీడీపీలోకి ఫిరాయించినవారు పోగా కాంగ్రెస్ పార్టీకి మండలిలో మిగిలిన సభ్యులు కొందరే. ఎమ్మెల్యే కోటాలో రుద్రరాజు పద్మరాజు, సింగం బసవపున్నయ్య, బి.చెంగల్రాయుడు, పాలడుగు వెంకటరావు, మహ్మద్ జానీ, సి.రామచంద్రయ్య, ఎం సుధాకర్బాబులున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఐలాపురపు వెంక య్య, డీవీ సూర్యనారాయణరాజు, పీరుకట్ల విశ్వప్రసాదరావు, వాకాటి నారాయణరెడ్డి ఉన్నారు. వీరుకాకుండా గవర్నర్ నామినేటెడ్ కోటాలో కంతే టి సత్యనారాయణరాజు, రత్నాబాయి, జూపూడి ప్రభాకర్‌రావు, షేక్ హుస్సేన్, బలశాలి ఇందిర, డాక్టర్ ఎ.చక్రపాణి, ఆర్ రెడ్డపరెడ్డిలు కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులైనవారే కావడంతో కాంగ్రెస్ సభ్యులుగానే పరిగణనలోకి వస్తున్నారు.