
13,14 తేదీల్లో ఏపీసీసీ శిక్షణ తరగతులు
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు శిక్షణ తరగతులను ఈ నెల 13,14 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రతినిధి ఎస్.ఎన్ రాజా ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యలను క్షేత్ర స్థాయిలో కి తీసుకెళ్లేందుకు రెండు రోజుల పాటు తొమ్మిది అంశాలపై శిక్షణను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదాపై మండల స్థాయిలో పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్లు రాజా వెల్లడించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, నగర అధ్యక్షులు మల్లాది విష్టు ఆధ్వర్యంలో తరగతులు జరుతాయన్నారు.