ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరాలి | Jogu ramanna about vidya nidhi scheme | Sakshi
Sakshi News home page

ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరాలి

Published Tue, Oct 25 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరాలి

ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరాలి

మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని మంత్రి జోగురామన్న అన్నారు. సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేయాలని, ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల 2 రోజుల శిక్షణ తరగతుల్ని ఆయన ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ బీసీ విద్యానిధి పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఈ పథకం కింద అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు, ఈడిగ ఆంజనేయులుగౌడ్, గౌరీశంకర్‌లు మంత్రితో భేటి అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement