
సాక్షి, విజయవాడ : బడుగు, బలహీన వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలనూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. బీసీ జనసభ అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ చేరిక సందర్భంగా ఆదివారం విజయవాడలో న్విహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాండ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి పల్లంరాజులు డాక్టర్ గంగాధర్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటాలు చేస్తుందని, గంగాధర్ రాకతో పార్టీకి పునర్వైభవం వచ్చిందని కేవీపీ అన్నారు. మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరును ఎండగట్టారు. ‘‘పరిపాలనా దక్షత ఏమాత్రంలేని మోదీ.. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. చరిత్రలోనే లేనివిధంగా నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారంటే దేశంలో పరిపాలన ఏవిధంగా సాగుతున్నదో అర్థంచేసుకోవచ్చు. గురువు అద్వానీకి కనీసం నమస్కారం పెట్టని మోదీ ఎంత కుసంస్కారో ప్రజలే అర్థంచేసుకోవాలి’’ అని పల్లంరాజు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment